మరికొద్ది సేపట్లో భారీ ఆఫర్లతో POCO X3 PRO మొదటి సేల్

మరికొద్ది సేపట్లో భారీ ఆఫర్లతో POCO X3 PRO మొదటి సేల్
HIGHLIGHTS

POCO X3 pro మొదటి సేల్ మరికొద్ది సేపట్లో మొదలవుతుంది

ఈ రోజు జరగనున్న సేల్ నుండి భారీ అఫర్

X3 PRO లేటెస్ట్ ఫాస్ట్ ప్రాసెసర్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 860 SoC తో వచ్చింది.

POCO X3 PRO ఇటీవలే ఇండియాలో విడుదల చెయ్యబడింది. ఈ X3 PRO లేటెస్ట్ ఫాస్ట్  ప్రాసెసర్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 860 SoC తో వచ్చింది. ఇందులో UFS 3.1 అల్ట్రా ఫాస్ట్ స్టోరేజ్ వంటి చాలా హై ఎండ్ ఫీచర్స్ కూడా వున్నాయి. ఈ స్మార్ట్ ఫోన్ యొక్క మొదటి సేల్ ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకి మొదలవుతుంది. ఈ రోజు జరగనున్న సేల్ నుండి భారీ అఫర్ ని కూడా అందించింది.   

Poco X3 Pro: ధర

1. పోకో X3 ప్రో (6GB + 128GB) ధర : Rs.18,999

2. పోకో X3 ప్రో (8GB + 128GB) ధర : Rs.20,999    

పోకో X3 ప్రో యొక్క మొదటి సేల్ ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకి జరుగుతుంది. అలాగే, Flipkart నుండి సేల్ అవనున్న ఈ స్మార్ట్ ఫోన్ పైన ఆకర్షణీయమైన ఆఫర్లు కూడా అందిస్తోంది. ఈ ఫోన్ ను ఎక్స్చేంజి అఫర్ నుండి కొనేవారికి 10,549 రూపాయల వరకూ అఫర్ చేస్తోంది. అంతేకాదు, ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొనేవారికి 1,000 రూపాయల తగ్గింపును కూడా అఫర్ చేస్తోంది.  

Poco X3 Pro: ప్రత్యేకతలు

ఈ Poco X3 Pro స్మార్ట్ ఫోన్ ఒక 6.67-అంగుళాల Full HD + (2400 x 1080 పిక్సెల్స్) రిజల్యూషన్ డిస్ప్లేను 120Hz రిఫ్రెష్ రేట్ మరియు 240 Hz టచ్ శాంప్లింగ్ రేటుతో పాటుగా సెల్ఫీ కెమెరా కోసం మధ్యలో పంచ్-హోల్ డిజైన్ తో వుంటుంది. ఈ స్క్రీన్ యొక్క రక్షణ కోసం గొరిల్లా గ్లాస్ 6 ని అందించింది. ఈ ఫోన్ వెనుక భాగంలో పోకో X3 మాదిరిగా చదరపు ఆకారంలో గల కెమెరా సెటప్ ఉంది మరియు 215 గ్రాముల బరువున్న ఈ ఫోన్ 9.4 మిమీ మందంతో వస్తుంది.

ఈ ఫోన్ గరిష్టంగా 2.96GHz క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 860 ప్రాసెసర్ కలిగి ఆక్టా-కోర్ CPU మరియు అడ్రినో 640 GPU తో పనిచేస్తుంది. ఇది 6GB/8GB RAM మరియు 128GB UFS 3.1 స్టోరేజ్ తో వస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 11-ఆధారిత MIUI 12 పై పోకో లాంచర్ తో నడుస్తుంది. అంతేకాదు, ఈ ఫోన్ ను వేగంగా చల్లబరచడానికి లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీ ప్లస్ ఫీచర్ ని కూడా అందించింది.   

పోకో X3 ప్రో వెనుక భాగంలో క్వాడ్-కెమెరా సెటప్ తో వస్తుంది. దీనిలో ప్రాధమిక 48MP కెమెరాని , 8MP అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరాని, 2MP మాక్రో కెమెరాని మరియు 2MP డెప్త్ సెన్సార్ తో కలిగివుంది. ముందు భాగంలో, ఈ ఫోన్ పైభాగంలో పంచ్ హోల్ కటౌట్ లోపల 20 MP  సెల్ఫీ కెమెరా ఉంది.

ఇది సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు 5,160 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో 33W ఫాస్ట్ ఛార్జింగ్ అవుట్-ఆఫ్-బాక్స్ తో వస్తుంది. ఇక ధర విషయానికి వస్తే, ఈ ఫోన్ స్టార్టింగ్ వేరియంట్ 6GB + 128GB వేరియంట్ EUR 199 ధరతో ప్రకటించింది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo