POCO X3 PRO రేపు ఇండియాలో లాంచ్ అవుతోంది: ఫీచర్లు ఎలా ఉన్నాయంటే..!

POCO X3 PRO రేపు ఇండియాలో లాంచ్ అవుతోంది: ఫీచర్లు ఎలా ఉన్నాయంటే..!
HIGHLIGHTS

POCO X3 PRO రేపు ఇండియాలో లాంచ్ అవుతోంది.

పోకో ఊరిస్తున్న #PRO స్మార్ట్ ఫోన్ ఇదే

స్పెక్స్ పరంగా అధికమైన పవర్

POCO X3 PRO రేపు ఇండియాలో లాంచ్ అవుతోంది. ధరను దృష్టిలో ఉంచుకొని కాకుండా స్పెక్స్ పరంగా అధికమైన పవర్ అందించేదిగా తన స్మార్ట్ ఫోన్ తీసుకొస్తున్నట్లు, చాలా కాలంగా పోకో ఊరిస్తున్న #PRO స్మార్ట్ ఫోన్ ఇదే. ఈ ఫోన్ గత వారంలో కొన్ని ఇతర దేశాల్లో లాంచ్ చెయ్యబడింది. ఈ ఫోన్ కి క్యాప్షన్ గా POCO Made Of Mad అనిచెబుతోందంటే ఈ ఫోన్ గురించి ఎక్కువగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. పోకో X3 ప్రో గ్లోబల్ వేరియంట్ ఫీచర్లను ఈ క్రింద చూడవచ్చు.  

Poco X3 Pro: ప్రత్యేకతలు

ఈ Poco X3 Pro స్మార్ట్ ఫోన్ ఒక 6.67-అంగుళాల Full HD + (2400 x 1080 పిక్సెల్స్) రిజల్యూషన్ డిస్ప్లేను 120Hz రిఫ్రెష్ రేట్ తో పాటుగా సెల్ఫీ కెమెరా కోసం మధ్యలో పంచ్-హోల్ డిజైన్ తో వుంటుంది. ఈ స్క్రీన్ యొక్క రక్షణ కోసం గొరిల్లా గ్లాస్ 6 తో వస్తుంది. ఈ ఫోన్ వెనుక భాగంలో పోకో X3 మాదిరిగా చదరపు ఆకారంలో గల కెమెరా సెటప్ ఉంది మరియు 215 గ్రాముల బరువున్న ఈ ఫోన్ 9.4 మిమీ మందంతో వస్తుంది.

ఈ ఫోన్ గరిష్టంగా 2.96GHz క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 870  ప్రాసెసర్ కలిగి ఆక్టా-కోర్ CPU మరియు అడ్రినో 640 GPU తో పనిచేస్తుంది. ఇది 8GB RAM మరియు 256GB వరకూ UFS 3.1 స్టోరేజ్ తో వస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 11-ఆధారిత MIUI 12 పై పోకో లాంచర్ తో నడుస్తుంది.

పోకో X3 ప్రో వెనుక భాగంలో క్వాడ్-కెమెరా సెటప్ తో వస్తుంది. దీనిలో ప్రాధమిక 48MP కెమెరాని , 8MP అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరాని, 2MP మాక్రో కెమెరాని మరియు 2MP డెప్త్ సెన్సార్ తో కలిగివుంది. ముందు భాగంలో, ఈ ఫోన్ పైభాగంలో నోచ్ కటౌట్ లోపల 20 MP  సెల్ఫీ కెమెరా ఉంది.

ఇది సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు 5,160 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో 33W ఫాస్ట్ ఛార్జింగ్ అవుట్-ఆఫ్-బాక్స్ తో వస్తుంది. ఇక ధర విషయానికి వస్తే, ఈ ఫోన్ స్టార్టింగ్ వేరియంట్ 6GB + 128GB వేరియంట్ EUR 199 ధరతో ప్రకటించింది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo