POCO M8 Power vs Samsung Galaxy F70 Pro complete features comparison
POCO M8 Power vs Samsung Galaxy F70 Pro : ప్రపంచవ్యాప్తంగా మొబైల్ ఫోన్ ప్రైస్ పెరిగినా కూడా మొబైల్ కంపెనీలు మరింత గొప్ప ఫీచర్స్ తో తమ స్మార్ట్ ఫోన్ లను ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేస్తూనే ఉన్నాయి. అయితే, వాటిలో ఏ ఫోన్ ఎవరికి సరిపోతుందో తెలుసుకోవడం ముఖ్యమైన విషయం గా ఉంటుంది. అందుకే ఇండియన్ మార్కెట్లో సరికొత్తగా విడుదలైన పోకో ఎం8 పవర్ పవర్ మరియు శాంసంగ్ గెలాక్సీ F70 ప్రో రెండు ఫోన్లలో ఎవరికి ఈ ఫోన్ తగిన విధంగా ఉంటుందో వివరంగా అందించాము. త్వరలో సేల్ కి రాబోతున్న ఈ ఫోన్ లలో మీ వినియోగ అవసరాన్ని బట్టి మీకు ఏది సరిగ్గా సరిపోతుందో తెలుసుకోండి.
ఈ రెండు ఫోన్లు కూడా మొదటి సేల్ నుంచి మంచి ఆఫర్ ధరలో లభిస్తాయి, వీటిలో శాంసంగ్ గెలాక్సీ F70 ప్రో ఫోన్ రూ. 23,999 రూపాయల ఆఫర్ ధరలో లభిస్తుంది. అలాగే, పోకో ఎం8 పవర్ పవర్ స్మార్ట్ ఫోన్ ఫస్ట్ డే సేల్ నుంచి రూ. 21,999 ఆఫర్ ధరలో లభిస్తుంది.
పోకో కొత్త ఫోన్ లో 6.99 అంగుళాల FHD+ AMOLED డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, ఇన్ స్క్రీన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు గరిష్ఠంగా 1800 నిట్స్ బ్రైట్‌నెస్ తో ఉంటుంది. గేమింగ్ మరియు వీడియోలు ఎక్కువగా చూసే వారికి ఈ పెద్ద స్క్రీన్ ఫోన్ మంచి ఎంపిక అవుతుంది.
శాంసంగ్ గెలాక్సీ F70 ప్రో ఫోన్ లో 6.7 అంగుళాల FHD+ రిజల్యూషన్ కలిగిన సూపర్ AMOLED స్క్రీన్ ఉంటుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. ఇందులో గొప్ప రంగులు, ఉన్నతమైన కాంట్రాస్ట్, అవుట్ డోర్ విజిబిలిటీ వంటివి బాగుంటాయి. అంటే, ఈ శామ్‌సంగ్ ఫోన్ డిస్‌ప్లే నాణ్యత పరంగా ఆకట్టుకుంటుంది.
పెర్ఫార్మెన్స్ విభాగంలో శాంసంగ్ గెలాక్సీ F70 ప్రో ఫోన్ ఆధిక్యాన్ని ప్రదర్శిస్తుంది. ఎందుకంటే, పోకో ఎం8 పవర్ ఫోన్ క్వాల్కమ్ Snapdragon 4 Gen 4 ప్రాసెసర్ తో వస్తే, గెలాక్సీ F70 ప్రో ఫోన్ మాత్రం మరింత శక్తివంతమైన Snapdragon 6 Gen 3 చిప్ సెట్ తో వస్తుంది. ఇది మల్టీటాస్కింగ్, హెవీ గేమింగ్, దీర్ఘకాల పనితీరులో శాంసంగ్ ఫోన్ ను స్పష్టమైన విజేతగా నిలబెడుతుంది.
పోకో ఎం8 పవర్ లో 50MP AI డ్యూయల్ రియర్ మరియు 8MP సెల్ఫీ కెమెరా తో వస్తుంది. సాధారణ ఫోటోగ్రఫీ కోసం సరిపోతుంది. ఇందులో 4K వీడియో రికార్డింగ్ వంటి ఫీచర్స్ అందించలేదు. అయితే, గెలాక్సీ F70 ప్రో స్మార్ట్ ఫోన్ మాత్రం 50MP ప్రధాన కెమెరాతో పాటు 5MP అల్ట్రా-వైడ్, 2MP మ్యాక్రో కెమెరాలు కలిగిన ట్రిపుల్ రియర్ మరియు 12MP సెల్ఫీ కెమెరా కలిగి ఉంటుంది. ఇది మెరుగైన ఫోటోలు, సెల్ఫీలు, వీడియో కాల్స్ తో పాటు 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఈ విభాగంలో కూడా గెలాక్సీ F70 ప్రో మెరుగైన కెమెరా ఫోన్ గా ఉంటుంది.
Also Read : Amazon Great Freedom Sale నుంచి శాంసంగ్ మినీ ఎల్ఈడి టీవీ నెవర్ బిఫోర్ ధరలో లభిస్తుంది.!
పోకో స్మార్ట్ ఫోన్ ఈ విభాగంలో విజేతగా నిలుస్తుంది. ఎందుకంటే, ఈ పోకో ఫోన్ 8000 mAh భారీ బ్యాటరీ, 45W ఫాస్ట్ ఛార్జింగ్ మరియు 22.5 ఫాస్ట్ రివర్స్ ఛార్జ్ సపోర్ట్ తో కూడా వస్తుంది. సాధారణ వినియోగంలో రెండు రోజుల వరకు బ్యాటరీ బ్యాకప్ ఈ బ్యాటరీతో పొందే అవకాశం ఉంది.
అయితే, గెలాక్సీ F70 ప్రో మాత్రం కేవలం 6000 mAh బ్యాటరీ తో మాత్రమే వస్తుంది. కానీ, 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ మాత్రం ఇందులో ఉంది. అందుకే, ఈ కేటగిరిలో పోకో ఫోన్ బెస్ట్ ఆప్షన్ అవుతుంది.
మీరు పెద్ద స్క్రీన్ లో గేమింగ్ మరియు వీడియోలు ఎంజాయ్ చేయడంతో పాటు చాలా ఎక్కువ సహాయం నిలిచే భారీ బ్యాటరీ కావాలంటే, మీరు పోకో ఎం8 పవర్ ఫోన్ మీకు సరిపోతుంది.
మెరుగైన పెర్ఫార్మన్స్, గొప్ప కలర్స్ అందించే స్క్రీన్ మరియు మంచి కెమెరా అనుభవం కోరుకుంటే మాత్రం మీకు గెలాక్సీ F70 ప్రో తగిన ఆప్షన్ అవుతుంది. అలాగే ఈ రెండు ఫోన్స్ బడ్జెట్ లో కూడా తేడా ఉంటుంది.