రియల్మీ 4 మరియు 4 ప్రో ఆన్లైన్లో దర్శన మిచ్చాయి.

Updated on 12-Jul-2019
HIGHLIGHTS

ఈ స్మార్ట్ ఫోన్లు త్వరలో మార్కెట్లో తన స్థానాన్ని సంపాదించుకుంటుందని భావిస్తున్నారు.

రియల్మీ, ముందుగా చైనాలో విడుదల చేసినటువంటి తన రియల్మీ X స్మార్ట్ ఫోన్ను ఈ నెల 15 న లాంచ్ చేస్తోంది మరియు రియల్మీ 3i స్మార్ట్ ఫోన్నుకూడా అదే సమయంలో లాంచ్ చేయవచ్చని వార్తలు వస్తున్నాయి. అయితే, రియల్మీ అంతటితో ఆగిపోలేదు మరియు త్వరలో దాని పోర్ట్‌ఫోలియోను మరింతగా పెంచడానికి రియల్మీ 4 మరియు 4 ప్రో స్మార్ట్‌ఫోన్‌లను కూడా తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఈ పేరు సూచించినట్లుగా, ఈ ఫోన్లు రియల్మీ 3 మరియు రియల్మీ 3 ప్రో యొక్క స్థానాలను భర్తీ చేయనున్నాయి. ఈ కొత్త రియల్మ్ ఫోన్‌లను యురేషియా ఎకనామిక్ కమిషన్ ధృవీకరించింది, ఈ స్మార్ట్ ఫోన్లు త్వరలో మార్కెట్లో తన స్థానాన్ని సంపాదించుకుంటుందని భావిస్తున్నారు.

GizmoChina నివేదిక ప్రకారం, RMX1921, RMX1927 మరియు RMX1971 మోడల్ సంఖ్యలతో మూడు ఫోన్లు కనిపించినట్లు మరియు ఈ మూడు మోడళ్లలో రెండు కొత్త రియల్మీ 4 మరియు 4 ప్రో స్మార్ట్‌ఫోన్‌లు కావచ్చని తెలుస్తోంది. ఒకసారి గుర్తుచేసుకుంటే, రియల్మీ 3 మరియు 3 ప్రోలకు వరుసగా RMX1821 మరియు RMX1851 మోడల్ నంబర్లు ఇవ్వబడ్డాయి. దీన్నిఅనుసరిస్తే, రియల్మీ 4 నిరాడంబరమైన RMX1921 మోడల్ ను కలిగి ఉండవచ్చని మరియు 4 ప్రోకి RMX1971 మోడల్ నంబర్ ఇవ్వబడిందనే ఉహాగానాలు ఉన్నాయి.

ఈ మోడల్ నంబర్లతో పాటు, ఈ లిస్టింగ్ నుండి వచ్చే ఫోన్‌ల గురించి మిగిలిన వివరాలు తెలియదు. అయితే, గత నెలలో రియల్మీ 4 యొక్క రిటైల్ బాక్స్ ఆన్‌లైన్‌లో కనిపించింది. అలాగే, రియల్మీ 4 యొక్క రెండర్ కూడా ఆన్‌లైన్‌లో కనిపించింది మరియు ఇది ఈ ఫోన్ యొక్క రూపకల్పనను( డిజైన్ )  కూడా చూపించింది. ఈ రెండర్ ప్రకారం, ఫోన్‌కు డైమండ్-కట్ డిజైన్ మరియు డ్యూయల్ రియర్ కెమెరా ఇవ్వవచ్చు.

కెమెరా సెటప్‌తో ఎల్‌ఈడీ ఫ్లాష్ అందించబడుతుంది మరియు ఫోన్ వెనుక భాగంలో వేలిముద్ర సెన్సార్ ఇవ్వబడుతుంది. రెండర్‌ను బట్టి, పరికరాన్ని బ్లూ కలర్ వేరియంట్‌లో చెప్పవచ్చు.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :