Nothing Phone (2a) 5G: వన్ డే ఆఫర్ తో ఫస్ట్ సేల్ కి వస్తోంది.!

HIGHLIGHTS

లాంఛ్ ఆఫర్ల ద్వారా Nothing Phone (2a) 5G ఫోన్ 20 వేలకే అందుకునే అవకాశం

మొదటి రోజు లాంఛ్ ఆఫర్ల ద్వారా ఈ ఫోన్ 20 వేల ధరకే అందుకునే అవకాశం

ఈ ఫోన్ ను కేవలం రూ. 19,999 రూపాయల ఆఫర్ ధరకే అందుకోవచ్చు

Nothing Phone (2a) 5G: వన్ డే ఆఫర్ తో ఫస్ట్ సేల్ కి వస్తోంది.!

Nothing Phone (2a) 5G: భారత్ మొబైల్ మార్కెట్ నాడిని పట్టుకున్న నథింగ్ బ్రాండ్ బడ్జెట్ ధరలో నథింగ్ ఫోన్ (2a) 5G ని విడుదల చేసింది. ఈ ఫోన్ ను 25k సెగ్మెంట్ లో విడుదల చేసినా మొదటి రోజు లాంఛ్ ఆఫర్ల ద్వారా ఈ ఫోన్ 20 వేల ధరకే అందుకునే అవకాశం కూడా అందించింది. అందుకే, ఈ ఫోన్ ను మొదటి సేల్ నుండి కొనుగోలు చేస్తే లభించే ఆఫర్లు మరియు ఫోన్ స్పెక్స్ పైన ఒక లుక్కేయండి.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Nothing Phone (2a) 5G Price & Offer

నథింగ్ ఫోన్ (2a) 5G స్మార్ట్ ఫోన్ స్టార్టింగ్ వేరియంట్ (8GB + 128GB) ను కేవలం రూ. 23,999 ప్రైస్ తో విడుదల చేసింది. రెండవ (8GB + 256GB) వేరియంట్ ను కేవలం రూ. 25,999 ప్రైస్ తో ఈ ఫోన్ యొక్క హైఎండ్ వేరియంట్ (12GB + 256GB) ను రూ. 27,999 ప్రైస్ తో విడుదల చేసింది.

ఆఫర్స్

ఇక ఈ ఫోన్ పైన అందించిన లాంఛ్ ఆఫర్ల విషయానికి వస్తే, ఈ ఫోన్ ను HDFC బ్యాంక్ క్రెడిట్ / డెబిట్ కార్డ్ మరియు EMI ల పైన రూ. 2,000 డిస్కౌంట్ అందిస్తుంది. ఈ ఫోన్ ను ఎక్స్ చేంజ్ ఆప్షన్ తో కొనే వారికి కూడా రూ. 2,000 అధనపు డిస్కౌంట్ లభిస్తుంది. అంటే, ఈ రెండు ఆఫర్ల ద్వారా ఈ ఫోన్ ను కేవలం రూ. 19,999 రూపాయల ఆఫర్ ధరకే అందుకోవచ్చు.

Also Read: New Offer: రూ. 8,799 రూపాయలకే POCO M6 5G స్మార్ట్ ఫోన్ అందుకోండి.!

Nothing Phone (2a) 5G: ప్రత్యేకతలు

నథింగ్ సరికొత్తగా విడుదల చేసిన ఈ బడ్జెట్ 5జి స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ Dimensity 7200 Pro కొత్త ప్రోసెసర్ తో వచింది. ఈ ఫోన్ లో 8GB / 12GB ర్యామ్ మరియు 128GB / 256GB స్టోరేజ్ ఉన్నాయి. ఈ ఫోన్ ను 6.7 ఇంచ్ Flexible AMOLED డిస్ప్లేతో తీసుకు వచ్చింది. ఈ డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్ మరియు 1300 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ను కలిగి వుంది.

ఈ ఫోన్ లో 4K (at 60 fps) వద్ద వీడియో షూట్ చెయ్యగల 50MP (OIS) + 50MP డ్యూయల్ రియర్ సెటప్ కెమేరాని కలిగి వుంది. అంతేకాదు, ఈ ఫోన్ లో 32MP Camera (Sony IMX615) సెల్ఫీ కెమేరాని కూడా కలిగి వుంది. ఈ ఫోన్ 5000 mAh బ్యాటరీని 45 ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో కలిగి వుంది.

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile