రాత్రి 8 గంటకి Realme 5 ఫ్లాష్ సేల్ జరుగనుంది
ఈ స్మార్ట్ ఫోన్స్ ఒక స్నాప్డ్రాగెన్ 665 ఆక్టా కోర్ ప్రాసెసరుతో పనిచేస్తుంది.
బడ్జెట్ ధరలో వెనుక 4 కెమెరాలతో ఇండియాలో Realme సంస్థ విడుదల చేసినటువంటి, Realme 5 యొక్క ఫ్లాష్ సేల్ ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు జరుగగా, రాత్రి 8 గంటకి కూడా ఈ ఫోన్ యొక్క మరొక ఫ్లాష్ సేల్ చేయనున్నట్లు సంస్థ ప్రకటించింది. ఈ ఫోన్ కేవలం Rs.10,000 కంటే తక్కువ ధరలో వెనుక ఒక క్వాడ్ (నాలుగు) కెమేరా సెటప్పుతో రావడంతో గొప్ప అమ్మకాలను సాధిస్తునట్లు తెలుస్తోంది.
SurveyRealme 5 ధరలు
1. Realme 5 (3GB + 32GB) ధర – Rs.9,999
2. Realme 5 (4GB + 64GB) ధర – Rs.10,999
3. Realme 5 (4GB + 128GB) ధర – Rs.11,999
Realme 5 : ప్రత్యేకతలు
రియల్మీ సంస్థ, ఈ Realme 5 స్మార్ట్ ఫోన్ ఒక 6.5 అంగుళాల మినీ డ్రాప్ డిజైన్ డిస్ప్లేతో వస్తుంది. ఈ అతి చిన్నని నోచ్ డిజైనులో, సెల్ఫీల కోసం సెల్ఫీ కెమేరాని ఇందులో అందించింది. అలాగే ఈ డిస్ప్లే ఒక కార్ణింగ్ గొరిల్లా గ్లాస్ 3+ రక్షణతో అందించబడినది. ఈ స్మార్ట్ఫోన్ 89 శాతం స్క్రీన్-టు-బాడీ నిష్పత్తితో వస్తుంది. అలాగే, వెనుక భాగంలో సరికొత్తగా ఒక క్రిస్టల్ డిజైన్ అందించింది. ఇందులో 10 W వేగవంతమైన ఛార్జింగ్ టెక్నాలజీతో 5000 mAh బ్యాటరీతో వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్స్ ఒక స్నాప్డ్రాగెన్ 665 ఆక్టా కోర్ ప్రాసెసరుతో పనిచేస్తుంది. ఇది గరిష్టంగా, 2.0GHz వరకు క్లాక్ స్పీడును అందిస్తుంది దీని జతగా 3GB/4GB ర్యామ్ మరియు 32GB /64GB /128GB స్టోరేజి ఎంపికలతో ఎంచుకోవచ్చు.
ఈ స్మార్ట్ ఫోను యొక్క వెనుక భాగంలో ఒక క్వాడ్ కెమేరా సెటప్పును అందించింది. ఒక ప్రధాన 12MP కెమేరాతో కూడిన క్వాడ్ రియర్ కెమెరా ఇందులో వ్వబడింది. అలాగే, ఇది 8MP వైడ్ యాంగిల్ లెన్స్ మరియు 2MP డెప్త్ సెన్సార్ కి జతగా 2MP మాక్రో కెమేరా కలిగి ఉంది. ఈ కెమెరాలో అందించిన కెమేరాతో 10X డిజిటల్ జూమ్ చేసుకోవచ్చు. ముందు కెమెరా విషయానికి వస్తే, 13 MP సెల్ఫీ కెమేరాతో వస్తుంది. ఇది క్రిస్టల్ బ్లూ , క్రిస్టల్పర్పల్ వంటి రెండు రంగుల ఎంపికలతో లభిస్తుంది. ఈ ఫోన్, కలర్ OS 6 స్కిన్ తో ఆండ్రాయిడ్ 9 ఫై ఆధారితంగా నడుస్తుంది.