Poco M7 Plus: 7000 mAh బిగ్ బ్యాటరీ మరియు 18W రివర్స్ ఛార్జ్ సపోర్ట్ తో విడుదలవుతుంది.!
Poco M7 Plus స్మార్ట్ ఫోన్ కొత్త అప్డేట్ పోకో విడుదల చేసింది
7000 mAh బిగ్ బ్యాటరీ మరియు 18W రివర్స్ ఛార్జ్ సపోర్ట్ తో విడుదలవుతుందని పోకో కొత్త అప్డేట్ విడుదల చేసింది
ఈ ఫోన్ బడ్జెట్ ధరలో లాంచ్ కాబోతున్న బిగ్ బ్యాటరీ ఫోన్ గా పోకో చెబుతోంది
Poco M7 Plus స్మార్ట్ ఫోన్ కొత్త అప్డేట్ పోకో విడుదల చేసింది. అప్ కమింగ్ పోకో స్మార్ట్ ఫోన్ 7000 mAh బిగ్ బ్యాటరీ మరియు 18W రివర్స్ ఛార్జ్ సపోర్ట్ తో విడుదలవుతుందని పోకో కొత్త అప్డేట్ విడుదల చేసింది. ఈ ఫోన్ టీజింగ్ తో కంపెనీ మంచి జోష్ తో ఉంది. ఎందుకంటే, ఈ ఫోన్ బడ్జెట్ ధరలో లాంచ్ కాబోతున్న బిగ్ బ్యాటరీ ఫోన్ గా పోకో చెబుతోంది.
SurveyPoco M7 Plus: కొత్త అప్డేట్
పోకో ఎం7 ప్లస్ 5జి స్మార్ట్ ఫోన్ భారీ 7000 mAh బిగ్ సిలికాన్ కార్బన్ బ్యాటరీ మరియు 18W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో లాంచ్ అవుతుందని పోకో అనౌన్స్ చేసింది. అంటే, ఈ ఫోన్ బిగ్ బ్యాటరీతో పాటు ఫాస్ట్ రివర్స్ ఛార్జ్ సపోర్ట్ పవర్ బ్యాంక్ మాదిరిగా కూడా ఉపయోగపడుతుంది. ఇది మాత్రమే కాదు ఈ ఫోన్ ఈ పెద్ద బ్యాటరీని వేగంగా ఛార్జ్ చేసే ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది.

ఈరోజు కంపెనీ అఫీషియల్ X అకౌంట్ నుండి అందించిన టీజర్ వీడియో ద్వారా ఈ ఫోన్ యొక్క పూర్తి డిజైన్ వివరాలు కూడా అందించింది. ఈ స్మార్ట్ ఫోన్ స్లీక్ మరియు సరికొత్త డిజైన్ కలిగి ఉన్నట్లు క్లియర్ చేసింది. ఇది మాత్రమే కాదు ఈ ఫోన్ వెనుక 50MP AI డ్యూయల్ కెమెరా సెటప్ కూడా కలిగి ఉన్నట్లు కూడా వెల్లడించింది.
ఈ ఫోన్ డిస్ప్లే వివరాలు కూడా పోకో అందించింది. ఈ ఫోన్ ను 6.9 ఇంచ్ బిగ్ సినిమాటిక్ స్క్రీన్ తో లాంచ్ చేస్తున్నట్లు పోకో తెలిపింది. ఈ స్క్రీన్ గేమింగ్ మరియు మంచి కంటెంట్ వ్యూవింగ్ ఎక్స్పీరియన్స్ కోసం తగిన 144Hz రిఫ్రెష్ రేట్ కూడా కలిగి ఉంటుంది. ఇదే కాదు ఈ ఫోన్ లో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు కళ్ళకు హాని కలగకుండా ఉండేలా TUV Rheinland ట్రిపుల్ సర్టిఫికేషన్ కలిగి ఉంటుంది.
Also Read: LG Dolby Soundbar ఈరోజు భారీ డిస్కౌంట్ తో 5 వేల బడ్జెట్ ప్రైస్ లో లభిస్తోంది.!
Poco M7 Plus: ప్రైస్ అండ్ లాంచ్
ఈ ఫోన్ లాంచ్ కంటే ముందే ఈ ఫోన్ యొక్క అంచనా ధర వివరాలు కంపెనీ స్వయంగా విడుదల చేసింది. ఈ ఫోన్ లాంచ్ టీజర్ లో భాగంగా ఈ అంచనా ప్రైస్ విడుదల చేసింది. ఈ ఫోన్ అండర్ రూ. 15,000 రూపాయల సెగ్మెంట్ స్మార్ట్ ఫోన్ గా ఇండియాలో లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ ఆగస్టు 13వ తేదీన మార్కెట్ లో లంచ్ అవుతుంది. ఈ ఫోన్ మరిన్ని అప్డేట్స్ తో మళ్ళి కలుద్దాం.