Poco M3 Pro vs Realme 8 5G :కంప్లీట్ కంపేరిజన్

Poco M3 Pro vs Realme 8 5G :కంప్లీట్ కంపేరిజన్
HIGHLIGHTS

ఇండియాలో బడ్జెట్ 5G స్మార్ట్ ఫోన్ల సందడి మొదలయ్యింది

Poco M3 Pro మరియు Realme 8 5G లను పోల్చి చూద్దాం

Poco M3 Pro vs Realme 8 5G :కంప్లీట్ కంపేరిజన్

ఇండియాలో బడ్జెట్ 5G స్మార్ట్ ఫోన్ల సందడి మొదలయ్యింది. మొన్నటి వరకూ Realme 8 5G మాత్రమే బడ్జెట్ ధరలో దొరికే ఏకైక 5G స్మార్ట్ ఫోన్. కానీ, ఈ లిస్ట్ లో నిన్న ప్రకటించిన Poco M3 Pro కూడా నిలిచింది. Poco సంస్థ మార్కెట్ లో గట్టి పోటీని ఇవ్వడానికి తీసుకొచ్చిన ఈ లేటెస్ట్ 5G స్మార్ట్ ఫోన్ ధరను కూడా చాలా పోటీగా ఉంచింది. అందుకే, Poco M3 Pro మరియు Realme 8 5G స్మార్ట్ ఫోన్లు  అఫర్ చేసే స్పెక్స్ మరియు ఫీచర్ల పరంగా ఎలా ఉంటాయి, అనే విషయాలన్ని పరిశీలిద్దాం.                                    

Price:

ముందుగా, Poco M3 Pro మరియు Realme 8 5G స్మార్ట్ ఫోన్ల ధర వివరాలను చూద్దాం.

Poco M3 Pro: ధర

1. Poco M3 Pro (4GB + 64GB) ధర – Rs.13,999

2. Poco M3 Pro (6GB + 128GB) ధర – Rs.15,999

Realme 8 5G :  ధర

1. Realme 8 5G (4GB + 64GB) ధర – Rs.13,999

2. Realme 8 5G (4GB + 128GB) ధర – Rs.14,999

3. Realme 8 5G (8GB + 128GB) ధర – Rs.16,999

డిస్ప్లే :

డిస్ప్లే విభాగంలో, ఈ రెండు స్మార్ట్ ఫోన్ల డిస్ప్లేలు కూడా దాదాపుగా ఒకేలా ఉంటాయి. ఎందుకంటే, ఈ రెండు స్మార్ట్ ఫోన్లు కూడా 6.5-అంగుళాల FHD + రిజల్యూషన్ డిస్ప్లే తో ఉంటాయి మరియు రెండు ఫోన్ల డిస్ప్లే లు  కూడా 90 Hz రిఫ్రెష్ రేట్ తో వస్తాయి. ఈ రెండు స్మార్ట్ ఫోన్లు కూడా పంచ్ హోల్ డిజైనుతో ఉంటాయి.

Processor :

ఈ రెండు స్మార్ట్ ఫోన్ల ప్రొసెసర్ విషయంలో కూడా ఒకేవిధంగా ఉంటాయి. ఎందుకంటే,ప్రాసెసర్ పరంగా ఈ రెండు స్మార్ట్ ఫోన్లు కూడా డ్యూయల్ 5G సపోర్ట్ కలిగిన మీడియాటెక్ డైమెన్సిటీ 700 SoC తో వస్తాయి. ఇది 6GB RAM మరియు వరకు మరియు 128GB వరకు స్టోరేజ్ తో జతగా వస్తాయి. అయితే, Realme 8 5G కి మాత్రం 8GB వేరియంట్ కూడా వుంది. 

వెనుక కెమేరా :

ఇక ఈ విభాగంలో ఈ రెండు స్మార్ట్ ఫోన్లు ఒకేవిధమైన కెమేరా సెటప్ కలిగి ఉన్నా సెన్సార్ లలో కొంత మార్పు ఉంటుంది. రియల్మి 8 5G మరియు పోకో M3 ప్రో 5G రెండు కూడా వెనుక భాగంలో 48MP ట్రిపుల్ కెమెరా సెటప్ కలిగి ఉంటాయి. Realme 8 5G స్మార్ట్ ఫోన్ లో కూడా 48MP + 2MP మ్యాక్రో మరియు 2MP B&W  సెన్సార్ ఉంటాయి. Poco M3 Pro 5G లో మాత్రం 48MP + 2MP మ్యాక్రో సెన్సార్ + 2MP డెప్త్ సెన్సార్ ఉంటాయి.

సెల్ఫీ కెమెరా :

ఈ విభాగంలో, ఈ  రెండింటి ఫోన్లలో చాలా వ్యత్యాసం వుంటుంది. రియల్మీ 8 5G 16MP సెల్ఫీ కెమెరాతో వస్తుంది. కానీ, పోకో M3 ప్రో 5G మాత్రం 8MP సెల్ఫీ కెమెరాతో వస్తుంది. రెండు ఫోన్లు కూడా పంచ్ హోల్ సెల్ఫీ డిజనుతోనే వస్తాయి.      

 బ్యాటరీ :

రియల్మీ 8 5G ఒక 5,000mAh బ్యాటరీ మరియు 18W క్విక్ ఛార్జ్ టెక్నాలజీ మద్దత్తుతో వుంటుంది. ఇక పోకో M3 ప్రో 5G విషయానికి వస్తే, ఇది కూడా 5000mAh బ్యాటరీని 18W 18W ఫాస్ట్ ఛార్జ్ టెక్నాలజీ మద్దత్తుతో వస్తుంది.

OS & సెక్యూరిటీ:

ఈ విభాగంలో, Poco M3 Pro 5G ఇది MIUI 12 స్కిన్ పైన ఆండ్రాయిడ్ 11 తో వస్తుంది. Realme 8 5G స్మార్ట్ ఫోన్ తమ సొంత Realme UI 2.0 స్కిన్ పైన ఆండ్రాయిడ్ 11 ఆధారితంగా పనిచేస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo