Poco X6 Neo: 108MP డ్యూయల్ కెమేరాతో కొత్త ఫోన్ ప్రకటించిన పోకో.!

HIGHLIGHTS

కొత్త స్మార్ట్ ఫోన్ ను విడుదల చేస్తున్నట్లు పోకో ప్రకటించింది

అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ను Poco X6 Neo నియో పేరుతొ విడుదల చేస్తోంది

Sleek 'N' Sexy క్యాప్షన్ తో పోకో ఈ ఫోన్ ను రిప్రజెంట్ చేస్తోంది

Poco X6 Neo: భారత్ లో కొత్త స్మార్ట్ ఫోన్ ను విడుదల చేస్తున్నట్లు పోకో ప్రకటించింది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ను పోకో ఎక్స్ 6 నియో పేరుతొ విడుదల చేస్తోంది. ఈ పోకో అప్ కమింగ్ ఫోన్ లాంఛ్ డేట్, డిజైన్ మరియు కొన్ని కీలకమైన ఫీచర్స్ ను కూడా కంపెనీ వెల్లడించింది. ఈ ఫోన్ కోసం చేపట్టిన టీజింగ్ క్యాంపైన్ నుండి ఈ వివరాలను అందించింది. Sleek ‘N’ Sexy క్యాప్షన్ తో పోకో ఈ ఫోన్ ను రిప్రజెంట్ చేస్తోంది.

Poco X6 Neo: Launch

Poco X6 Neo launch Date

పోకో ఎక్స్ 6 నియో స్మార్ట్ ఫోన్ ను 13 March 2024 తేదికి ఇండియాలో విడుదల చేసినట్లు కంపెనీ తెలిపింది. ఈ ఫోన్ కోసం సేల్ పార్ట్నర్ గా ఫ్లిప్ కార్ట్ ను ఎంచుకుంది. అందుకే, ఈ ఫోన్ కోసం ప్రత్యేకమైన మైక్రో సైట్ పేజ్ ను అందించింది మరియు ఆ పేజ్ ద్వారా టీజింగ్ చేస్తోంది. ఈ పేజ్ ద్వారా ఈ పోకో యొక్క కీలకమైన ఫీచర్ లను ఈ టీజింగ్ పేజ్ ద్వారా అందించింది.

Also Read: Nothing Phone (2a) 5G: వన్ డే ఆఫర్ తో ఫస్ట్ సేల్ కి వస్తోంది.!

Poco X6 Neo: Features

పోకో ఎక్స్ 6 నియో స్మార్ట్ ఫోన్ ను చాలా సన్నని మరియు ఆకర్షణీయమైన డైజిన్ తో తీసుకు వస్తున్నట్లు పోకో గొప్పగా చెబుతోంది. ఈ ఫోన్ యొక్క డిజైన్ గురించి కంపెనీ Sleek ‘N’ Sexy క్యాప్షన్ తో సింపుల్ గా వివరించింది. అయితే, వాస్తవానికి కూడా ఈ ఫోన్ టీజర్ ఇమేజ్ చూస్తుంటే పోకో చెబుతున్న మాట నిజమే అని అనిస్తోంది.

Poco X6 Neo Display Features

ఈ ఫోన్ డిజైన్ విషయానికి వస్తే, ఏ ఫోన్ లో వెనుక పెద్ద కెమేరా బంప్ మరియు అందులో అందంగా పొదిగిన డ్యూయల్ కేమెరా సెటప్ వుంది. పోకో ఎక్స్ 6 నియో స్మార్ట్ ఫోన్ లో 108MP డ్యూయల్ రియర్ కెమేరా సెటప్ వుంది. ఈ కెమేరా సెటప్ చాలా స్టయిలిష్ గా మరియు చూడగానే ఆకట్టుకునే డిజైన్ తో కనిపిస్తోంది.

Poco X6 Neo Display Features

ఈ ఫోన్ లో అందించి డిస్ప్లే ఫీచర్స్ కూడా కంపెనీ ముందే వెల్లడించింది. ఈ పోకో ఫోన్ లో 93.3% స్క్రీన్ టు బాడీ రేషియో కలిగిన బి డిస్ప్లే ఉన్నట్లు పోకో తెలిపింది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ మరియు 1000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ను కలిగిన AMOLED డిస్ప్లే గా పోకో కన్ఫర్మ్ చేసింది. ప్రస్తుతానికి పోకో ఈ ఎక్స్ 6 నియో ఫోన్ గురించి ఈ వివరాలను మాత్రమే బయట పెట్టింది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :