Realme 12 Pro Series 5G: ప్రీమియం కెమేరా మరియు ఫీచర్లతో వస్తోంది.!

HIGHLIGHTS

కొత్త స్మార్ట్ ఫోన్స్ లాంచ్ కోసం రియల్ మి డేట్ అనౌన్స్ చేసింది

Realme 12 Pro Series 5G ఇండియాలో లాంఛ్ చేయనున్నట్లు రియల్ మి అనౌన్స్ చేసింది

ఈ స్మార్ట్ ఫోన్స్ కీలకమైన స్పెక్స్ మరియు ఫీచర్లతో కంపెనీ టీజింగ్ చేస్తోంది

Realme 12 Pro Series 5G: కొత్త స్మార్ట్ ఫోన్స్ లాంచ్ కోసం రియల్ మి డేట్ అనౌన్స్ చేసింది. జనవరి 29వ తేదీ మద్యహ్నం 12 గంటలకు ఈ స్మార్ట్ ఫోన్ సిరీస్ ను ఇండియాలో లాంఛ్ చేయనున్నట్లు రియల్ మి అనౌన్స్ చేసింది. రియల్ మి 12 ప్రో సిరీస్ నుండి లాంచ్ చేయబోతున్న స్మార్ట్ ఫోన్స్ కీలకమైన స్పెక్స్ మరియు ఫీచర్లతో కంపెనీ టీజింగ్ చేస్తోంది.

Realme 12 Pro Series 5G

రియల్ మి 12 ప్రో సిరీస్ 5జి ని ‘లగ్జరీ ఆఫ్ ఏ వాచ్ నౌ ఇన్ ఏ స్మార్ట్ ఫోన్’ గా అభి వర్ణిస్తోంది. ఎందుకంటే, ఈ స్మార్ట్ ఫోన్ కెమేరా మోడల్ ను ఇంటర్నేషనల్ లగ్జరీ వాచ్ డిజైనర్ ఈ స్మార్ట్ వాచ్ కెమేరా మోడ్యూల్ ను డిజైన్ చేసినట్లు టీజింగ్ చేస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ యొక్క కెమేరా కేపబిలిటీస్ గురించి కూడా కంపెనీ చాలా గొప్పగా చెబుతోంది.

Also Read : Direct 2 Mobile: ఇక నేరుగా స్మార్ట్ ఫోన్ ల లోనే ఎంటర్టైన్మెంట్ ప్రసారాలు..!

రియల్ మి 12 ప్రో సిరీస్ 5జి స్మార్ట్ ఫోన్ DSLR-Grade పోర్ట్రైట్ లను తియ్యగల సత్తాతో ఈ ఫోన్ ను తీసుకు వస్తున్నట్లు రియల్ మి చెబుతోంది. దీనికోసం ఈ ఫోన్ లో ఫ్లాగ్ షిప్ పెరిస్కోప్ సెన్సార్ ను అందించినట్లు తెలిపింది. ఈ రియల్ మి అప్ కమింగ్ ఫోన్ 3X ఆప్టికల్ జూమ్ లేదా 120X డిజిటల్ జూమ్ సపోర్ట్ ఉంటుందని కూడా తెలిపింది.

సినిమాటిక్ పోర్ట్రైట్ ల కోసం ఈ ఫోన్ లో Sony IMX890 కెమేరాని ఉన్నట్లు టీజింగ్ ద్వారా వెల్లడించింది. ఈ ఫోన్ ను అందమైన లెథర్ బ్యాక్ డిజైన్ తో తీసుకు వస్తోంది. ఈ రియల్ మి అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ అందమైన డిజైన్, కర్వ్డ్ డిస్ప్లే మరియు టైప్-C పోర్ట్ తో కలిగి ఉన్నట్లు టీజర్ ఇమేజ్ లు సూచిస్తున్నాయి.

రియల్ మి 12 ప్రో 5జి స్మార్ట్ ఫోన్ లాంచ్ కావడానికి ఇంకా సమయం ఉన్నది కాబట్టి ఈ ఫోన్ యొక్క మరిన్ని ఫీచర్లను వెల్లడించే అవకాశం ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :