ఇండియాలో పోకో లేటెస్ట్ గా విడుదల చేసిన Poco X4 Pro స్మార్ట్ ఫోన్ ఫస్ట్ సేల్ కోసం సిద్దమవుతోంది. స్నాప్ డ్రాగన్ 695 ఆక్టా కోర్ ప్రోసెసర్ మరియు 67W సోనిక్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన 5000 mAh బ్యాటరీ వంటి మరిన్ని ఫీచర్లతో వచ్చిన ఈ స్మార్ట్ ఫోన్ ఏప్రిల్ 5 మద్యహ్నం 12 గంటల నుండి Flipkart ద్వారా అందుబాటులోకి వస్తుంది. అంతేకాదు, ఈ స్మార్ట్ ఫోన్ భారీ అఫర్ తో మొదటిసారి అమ్మకానికి రానుంది. ఈ ఫోన్ లిమిటెడ్ పిరియడ్ బ్యాంక్ అఫర్ తో అమ్మకానికి వస్తోంది మరియు ఈ ఆఫర్ వివరాలు క్రింద చూడవచ్చు.
Survey
✅ Thank you for completing the survey!
Poco X4 Pro: ధర మరియు సేల్
పోకో ఎక్స్4 ప్రో స్మార్ట్ ఫోన్ ముదురు వేరియంట్లలో లభిస్తుంది. వీటి ధరలను క్రింద చూడవచ్చు.
ఏప్రిల్ 15 మధ్యాహ్నం 12 గంటల నుండి Flipakrt లో లభిస్తుంది. అలాగే, ఈ ఫోన్ పైన లిమిటెడ్ పిరియడ్ లాంచ్ అఫర్ కూడా వుంది. HDFC బ్యాంక్ క్రెడిట్/డెబిట్ మరియు EMI అప్షన్ తో ఈ ఫోన్ కొనేవారికి 1000 తగ్గింపు లభిస్తుంది.
Poco X4 Pro: స్పెక్స్
పోకో X4 ప్రో 5G స్మార్ట్ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.7-అంగుళాల FHD+ AMOLED స్క్రీన్‌ను కలిగివుంది. సెల్ఫీల కోసం ఈ ఫోన్ లో సెంట్రల్ కటౌట్ ఉంది. ఇందులో 16ఎంపి సెల్ఫీ కెమెరాను కలిగి వుంది. ఈ డిస్ప్లే గొరిల్లా గ్లాస్ సేఫ్టీతో వస్తుంది మరియు 1200 నిట్స్ పీక్ బ్రైట్నెస్ తో వస్తుంది. ఈ వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో, 64MP మైన్ కెమెరాకి జతగా 8MP అల్ట్రావైడ్ స్నాపర్ మరియు 2MP మాక్రో లెన్స్ ఉన్నాయి.
ఈ స్మార్ట్ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 695 5G SoCతో పాటు గరిష్టంగా 8GB RAM మరియు 256GB ఇంటర్నల్ స్టోరేజీని కలిగి ఉంటుంది. అలాగే, ఆండ్రాయిడ్ 11-ఆధారిత MIUI 13 పైన రన్ అవుతుంది మరియు డైనమిక్ ర్యామ్ సపోర్ట్ కూడా వుంది. ఈ ఫోన్ 67W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన 5,000 mAh బ్యాటరీని కలిగి ఉండడమే కాకుండా IP53 డస్ట్ మరియు స్ప్లాష్ రెసిస్టెన్స్ కలిగివుంది.