Realme 14T 5G: ధర, ఫీచర్స్ మరియు ఆఫర్స్ కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోండి.!
రియల్ మీ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ 14టి 5జి ఈరోజు ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయ్యింది
Realme 14T 5G సేల్ కూడా ఈరోజు నుంచే ప్రారంభించింది
ఈ స్మార్ట్ ఫోన్ ధర, ఫీచర్స్ మరియు ఆఫర్స్ కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోండి
realme 14T 5G: రియల్ మీ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ 14టి 5జి ఈరోజు ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ లాంచ్ చేయడం మాత్రమే కాదు ఈ ఫోన్ ఫస్ట్ సేల్ కూడా ఈరోజు నుంచే ప్రారంభించింది. ఈ స్మార్ట్ ఫోన్ ధర, ఫీచర్స్ మరియు ఆఫర్స్ కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోండి.
SurveyRealme 14T 5G: ప్రైస్
రియల్ మీ 14టి 5జి రెండు వేరియంట్స్ లాంచ్ అయ్యింది. ఈ స్మార్ట్ ఫోన్ యొక్క బేసిక్ వేరియంట్ (8GB + 128GB) రూ. 17,999 ధరతో మరియు (8GB + 256GB) వేరియంట్ రూ. 19,999 ధరతో విడుదలయ్యాయి. ఈ స్మార్ట్ ఫోన్ ఈరోజు నుంచే సేల్ కి అందుబాటులోకి వచ్చింది. ఈ ఫోన్ Flipkart మరియు realme.com నుంచి లభిస్తుంది.
ఆఫర్స్
రియల్ మీ ఈ ఫోన్ పై రూ. 1,000 రూపాయల బ్యాంక్ మరియు ఎక్స్ చేంజ్ బోనస్ ఆఫర్ అందించింది. ఈ ఫోన్ పై ఆల్ బ్యాంక్ క్రెడిట్ అండ్ డెబిట్ కార్డ్ పై బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ అందించింది. ఈ రెండు ఆఫర్స్ కూడా అందుకోవచ్చు. ఈ ఆఫర్స్ తో ఈ ఫోన్ ను రూ. 15,999 రూపాయల ప్రారంభ ధరకే పొందవచ్చు.
Also Read: భారీ ఆఫర్స్ తో Amazon Great Summer Sale ప్రకటించిన అమెజాన్.!
Realme 14T 5G: ఫీచర్స్
ఈ రియల్ మీ ఫోన్ చాలా స్లీక్ డిజైన్ అమ్ర్క్యు లగ్జరీ డిజైన్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో 6.67 ఇంచ్ AMOLED స్క్రీన్ ను అందించింది. ఈ స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్, 2100 నిట్స్ పీక్ బ్రైట్నెస్ మరియు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ మీడియాటెక్ Dimensity 6300 చిప్ సెట్ తో వస్తుంది. ఈ ఫోన్ 8GB ఫిజికల్ ర్యామ్ 18GB వరకు డైనమిక్ ర్యామ్ మరియు 256GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది.

ఈ రియల్ మీ కొత్త ఫోన్ లో వెనుక 50MP (OmniVision OV50D40) మెయిన్ సెన్సార్, 2MP మోనోక్రోమ్ సెన్సార్ కలిగిన డ్యూయల్ రియర్ కెమెరా మరియు ముందు 16MP (Sony IMX480) సెల్ఫీ కెమెరా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో Hi-Res ఆడియో సపోర్ట్ కలిగిన అల్ట్రా లైనర్ స్పీకర్లు కూడా ఉన్నాయి. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15 OS పై నడుస్తుంది. ఈ ఫోన్ సర్ఫ్ గ్రీన్, ఒబిసిడియన్ బ్లాక్ మరియు లైటనింగ్ పర్పల్ మూడు కలర్స్ లో లభిస్తుంది.
Raja Pullagura
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile