Prime Day Sale టాప్ స్మార్ట్ ఫోన్ డీల్స్ రివీల్ చేసిన అమెజాన్.!

HIGHLIGHTS

అమెజాన్ అప్ కమింగ్ సేల్ Prime Day టాప్ స్మార్ట్ ఫోన్ డీల్స్ రివీల్ చేసింది

ఈ బిగ్ సేల్ నుంచి భారీ ఆఫర్లు మరియు డీల్స్ అందిస్తుంది

అమెజాన్ ప్రైమ్ సభ్యులు భారీ ఆఫర్స్ పొందే అవకాశం

Prime Day Sale స్టార్ట్ కావడానికి ఇంకా వారం రోజులు ఉండగా, అమెజాన్ ఈ అప్ కమింగ్ సేల్ టాప్ స్మార్ట్ ఫోన్ డీల్స్ రివీల్ చేసింది. అమెజాన్ ప్రైమ్ సభ్యుల కోసం ప్రతి సంవత్సరం ప్రత్యేకంగా అందించే ఈ బిగ్ సేల్ నుంచి భారీ ఆఫర్లు మరియు డీల్స్ అందిస్తుంది. ఈరోజు అమెజాన్ రివీల్ చేసిన స్మార్ట్ ఫోన్ డీల్స్ చూస్తుంటే ఈ సంవత్సరం కూడా అమెజాన్ ప్రైమ్ సభ్యులు భారీ ఆఫర్స్ పొందే అవకాశం ఉన్నట్లు అనిపిస్తుంది.

Prime Day Sale : స్మార్ట్ ఫోన్ డీల్స్

పదవ వార్షికోత్సవం సందర్భంగా ఈ సంవత్సరం అన్ని సంవత్సరాల కంటే అధిక డిస్కౌంట్ మరియు ఆఫర్లు అందించబోతున్నట్లు అమెజాన్ టీజింగ్ చేస్తోంది. ఈ అప్ కమింగ్ బిగ్ సేల్ కోసం ప్రత్యేకంగా అందించిన మైక్రో సైట్ టీజర్ పేజీ నుంచి ఈరోజు కొన్ని టాప్ డీల్స్ ని రిలీజ్ చేసింది. ఇందులో రివీల్ చేసిన టాప్ స్మార్ట్ ఫోన్ డీల్స్ ఇప్పుడు చూద్దాం.

OnePlus 13 : డీల్

అమెజాన్ ప్రైమ్ డే 2026 సేల్ నుంచి వన్ ప్లస్ 13 స్మార్ట్ ఫోన్ ను చాలా చవక ధరలో అందుకోవచ్చు. ఈ ఫోన్ ప్రస్తుతం రూ. 57,998 రూపాయల ధరతో లిస్ట్ అవ్వగా, ప్రైమ్ డే సేల్ నుంచి అందించే అదనపు డిస్కౌంట్ మరియు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్స్ తో రూ. 49,999 ఆఫర్ ధరల లభిస్తుందని అమెజాన్ తెలిపింది. ఇది వన్ ప్లస్ యొక్క ప్రీమియం ఫోన్ మరియు Snapdragon 8 Elite ప్రాసెసర్ మరియు 5th-Gen Hasselblad కెమెరా వంటి చాలా ప్రీమియం ఫీచర్స్ తో ఆకట్టుకుంటుంది.

Also Read: OnePlus N6 : 60FPS వీడియో కెమెరా మరియు బిగ్ కూలింగ్ సిస్టం తో వస్తుంది.!

REDMI Turbo 5 : డీల్

షియోమీ సరికొత్తగా అందించిన రెడ్ మీ టర్బో 5 స్మార్ట్ ఫోన్ కూడా అమెజాన్ సేల్ నుంచి మంచి ఆఫర్స్ తో లభిస్తుంది. అమెజాన్ ఈ స్మార్ట్ ఫోన్ పై కూపన్ డిస్కౌంట్ మరియు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ చేయనున్నట్లు షియోమీ తెలిపింది. ఈ స్మార్ట్ ఫోన్ ను అమెజాన్ సేల్ నుంచి రూ. 34,999 రూపాయల డిస్కౌంట్ ధరలో అందుకోవచ్చని అమెజాన్ ఆఫర్ ని రివీల్ చేసింది.

iQOO Z10 Lite 5G : డీల్

ఇది బడ్జెట్ యూజర్ కోసం అందించిన బెస్ట్ 5జి స్మార్ట్ ఫోన్ డీల్ గా అమెజాన్ ప్రకటించింది. ఈ స్మార్ట్ ఫోన్ ప్రస్తుతం రూ. 14,999 ధరతో సేల్ అవుతోంది. అయితే, అమెజాన్ ప్రైమ్ డే సేల్ నుంచి ఈ స్మార్ట్ ఫోన్ అన్ని ఆఫర్స్ తో కేవలం రూ. 13,999 రూపాయల ధరలో లభిస్తుంది. ఈ ఫోన్ 6000 mAh బిగ్ బ్యాటరీతో వచ్చిన బడ్జెట్ స్మార్ట్ ఫోన్ మరియు అమెజాన్ ప్రైమ్ డే సేల్ నుంచి మరింత బడ్జెట్ ధరలో లభిస్తుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :