POCO F7 5G: భారీ డిస్కౌంట్ ఆఫర్స్ తో పోకో లేటెస్ట్ ఫోన్ ఫస్ట్ సేల్.!

HIGHLIGHTS

పోకో లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ పోకో ఎఫ్ 7 ఫస్ట్ సేల్ రేపు మొదలవుతుంది

భారీ ఆఫర్స్ మరియు డీల్స్ తో రేపు మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం అవుతుంది

పోకో ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ సమయంలో గొప్ప లాంచ్ ఆఫర్స్ ఈ ఫోన్ పై అందించింది

POCO F7 5G: భారీ డిస్కౌంట్ ఆఫర్స్ తో పోకో లేటెస్ట్ ఫోన్ ఫస్ట్ సేల్.!

POCO F7 5G: భారీ ఫీచర్స్ మరియు సరికొత్త డిజైన్ తో ఇండియాలో విడుదలైన పోకో లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ పోకో ఎఫ్ 7 ఫస్ట్ సేల్ రేపు మొదలవుతుంది. ఈ ఫోన్ మొదటి సేల్ భారీ ఆఫర్స్ మరియు డీల్స్ తో రేపు మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం అవుతుంది. ఈ ఫోన్ సేల్ కంటే ముందు ఈ ఫోన్ గురించి తెలుసుకోవలసిన పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

POCO F7 5G: ప్రైస్

పోకో ఎఫ్ 7 5జి స్మార్ట్ ఫోన్ ఇండియన్ మార్కెట్లో రూ. 31,999 రూపాయల ప్రారంభ ధరతో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ రెండవ వేరియంట్ రూ. 33,999 రూపాయల ధరతో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ బేసిక్ వేరియంట్ ని 12 జీబీ + 256 జీబీ తో మరియు రెండవ వేరియంట్ 12 జీబీ + 512 జీబీ తో అందించింది.

ఆఫర్స్

పోకో ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ సమయంలో గొప్ప లాంచ్ ఆఫర్స్ ఈ ఫోన్ పై అందించింది. ఈ ఫోన్ పై బ్యాంక్ డిస్కౌంట్ మరియు ఎక్స్ చేంజ్ బోనస్ రెండు ఆఫర్స్ అందించింది. అయితే, ఈ రెండింటిలో ఒక ఆఫర్ మాత్రమే అందుకునే అవకాశం ఉంటుంది.

అదేమిటంటే, ఈ ఫోన్ ను SBI, HDFC మరియు ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో కొనుగోలు చేసే వారికి రూ. 2,000 అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. లేదా ఈ ఫోన్ ను ఎక్స్ చేంజ్ ఆఫర్ తో కొనుగోలు చేసే వారికి రూ. 2,000 రూపాయల అదనపు ఎక్స్ చేంజ్ బోనస్ లభిస్తుంది. ఎలా చూసినా ఈ ఫోన్ పై రూ. 2,000 రూపాయల డిస్కౌంట్ అందుకునే అవకాశం వుంది. ఈ ఆఫర్ తో ఈ ఫోన్ కేవలం రూ. 29,999 రూపాయల ప్రారంభ ధరకే లభిస్తుంది.

POCO F7 5G: ఫీచర్స్

పోకో ఎఫ్ 7 5జి స్మార్ట్ ఫోన్ మధ్యలో మెటల్ ఫ్రేమ్ మరియు ముందు వెనుక డ్యూయల్ స్ట్రాంగ్ గ్లాస్ డిజైన్ తో ఉంటుంది. ఈ ఫోన్ క్వాల్కమ్ యొక్క లేటెస్ట్ Snapdragon 8s Gen 4 ఆక్టాకోర్ ప్రాసెసర్ తో లాంచ్ అయ్యింది. ఈ ప్రోసెసర్ 2.1Mn కంటే పై చిలుకు AnTuTu స్కోర్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ మరింత గొప్ప పెర్ఫార్మన్స్ అందించడానికి వీలుగా 12 జీబీ LPDDR5X ర్యామ్ మరియు 512 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో 24 జీబీ టర్బో ర్యామ్ ఫీచర్ ను కూడా పోకో అందించింది.

POCO F7 5G

ఈ ఫోన్ గేమింగ్ మరియు కంటెంట్ అవసరాలు తీర్చడానికి తగిన 1.5K రిజల్యూషన్ కలిగిన 6.83 ఇంచ్ AMOLED స్క్రీన్ తో వస్తుంది. ఈ స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్, 3200 నిట్స్ పీక్ బ్రైట్నెస్, HDR 10+ మరియు Dolby Vision సపోర్ట్ వంటి ఆకట్టుకునే ఫీచర్స్ కలిగి ఉంటుంది. అంతేకాదు, ఈ స్క్రీన్ వెట్ టచ్ సపోర్ట్ మరియు గ్లోవ్ టచ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది.

Also Read: నెవర్ బిఫోర్ ఆఫర్: 16 వేలకే బ్రాండెడ్ 43 ఇంచ్ 4K Dolby Vision స్మార్ట్ టీవీ అందుకోండి.!

ఈ పోకో స్మార్ట్ ఫోన్ 50MP Sony IMX882 (OIS + EIS) ప్రధాన కెమెరా మరియు 8MP సోనీ అల్ట్రా వైడ్ కెమెరా కలిగిన డ్యూయల్ రియర్ కెమెరా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ముందు భాగంలో 20MP సెల్ఫీ కెమెరా కూడా ఉంటుంది. ఈ ఫోన్ 60fps వద్ద 4K వీడియో రికార్డింగ్ మరియు HDR 10+ వీడియో రికార్డింగ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 90W టర్బో ఛార్జ్ మరియు 22.5W రివర్స్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన 7550W బిగ్ బ్యాటరీ తో వస్తుంది. ఈ ఫోన్ IP66, IP68 మరియు IP69 రేటింగ్ తో వాటర్ రెసిస్టెంట్ రెసిస్టెంట్ గా ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo