POCO X8 మరియు X8 Power లాంచ్ డేట్ ఫిక్స్ .. మతిపోగొట్టే బ్యాటరీతో లాంచ్ కి రెడీ.!

HIGHLIGHTS

ఇండియాలో POCO X8 మరియు X8 Power లాంచ్ కోసం లాంచ్ టీజింగ్ రిలీజ్

ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ యొక్క కీలక ఫీచర్లు కూడా ఈరోజు రివీల్ చేసింది

రెండు స్మార్ట్ ఫోన్ లను కూడా భారీ బ్యాటరీ సెటప్ తో లాంచ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసింది

POCO X8 మరియు X8 Power లాంచ్ డేట్ ఫిక్స్ .. మతిపోగొట్టే బ్యాటరీతో లాంచ్ కి రెడీ.!

ఇండియాలో POCO X8 మరియు X8 Power లాంచ్ కోసం ఈ వారం ప్రారంభంలో లాంచ్ టీజింగ్ రిలీజ్ చేసిన పోకో, ఇప్పుడు ఈ ఫోన్ లాంచ్ డేట్ ఫిక్స్ చేసింది. కేవలం ఇండియా లాంచ్ డేట్ మాత్రమే కాదు ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ యొక్క కీలక ఫీచర్లు కూడా ఈరోజు రివీల్ చేసింది. ఈ రెండు స్మార్ట్ ఫోన్లను కూడా మతి పోగొట్టే భారీ బ్యాటరీ సెటప్ తో లాంచ్ చేయబోతున్నట్లు కంపెనీ టీజర్ విడుదల చేసింది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

POCO X8 మరియు X8 Power లాంచ్ డేట్

పోకో ఎక్స్ 8 సిరీస్ నుంచి లాంచ్ చేయనున్న ఈ రెండు స్మార్ట్ ఫోన్ లను సెప్టెంబర్ 4వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లో లాంచ్ చేయనున్నట్లు పోకో అనౌన్స్ చేసింది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ కోసం ఫ్లిప్ కార్ట్ అందించిన ప్రత్యేకమైన టీజర్ పేజీ నుంచి లాంచ్ డేట్ అనౌన్స్ చేసింది. ఈ ఫోన్ కీలక ఫీచర్లు కూడా ఈ పేజీ పేజీ నుంచి రిలీజ్ చేసింది.

POCO X8 మరియు X8 Power: కీలక ఫీచర్స్

పోకో ఎక్స్ 8 మరియు ఎక్స్ 8 పవర్ రెండు స్మార్ట్ ఫోన్ లను కూడా భారీ బ్యాటరీ సెటప్ తో లాంచ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసింది. వీటిలో పోకో ఎక్స్ 8 ఫోన్ లో 9000 mAh సిలికాన్ కార్బన్ బ్యాటరీతో మరియు పోకో ఎక్స్ 8 పవర్ స్మార్ట్ ఫోన్ ను 10000mAh సిలికాన్ కార్బన్ బ్యాటరీ తో లాంచ్ చేస్తోంది. ఈ రెండు ఫోన్లు పెద్ద బ్యాటరీ కలిగి ఉన్నా కూడా చాలా స్లీక్ డిజైన్ తో ఉంటాయి.

POCO X8 and X8 Power launch date

కేవలం బిగ్ బ్యాటరీ సెటప్ మాత్రమే కాదు ఈ ఫోన్లు ఉన్నతమైన ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటాయి. వీటిలో ఎక్స్ 8 పవర్ ఫోన్ 100W ఫాస్ట్ ఛార్జ్ తో వస్తుంది. అయితే, పోకో ఎక్స్ 8 ఫోన్ మాత్రం 67W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. అంతేకాదు, ఈ రెండు ఫోన్లు కూడా ఫాస్ట్ రివర్స్ ఛార్జ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటాయి. ఈ రెండు ఫోన్లు స్మార్ట్ ఛార్జింగ్, బైపాస్ ఛార్జింగ్ మరియు PPS ఛార్జింగ్ సపోర్ట్ ప్రీమియం చార్జింగ్ ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది.

Also Read: PF Balance ఆన్‌లైన్‌ లో ఎలా చెక్ చేసుకోవాలి : పూర్తి గైడ్

పోకో ఎక్స్ 8 మరియు ఎక్స్ 8 పవర్ రెండు స్మార్ట్ ఫోన్లు కూడా 300% వాల్యూమ్ బూస్ట్ సపోర్ట్ కలిగిన డ్యూయల్ స్టీరియో స్పీకర్లు ఉంటాయి. అంతేకాదు, ఈ ఫోన్లు Hi-Res Audio సర్టిఫికేషన్ కూడా కలిగి ఉంటుంది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ మరిన్ని కీలక ఫీచర్స్ కూడా పోకో ఒకొక్కటిగా రివీల్ చేస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile