POCO X8: స్టన్నింగ్ ఫీచర్స్ తో సర్ప్రైజింగ్ ధరలో రిలీజ్ అయ్యింది.!
గత కొంత కాలంగా పోకో టీజింగ్ చేస్తూ వస్తున్న ఎక్స్ 8 సిరీస్ ను ఎట్టకేలకు ఈరోజు విడుదల చేసింది
POCO X8 ని స్టన్నింగ్ ఫీచర్స్ తో సర్ప్రైజింగ్ ధరలో రిలీజ్ చేసింది
9000 mAh భారీ బ్యాటరీ మొదలుకొని లేటెస్ట్ పవర్ ఫుల్ చిప్ సెట్ వరకు ఆకట్టుకునే ఫీచర్స్ కలిగి ఉంటుంది
POCO X8: గత కొంత కాలంగా పోకో టీజింగ్ చేస్తూ వస్తున్న ఎక్స్ 8 సిరీస్ ను ఎట్టకేలకు ఈరోజు విడుదల చేసింది. ఈ సిరీస్ నుంచి బేసిక్ వెర్షన్ పోకో ఎక్స్ 8 స్మార్ట్ ఫోన్ ని స్టన్నింగ్ ఫీచర్స్ తో సర్ప్రైజింగ్ ధరలో రిలీజ్ చేసింది. ఇది 9000 mAh భారీ బ్యాటరీ మొదలుకొని స్నాప్ డ్రాగన్ లేటెస్ట్ పవర్ ఫుల్ చిప్ సెట్ వరకు చాలా ఆకట్టుకునే ఫీచర్స్ కలిగి ఉంటుంది.
SurveyPOCO X8: ప్రైస్
పోకో ఈ కొత్త ఫోన్ ను మూడు ర్యామ్ అండ్ స్టోరేజ్ వేరియంట్ మరియు మూడు రంగుల్లో అందించింది. ఈ ఫోన్ ప్రైస్ వివరాల లిస్ట్ ఇక్కడ చూడొచ్చు.
- పోకో ఎక్స్ 8 (6GB + 128GB) ప్రైస్ : రూ. 29,999
- పోకో ఎక్స్ 8 (8GB + 128GB) ప్రైస్ : రూ. 32,999
- పోకో ఎక్స్ 8 (8GB + 256GB) ప్రైస్ : రూ. 35,999
ఈ మూడు వేరియంట్స్ కూడా బ్లాక్, ఫెయిరీ ఆరెంజ్ మరియు ఫ్రాస్ట్ వైట్ మూడు రంగులో లభిస్తాయి.

ఆఫర్స్
పోకో ఈ ఫోన్ లాంచ్ తో గొప్ప లాంచ్ ఆఫర్స్ కూడా విడుదల చేసింది. ఈ ఫోన్ పై రూ. 2,000 కూపన్ డిస్కౌంట్ ఆఫర్ ని అందించింది. ఈ ఆఫర్ తో పాటు రూ. 1,000 రూపాయల అదనపు ఎక్స్ చేంజ్ బోనస్ మరియు రూ. 1,000 రూపాయల SBI అండ్ HDFC క్రెడిట్ కార్డ్ డిస్కౌంట్ ఆఫర్ ని కూడా అందించింది. ఈ ఆఫర్స్ తో ఈ ఫోన్ కేవలం రూ. 26,999 ప్రారంభ ధరలో లభిస్తుంది.
Also Read: ముందు Claude తర్వాత Chat GPT సర్వీస్ డౌన్: ఏఐ ప్లాట్ ఫామ్స్ తో కొత్త కష్టాలు
POCO X8: ఫీచర్స్
పోకో ఈ స్మార్ట్ ఫోన్ ను మీటర్ డ్రాప్ ఫాల్ ను రెసిస్ట్ చేసుకునే దృఢమైన డిజైన్ తో లాంచ్ చేసింది. అంతేకాదు, ఈ ఫోన్ IP69K రేటింగ్ తో గొప్ప డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ తో వస్తుంది. అంతేకాదు, ఇది నీటిలో కూడా ఫోటోలు చిత్రించే అండర్ వాటర్ కెమెరా మోడ్ తో వస్తుంది. ఈ ఫోన్ డిజైన్ మరియు డ్యూరాబిలిటీ పరంగా ఆకట్టుకునే డిజైన్స్ తో ఉంటుంది.
స్క్రీన్ పరంగా, ఈ ఫోన్ 6.83 ఇంచ్ బిగ్ AMOLED ని కలిగి ఉంటుంది. ఇది ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, వెట్ టచ్ సపోర్ట్, 3500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ మరియు గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ క్వాల్కమ్ లేటెస్ట్ 5జి చిప్ సెట్ Snapdragon 6s Gen 4 చిప్ సెట్ తో లాంచ్ అయ్యింది. ఇది 9 లక్షల కంటే అధిక AnTuTu స్కోర్ అందించే లేటెస్ట్ చ్ఛిప్ సెట్. అలాగే, ఇందులో 8GB ర్యామ్ అండ్ 256GB స్టోరేజ్ కూడా కలిగి ఉంటుంది.
ఈ ఫోన్ 50MP మెయిన్ సెన్సార్ కలిగిన డ్యూయల్ రియర్ కెమెరా మరియు ముందు 16MP సెల్ఫీ కెమెరా కలిగి ఉంటుంది. ఇది 4K వీడియో రికార్డింగ్, అండర్ కెమెరా మోడ్ మరియు లేటెస్ట్ ఏఐ కెమెరా ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 9000 mAh భారీ బ్యాటరీతో అందించింది. ఇది 67W ఫాస్ట్ ఛార్జ్, 22.5 రివర్స్ ఛార్జ్ సపోర్ట్ మరియు బైపాస్ ఛార్జ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఇది డాల్బీ అట్మోస్ సపోర్ట్ కలిగిన డ్యూయల్ స్టీరియో స్పీకర్లు కూడా ఉన్నాయి.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile
