రియల్మీ 3i ఫ్లాష్ సేల్ 12 గంటలకి మొదలవ్వనుంది

Updated on 14-Aug-2019
HIGHLIGHTS

ఈఫోన్ వెనుక 13MP+ 2MP సెన్సారులు కలిగిన డ్యూయల్ రియర్ కెమెరాతో వస్తుంది.

చౌక ధరలో మంచి స్పెక్స్ అందించే రియల్మీ 3i స్మార్ట్ ఫోన్ యొక్క మరొక ఫ్లాష్ సేల్ ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకి జరుగనుంది. ఈ ఫోన్, వెనుక డ్యూయల్ కెమేరా, గ్రేడియంట్ కలర్, డ్యూ డ్రాప్ నోచ్ మరియు మరిన్ని ప్రత్యేకతలు కలిగి కేవలం రూ.7,999 రూపాయల ప్రారంభదరతో వస్తుంది. అలాగే, అనేక బ్యాంక్ ఆఫర్లు మరియు ఎటువంటి వడ్డీ లేని No Cost EMI కూడా అందుబాటులో ఉంటుంది.

Realme 3i ధరలు

1. Realme 3i (3GB ర్యామ్ + 32 GB స్టోరేజి) ధర – Rs. 7,999

2. Realme 3i (4GB ర్యామ్ + 64 GB స్టోరేజి) ధర – Rs. 9,999

Realme 3i ప్రత్యేకతలు

ఈ రియల్మీ 3i వెనుక భాగంలో ఒక డ్యూయల్ రియర్ కెమేరాతో వస్తుంది. అలాగే, ఈ Realme 3i స్మార్ట్ ఫోన్ ప్రస్తుతం ట్రెండీగా నడుస్తున్న, గ్రేడియంట్ కలర్ తో  కూడా కలిగి ఉంటుంది. ఈఫోన్ వెనుక 13MP+ 2MP సెన్సారులు కలిగిన డ్యూయల్ రియర్ కెమెరాతో వస్తుంది. ఈ ఫోన్ ముందభాగంలో ఒక 13MP సెల్ఫీ కెమేరాతో వస్తుంది. ఇది డైమండ్ బ్లూ, డైమండ్ రెడ్ మరియు డైమండ్ బ్లాక్ వంటి మూడు కలర్ ఎంపికలతో వస్తుంది.

పర్ఫార్మెన్స్ పరంగా చూస్తే, ఒక మీడియా టెక్ హీలియో P60 ఆక్టా కోర్ ప్రాసెసర్ మరియు జతగా 3GB /4GB శక్తితో వస్తుంది. అలాగే, ఇందులో అందించిన డిస్ప్లే ఒక 6.22 అంగుళాల పరిమాణం కలిగిన HD+ రిజల్యూషనుతో వస్తుంది. ఇది Color 6.0 OS తో ఆండ్రాయిడ్ 9 పై తో నడుస్తుంది.  ఇది ఒక పెద్ద 4,230 mAh బ్యాటరీతో ఉంటుంది. ఈ ఫోన్ను డైమండ్ కట్ డిజైనుతో మరియు తక్కువ బరువుతో తీసుకోచ్చింది.  

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :