భారత్ మొబైల్ మార్కెట్ లో 10 వేల ధరలో పోకో ప్రవేశపెట్టిన Poco M6 Pro 5G స్మార్ట్ ఫోన్ యొక్క new Variant ను కూడా తెచ్చింది. ఈ పోకో 10 వేల బడ్జెట్ లో Snapdragon ఫాస్ట్ ప్రోసెసర్ మరియు ఆకర్షణీయమైన ఫీచర్స్ తో ఆకట్టుకుంటోంది. అయితే, స్టార్టింగ్ వేరియంట్ లో అందించిన 64GB కంటే ఎక్కువ స్టోరేజ్ ను కోరుకునే వారికీ కోసం కొత్త 128GB స్టోరేజ్ వేరియంట్ ను కూడా కంపెనీ ఇప్పుడు అందించింది. ఈ వేరియంట్ ధర , స్పెక్స్, ఫీచర్స్ తో పాటుగా లేటెస్ట్ ఆఫర్స్ పైన కూడా ఒక లుక్కేద్దామా.
Survey
✅ Thank you for completing the survey!
Poco M6 Pro 5G new Variant
Poco M6 Pro 5G ఫోన్ ను ముందుగా 4 GB RAM + 64 GB (ధర రూ.10,999) మరియు 6 GB RAM + 128 GB (ధర రూ.12,999) వేరియంట్ లలో అందించింది. అయితే, పోకో ఇప్పుడు 4 GB RAM + 128 GB వేరియంట్ ను కొత్తగా లాంచ్ చేసింది మరియు ఈ వేరియంట్ ను Flipkart ద్వారా సేల్ కు అందుబాటులోకి కూడా తీసుకువచ్చింది.
ఈ పోకో లేటెస్ట్ ఫోన్ ను HDFC Bank Credit / Debit Card తో EMI అఫర్ ద్వారా కొనుగోలు చేసే వారికి రూ. 500 తగ్గింపు లభిస్తుంది. అలాగే, ఈ పోకో ఫోన్ పైన ఎక్స్ చేంజ్ అఫర్ ను కూడా Flipkart అఫర్ చేస్తోంది. Buy From Here
Poco M6 Pro 5G new Variant: specs
పోకో కొత్త వేరియంట్ స్పెక్స్ లో ఎటువంటి కొత్త మార్పులు లేవు. పోకో ఎం6 ప్రో యొక్క 4GB వేరియంట్ యొక్క స్టోరేజ్ ను డబుల్ చేసి 128GB స్టోరేజ్ ను అందించింది. Poco M6 Pro 5G ఫోన్ 10 వేల ధరలో 6.79 ఇంచ్ 90Hz FHD+ డిస్ప్లే, 18W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన 5000 mAh బిగ్ బ్యాటరీ, Snapdragon 4 Gen 2 ఫాస్ట్ 5G ప్రోసెసర్ జతగా 4 GB / 6 GB RAM మరియు 128 GB స్టోరేజ్ లతో వస్తుంది.
ఈ పోకో ఫోన్ లో 50MP మెయిన్ కెమేరా + 2MP పోర్ట్రైట్ కెమేరా లను అందించింది మరియు 8MP సెల్ఫీ కెమేరాని కలిగి వుంది. ఈ ఫోన్ Flipkart పైన 4.3 యూజర్ రేటింగ్ ను అందుకుంది మరియు బెస్ట్ ఇన్ ది ప్రైస్ సెగ్మెంట్ గా ఎక్కువ మంది యూజర్ల కితాబు అందుకుంది.
What is AnTuTu score of Poco M6 Pro 5G?
ఈ పోకో ఫోన్ AnTuTu పైన 4,37,000 స్కోర్ ను సాధించిందని పోకో క్లెయిమ్ చేసింది.