Realme 16T 5G: రియల్ మీ 8000 mAh బిగ్ బ్యాటరీ లాంచ్ కి సిద్ధం.!

HIGHLIGHTS

రియల్ మీ అప్ కమింగ్ బిగ్ బ్యాటరీ స్మార్ట్ ఫోన్ లాంచ్ అవ్వడానికి సిద్ధం అయ్యింది

Realme 16T 5G 8000 mAh బిగ్ బ్యాటరీ తో లాంచ్ అవుతుందని కంపెనీ టీజర్ లో వెల్లడించింది

ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ గురించి కంపెనీ చెబుతున్న విశేషాలు ఏమిటో ఒక లుక్కేద్దామా

Realme 16T 5G: రియల్ మీ 8000 mAh బిగ్ బ్యాటరీ లాంచ్ కి సిద్ధం.!

Realme 16T 5G: రియల్ మీ అప్ కమింగ్ బిగ్ బ్యాటరీ స్మార్ట్ ఫోన్ ఇండియన్ మార్కెట్లో లాంచ్ అవ్వడానికి సిద్ధం అయ్యింది. ఈ స్మార్ట్ ఫోన్ 8000 mAh బిగ్ బ్యాటరీ మరియు జబర్దస్త్ పోర్ట్రైట్ ఫోటోలు తీసే కెమెరా వంటి మరిన్ని ఫీచర్స్ తో లాంచ్ అవుతుందని కంపెనీ టీజర్ లో వెల్లడించింది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ గురించి కంపెనీ చెబుతున్న విశేషాలు ఏమిటో ఒక లుక్కేద్దామా.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Realme 16T 5G: లాంచ్ డేట్

రియల్ మీ 16 టి స్మార్ట్ ఫోన్ మే 22 వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ఇండియన్ మార్కెట్లో లాంచ్ అవుతుంది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ యొక్క లాంచ్ డేట్ మరియు ఇతర కీలక వివరాలు కూడా కంపెనీ టీజర్ పేజీ ద్వారా రివీల్ చేసింది.

Realme 16T 5G: ఫీచర్స్

రియల్ మీ యొక్క లాంచ్ చేయబోతున్న ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ 1200 నిట్స్ బ్రైట్నెస్ మరియు 144Hz రిఫ్రెష్ రేట్ కలిగిన బిగ్ స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ స్లీక్ డిజైన్ తో భారీ బ్యాటరీ కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ మిలటరీ గ్రేడ్ షాక్ రెసిస్టెంట్ ఫీచర్ కలిగి ఉంటుంది మరియు IP69 రేటింగ్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ ఫీచర్ కూడా కలిగి ఉంటుంది.

Realme 16T 5G

ఈ ఫోన్ లో కొత్తగా వెనుక వైపు సెల్ఫీ మిర్రర్ ని అందించింది. ఈ ఫోన్ లో డ్యూయల్ రియర్ కెమెరా ఉంటుంది మరియు ఇందులో 50MP Sony IMX 852 మెయిన్ కెమెరా ఉంటుంది మరియు ఇది Luma Color టెక్నాలజీ తో ట్రూ టు లైఫ్ స్కిన్ టోన్ తో ఇమేజెస్ అందిస్తుంది. ఇవి కాకుండా ఈ స్మార్ట్ ఫోన్ లేటెస్ట్ Ai కెమెరా ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో అద్భుతమైన పోర్ట్రైట్ ఫోటోలు అందిస్తుందని రియల్ మీ తెలిపింది.

Also Read: Moto Buds 2: డ్యూయల్ స్పీకర్ మరియు స్మార్ట్ ఫీచర్స్ తో లాంచ్ అవుతోంది.!

ఇక ఈ ఫోన్ గురించి కంపెనీ గొప్పగా చెబుతున్న మెయిన్ ఫీచర్ ఒకటి వుంది. అదే, ఈ స్మార్ట్ ఫోన్ లో అందించిన బ్యాటరీ. ఈ ఫోన్ 8000 mAh భారీ బ్యాటరీ తో లాంచ్ అవుతుందని రియల్ మీ అనౌన్స్ చేసింది. ఈ ఫోన్ 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, రివర్స్ మరియు బైపాస్ ఛార్జ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఈ బ్యాటరీ 7 సంవత్సరాల లాంగ్ లైఫ్ కూడా కలిగి ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile