108MP కెమెరా మరియు 33W ఫాస్ట్ ఛార్జ్ తో Poco M6 ను పోకో లాంచ్ చేస్తోంది.!
Poco M6 ను గ్లోబల్ మార్కెట్ లో విడుదల చేస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది
ఈ ఫోన్ ఫీచర్స్ మరియు ప్రైస్ వివరాలు కూడా పోకో వెల్లడించింది
జూన్ 11న గ్లోబల్ మార్కెట్ లో లాంచ్ అవుతుంది
Poco M6 స్మార్ట్ ఫోన్ ను గ్లోబల్ మార్కెట్ లో విడుదల చేస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ను 108MP కెమెరా మరియు 33W ఫాస్ట్ ఛార్జ్ వంటి మరిన్ని ఆకర్షణీయమైన ఫీచర్స్ తో గ్లోబల్ మార్కెట్ లో విడుదల చేయబోతున్నట్లు కంపెనీ అనౌన్స్ చేసింది. ఈ ఫోన్ లాంచ్ కంటే ముందే ఈ ఫోన్ ఫీచర్స్ మరియు ప్రైస్ వివరాలు కూడా పోకో వెల్లడించింది.
SurveyPoco M6 : గ్లోబల్ లాంచ్
పోకో ఎం6 స్మార్ట్ ఫోన్ రేపు, అంటే జూన్ 11న గ్లోబల్ మార్కెట్ లో లాంచ్ అవుతుంది. ఈ స్మార్ట్ ఫోన్ ను రెండు వేరియంట్ లలో విడుదల చేస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఈ ఫోన్ 6GB + 128GB వేరియంట్ ను $ 129 (సుమారు రూ. 10,800) ధరతో మరియు 8GB + 256GB వేరియంట్ ను $ 149 (సుమారు రూ. 12,500) ధరతో లాంచ్ చేయనున్నట్లు ప్రకటించింది.
Poco M6 : ఫీచర్లు
పోకో ఎం 6 స్మార్ట్ ఫోన్ ను మీడియాటెక్ లేటెస్ట్ ఫాస్ట్ 4G ప్రోసెసర్ Helio G91 Ultra తో లాంచ్ చేస్తోంది. ఈ ప్రోసెసర్ కి జతగా 8GB ర్యామ్ మరియు 256GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. ఈ ఫోన్ లో 6.79 ఇంచ్ బిగ్ డిస్ప్లే, 90Hz రిఫ్రెష్ రేట్ మరియు FHD+ రిజల్యూషన్ తో ఉంటుంది. ఈ పోకో అప్ కమింగ్ ఫోన్ సైడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ తో ఉంటుంది మరియు ఈ ఫోన్ Xiaomi Hyper OS తో వస్తుంది.

ఈ ఫోన్ లో వెనుక 108MP సూపర్ క్లియర్ మెయిన్ కెమెరా మరియు 2MP మ్యాక్రో కెమెరా కలిగిన డ్యూయల్ రియర్ కెమెరా వుంది. ఈ ఫోన్ లో 13MP సెల్ఫీ కెమెరా కూడా వుంది. పోకో ఎం 6 సెల్ఫీ మరియు రియర్ కెమెరాతో 1080p వీడియోలు షూట్ చేసే అవకాశం వుంది.
Also Read: Motorola Edge 50 ultra: మోటో AI మరియు సినిమాటిక్ స్క్రీన్ వంటి జబర్దస్త్ ఫీచర్స్ తో వస్తోంది.!
ఈ ఫోన్ ను 33W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన 5030 mAh బ్యాటరీతో లాంచ్ చేస్తున్నట్లు కూడా తెలిపింది. ఈ ఫోన్ ను బ్లాక్, పర్పుల్ మరియు సిల్వర్ మూడు కలర్ ఆప్షన్ లలో విడుదల చేస్తుంది. ఈ ఫోన్ చాలా సన్నని డిజైన్ మరియు డ్యూయల్ టోన్ కలర్ తో ఆకట్టుకుంటోంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile
