Realme 12+ 5G: కేవలం రూ. 1 రూపాయితో Pre-Book చేసుకోండి.!
Realme 12+ 5G కోసం ఈరోజు నుండి Pre-Book ఆర్డర్స్ ను ఓపెన్ చేసింది
ఈ స్మార్ట్ ఫోన్ ను మార్చి 6న ఇండియాలో లాంఛ్ చేయడానికి డేట్ అనౌన్స్ చేసింది
Realme 12+ 5G ఎలా ఉండబోతుందనే అంచనాలను రియల్ మి అందించింది
Realme 12+ 5G: రియల్ మి అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ రియల్ మి 12+ 5G కోసం ఈరోజు నుండి Pre-Book ఆర్డర్స్ ను ఓపెన్ చేసింది. అంతేకాదు. రియల్ మి 12+ 5జి స్మార్ట్ ఫోనెను కేవలం రూ. 1 రూపాయితో ప్రీ-బుక్ చేసుకోవచ్చని కంపెనీ అనౌన్స్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ ను మార్చి 6న ఇండియాలో లాంఛ్ చేయడానికి డేట్ అనౌన్స్ చేసిన కంపెనీ, ఈరోజు నుండే ప్రీ-బుక్ కోసం గేట్స్ ఓపెన్ చేసింది. ఈ రియల్ మి అప్ కమింగ్ ఫోన్ యొక్క టీజ్డ్ స్పెక్స్ ద్వారా ఈ ఫోన్ ఎలా ఉండబోతుందనే అంచనాలను రియల్ మి అందించింది.
SurveyRealme 12+ 5G: Pre-Book
రియల్ మి 12+ 5జి స్మార్ట్ ఫోన్ ను ఈరోజు నుండి కేవలం రూ. 1 రూపాయి చెల్లించి ప్రీ బుక్ చెల్లించి ముందుగా బుక్ చేసుకోవచ్చు. ఈ ఫోన్ ను Flipkart మరియు realme.com నుండి ప్రీ బుక్ చేసుకోవచ్చు. ఈ ఫోన్ ను ముందుగా బుక్ చేసుకునే యూజర్లు రూ. 3,000 రూపాయల వరకూ ప్రయోజనాలను అందుకోవచ్చని రియల్ మి అనౌన్స్ చేసింది. అంతేకాదు, ఈ ఫోన్ యొక్క కీలకమైన స్పెక్స్ ను కూడా టీజింగ్ ద్వారా బయట పెట్టింది.

ఈ ప్రీ బుక్ పాస్ ను మార్చి 6 వ తేదీ మధ్యాహ్నం 3 గంటల నుండి మార్చి 10 వ తేదీ రాత్రి 11 గంటల 59 నిముషాల వరకూ అందుబాటులో ఉంటుంది.
Also Read: Oppo F25 Pro 5G: కళ్ళు చెదిరే డిజైన్ మరియు ఫీచర్స్ తో వచ్చేసింది.!
Realme 12+ 5G: Specs
ఫ్లాగ్ షిప్ లగ్జరీ వాచ్ డిజైన్ తో ఈ సెగ్మెంట్ లో వచ్చే మొదటి ఫోన్ ఇదే అవుతుందని కంపెనీ చెబుతోంది. రియల్ మి 12+ 5జి స్మార్ట్ ఫోన్ ఈ ప్రైస్ సెగ్మెంట్ లో ఫస్ట్ Sony LYT-600 OIS కెమేరా ఫోన్ అవుతుందని కంపెనీ ఈ ఫోన్ గురించి గొప్పగా చెబుతోంది. ఈ ఫోన్ కెమేరాలో ఉన్న Cinematic Portrait Mode తో సినిమా-గ్రేడ్ ఫోటో లను షూట్ చేయవచ్చని రియల్ మి చెబుతోంది. రియల్ మి 12+ 5జి స్మార్ట్ ఫోన్ MediaTek Dimensity 7050 ఆక్టా కోర్ ప్రోసెసర్ తో లాంఛ్ చేస్తున్నట్లు టీజింగ్ ద్వారా తెలిపింది.

అంతేకాదు, ఈ ఫోన్ కలిగి ఉన్న డిస్ప్లే మరియు ఇతర వివరాలను కూడా ముందే బయట పెట్టింది. రియల్ మి 12+ 5జి ఫోన్ ను 120Hz రిఫ్రెష్ రేట్ కలిగిన AMOLED డిస్ప్లేని కొత్త రైన్ వాటర్ స్మార్ట్ టచ్ మరియు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్లతో కలిగి ఉన్నట్లు కూడా కన్ఫర్మ్ చేసింది. ఈ రియల్ మి అప్ కమింగ్ ఫోన్ ఈ సెగ్మెంట్ లో మొదటి 3D VC కూలింగ్ సిస్టమ్ కలిగిన ఫోన్ అవుతుందని కూడా రియల్ మి తెలిపింది.
Raja Pullagura
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile