Realme 10 Pro+5G: ఈరోజు Flipkart నుండి మరొకసారి సేల్ కి అందుబాటులో.!
Realme 10 Pro+ ఈరోజు మరొకసారి సేల్ కి అందుబాటులోకి వచ్చింది.
Realme 10 Pro+5G Curved స్క్రీన్ తో వస్తుంది.
108MP ట్రిపుల్ కెమెరా వంటి చాలా ప్రత్యేకతలను కలిగివుంది
Realme ఇండియాలో లేటెస్ట్ విడుదల చేసిన స్మార్ట్ ఫోన్ Realme 10 Pro+ ఈరోజు మరొకసారి సేల్ కి అందుబాటులోకి వచ్చింది. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకి Realme 10 Pro+ 5G స్మార్ట్ ఫోన్ సేల్ జరగనున్నది. ఈ ఫోన్ ప్రీమియం ఫోన్లను తలపించే Cured డిస్ప్లేతో పాటుగా 108MP ట్రిపుల్ కెమెరా వంటి చాలా ప్రత్యేకతలను కలిగివుంది. ఈ ఫోన్ యొక్క స్పెక్స్, ధర మరియు ఫీచర్లు ఇక్కడ తెలుసుకోండి.
SurveyRealme 10 Pro+5G: ధర
Realme 9 5G యొక్క బేసిక్ వేరియంట్ (6GB+128GB) రూ.24,999 ధరతో లాంచ్ కాగా, (8GB+128GB) వేరియంట్ రూ.25,999 ధరతో మరియు హై ఎండ్ వేరియంట్ (8GB+256GB) రూ.27,999 ధరతో లాంచ్ చెయ్యబడ్డాయి. ఈ స్మార్ట్ ఫోన్ Realme అధికారిక వెబ్సైట్ realme.com మరియు Flipkart నుండి సేల్ కి అందుబాటులోకి వస్తుంది.
Realme 10 Pro+5G: స్పెక్స్
Realme 10 Pro+5G స్మార్ట్ ఫోన్ 6.7-అంగుళాల FHD+ రిజల్యూషన్ Curved స్క్రీన్ తో వస్తుంది. ఈ డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్ మరియు 360Hz టచ్ శాంప్లింగ్ రేట్ కలిగివుంది మరియు ఇది పంచ్-హోల్ డిజైన్ తో వస్తుంది. ఈ డిస్ప్లే 2160Hz డిమ్మింగ్, 100% DCI-P3 కలర్ గాముట్ మరియు 0.65mm డబుల్-రీఐన్ఫోర్స్డ్ గ్లాస్ సేఫ్టీతో వస్తుంది. ఈ ఫోన్ మీడియాటెక్ ఫాస్ట్ ప్రాసెసర్ డైమెన్సిటీ 1080 ఆక్టా కోర్ ప్రోసెసర్ కి జతగా 8GB ర్యామ్ మరియు 256GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది.
వెనుకవైపు, ఈ ఫోన్ లో ట్రిపుల్ కెమెరా సెటప్ వుంది. ఇందులో 108MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రా-వైడ్ సెన్సార్ మరియు 2MP (4cm) మాక్రో సెన్సార్ ఉన్నాయి. ఈ కెమెరాతో 30FPS తో 4K వీడియో రికార్డింగ్ చేయవచ్చు. అలాగే, ఈ ఫోన్ 5000mAh బ్యాటరీని 67W సూపర్ ఊక్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో కలిగివుంది. ఈ 8GB వరకు డైనమిక్ ర్యామ్, డ్యూయల్-మోడ్ 5G, Hi-Res ఆడియో, సూపర్ లైనర్ డ్యూయల్ స్పీకర్లు, మొదలైన ఫీచర్లు కూడా అందుకుంటారు.
Raja Pullagura
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile