Amazon Great Freedom Sale నుంచి శాంసంగ్ మినీ ఎల్ఈడి టీవీ నెవర్ బిఫోర్ ధరలో లభిస్తుంది.!
Amazon Great Freedom Sale డేట్ దగ్గరికి రావడంతో అమెజాన్ ఈ అప్ కమింగ్ సేల్ బిగ్ డీల్స్ ఒక్కొక్కటిగా రివీల్ చేయడం స్టార్ట్ చేసింది. ఈ లిస్టులో కొన్ని డీల్స్ గొప్పగా ఆకట్టుకుంటున్నాయి. నిన్న షియోమీ 43 ఇంచెస్ స్మార్ట్ టీవీ డీలర్ అందించగా ఈరోజు శాంసంగ్ 55 ఇంచ్ మినీ ఎల్ఈడి స్మార్ట్ టీవీ డీల్ ని రివీల్ చేసింది. అమెజాన్ టీజింగ్ చేస్తున్న ఈ డీల్ ని చూస్తుంటే, అతి చవక ధరలో 55 ఇంచ్ క్రిస్టల్ క్లియర్ స్క్రీన్ స్మార్ట్ టీవీని అందుకునే అవకాశం ఉందని అర్ధం అవుతుంది.
SurveyAmazon Great Freedom Sale : శాంసంగ్ టీవీ ఆఫర్
శాంసంగ్ ఇటీవల విడుదల చేసిన లేటెస్ట్ 55 ఇంచ్ 4K Mini LED స్మార్ట్ టీవీ అమెజాన్ సేల్ నుంచి భారీ డిస్కౌంట్ ధరలో లభిస్తుంది. అప్ కమింగ్ సేల్ కోసం అమెజాన్ అందించిన ప్రత్యేకమైన టీజర్ పేజీ నుంచి ఈ డీల్ ని రివీల్ చేసింది. అమెజాన్ టీజర్ పేజీ ప్రకారం, ఈ శాంసంగ్ 55 ఇంచ్ మినీ ఎల్ఈడి అన్ని ఆఫర్స్ తో కలుపుకొని కేవలం రూ. 41,990 రూపాయల ఆఫర్ ధరలో లభిస్తుంది.

వాస్తవానికి, ఈ స్మార్ట్ టీవీ ప్రస్తుతం రూ. 49,990 రూపాయల ప్రైస్ ట్యాగ్ తో అమెజాన్ నుంచి సేల్ అవుతోంది. కానీ అమెజాన్ సేల్ నుంచి ఏకంగా 8 వేల రూపాయల తగ్గింపు ధరలో లభిస్తుందని అమెజాన్ చెబుతోంది. అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ నుంచి లభించనున్న భారీ స్మార్ట్ టీవీ ఆఫర్స్ లో ఇది కూడా ఒకటి అని అమెజాన్ తెలిపింది.
Also Read : Jio Home : కొత్త 3 ఇన్ 1 హోమ్ ప్యాక్ ప్రకటించిన జియో .. రూ. 400 నుంచి ప్రారంభం.!
Samsung (55) Mini LED : ఫీచర్స్
ఇది శాంసంగ్ అందించిన లేటెస్ట్ 55 ఇంచ్ మినీ ఎల్ఈడి స్మార్ట్ టీవీ మరియు ఇది 4K UHD (3840 x 2160) రిజల్యూషన్ కలిగి ఉంటుంది. ఈ టీవీ HDR 10+, సూపర్ మినీ ఎల్ఈడి డిమ్మింగ్, 4K అప్ స్కేలింగ్, కలర్ బూస్టర్ మరియు ప్యూర్ స్పెక్ట్రమ్ కలర్ వంటి ఫీచర్స్ తో గొప్ప విజువల్స్ అందిస్తుంది. ఈ టీవీ Mini LED ప్రాసెసర్ 4K తో పని చేస్తుంది మరియు చాలా వేగంగా ఉంటుంది.
ఈ టీవీ రెండు స్పీకర్లు కలిగి టోటల్ 30W సౌండ్ అందిస్తుంది. ఈ టీవీ కలిగిన Q-Symphony, అడాప్టివ్ సౌండ్ మరియు ఆబ్జెక్ట్ ట్రాకింగ్ సౌండ్ లైట్ వంటి ఫీచర్స్ తో గొప్ప సౌండ్ కూడా అందిస్తుంది. ఈ టీవీ 3 HDMI పోర్ట్, 1 USB పోర్ట్, LAN, బిల్ట్ ఇన్ Wi-Fi, బ్లూటూత్ 5.3 సపోర్ట్ మరియు మరిన్ని కనెక్టివిటీ సపోర్ట్ కలిగి ఉంటాయి.
ఈ టీవీ 150 కి పైగా ఉచిత ఛానల్ అందించే శాంసంగ్ టీవీ ప్లస్, క్విక్ రిమోట్ మరియు మొబైల్ టు మిర్రరింగ్ వంటి ప్రీమియం ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile
