సూపర్ ఫీచర్లతో విడుదలైన Poco F2 Pro స్మార్ట్ ఫోన్

సూపర్ ఫీచర్లతో విడుదలైన Poco F2 Pro స్మార్ట్ ఫోన్
HIGHLIGHTS

Poco F2 Pro సూపర్ AMOLED స్క్రీన్ ‌తో పాటు నోచ్ కటౌట్ లేకుండా వస్తుంది.

అన్ని రూమర్లను మరియు అంచనాలను దాటుకొని, పోకో ఎఫ్ 2 ప్రో ఎట్టకేలకు పోకో ఎఫ్ 1 యొక్క నెక్స్ట్ జనరేషన్ ఫోనుగా  ప్రపంచవ్యాప్తంగా ప్రారంభించబడింది. పోకో ఎఫ్ 1 యొక్క 1.64 మిలియన్ యూనిట్లకు పైగా అమ్ముడైన తరువాత, సంస్థ తన మాతృ సంస్థ షావోమి నుండి విడిపోయి ప్రత్యేక చట్టపరమైన సంస్థగా ఏర్పాటయ్యింది. అప్పటి నుండి, పోకో భారతదేశంలో Poco X 2 ను విడుదల చేసింది, ఇది కొత్త శ్రేణి ఫోన్లలో మొదటిది. అయితే, పోకో అభిమానులు పోకో ఎఫ్ 1 యొక్క నిజమైన వారసుడి కోసం  ఎదురుచూశారు మరియు మే 12 న, కంపెనీ చివరకు పోకో ఎఫ్ 2 ను ప్రో వారికోసం విడుదల చేసింది.

పోకో ఎఫ్ 2 ప్రో ఫ్లాగ్‌షిప్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 865 5G చిప్ ‌ను 64 MP క్వాడ్-కెమెరా సెటప్‌తో పాటు సూపర్ AMOLED స్క్రీన్ ‌తో పాటు నోచ్ కటౌట్ లేకుండా వస్తుంది. ఇది షావోమి రెడ్మి కె 30 ప్రో ఉపయోగించే అదే సెటప్ తో వస్తుంది. పోకో ఎఫ్ 2 ప్రో యొక్క ప్రత్యేకతలను క్లుప్తంగా చూద్దాం.

పోకో ఎఫ్ 2 ప్రో: ధర మరియు లభ్యత

6 జిబి ర్యామ్ మరియు 128 జిబి స్టోరేజ్‌తో బేస్ వేరియంట్ కోసం పోకో ఎఫ్ 2 ప్రో EUR 499 (సుమారు రూ .40,752) మరియు 8 జిబి ర్యామ్ మరియు 256 జిబి స్టోరేజ్‌తో మాక్స్డ్-అవుట్ వేరియంట్ కోసం EUR 599 లు ఖర్చు చేయాల్సి ఉంటుంది.

ఇది నాలుగు రంగులలో లభిస్తుంది అవి : నియాన్ బ్లూ, ఫాంటన్ వైట్, ఎలక్ట్రిక్ పర్పుల్ మరియు సైబర్ గ్రే

పోకో ఎఫ్ 2 ప్రో : ప్రత్యేకతలు

పోకో ఎఫ్ 2 ప్రోలో ఒక 6.67-అంగుళాల FHD + (2400 x 1080 పిక్సెల్స్) రిజల్యూషన్ డిస్ప్లే ఉంది, ఇది సూపర్ అమోలెడ్ ప్యానెల్‌ను ఉపయోగిస్తుంది. ఈ స్క్రీన్ 20: 9 యాస్పెక్ట్ రేషియోని కలిగి ఉంది మరియు రెగ్యులర్ ఫాల్స్ నుండి అదనపు రక్షణ కోసం గొరిల్లా గ్లాస్ 5 తో వస్తుంది. ఈ ఫోన్ వెనుక గ్లాస్ ప్యానల్‌తో అల్యూమినియం ఫ్రేమ్ కలిగి ఉంది మరియు 8.9 మిమీ మందంతో వస్తుంది.

ఈ ఫోన్ టాప్-ఆఫ్-ది-లైన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 865 చిప్‌సెట్‌తో ఆక్టా-కోర్ CPU మరియు అడ్రినో 650 GPU తో పనిచేస్తుంది. ఇది 8GB LPDDR5 RAM మరియు 256GB UFS 3.1 స్టోరేజితో జత చేయబడింది. ఇది ఆండ్రాయిడ్ 10 ఆధారిత పోకో లాంచర్ 2.0 లో డార్క్ మోడ్, పునరుద్దరించబడిన యాప్ డ్రాయర్‌తో పాటు అనేక కొత్త ఫీచర్లతో నడుస్తుంది.

పోకో ఎఫ్ 2 ప్రోలో క్వాడ్-కెమెరా సెటప్ ఉంది, ఇందులో ప్రాధమిక 64 MP కెమెరా, 5 MP  టెలిఫోటో లెన్స్, 13 MP  అల్ట్రా వైడ్ కెమెరా మరియు 2 MP  డెప్త్ సెన్సార్ ఉన్నాయి. దీనికి డ్యూయల్-LED  ఫ్లాష్ మరియు ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సిస్టమ్ మద్దతు ఇస్తుంది. వెనుక కెమెరాలు 8 K లో రిజల్యూషన్ తో 30 fps వద్ద, 4 K UHD ని 60 fps వరకు రికార్డ్ చేయగలదు. ముందు భాగంలో 20MP సెల్ఫీ కెమెరా ఉన్న పాప్-అప్ కెమెరా ఉంది.

ఇది వైఫై 6 మోడెమ్‌తో వస్తుంది మరియు Hi -Res ఆడియో ప్లేబ్యాక్‌ కు మద్దతు ఇస్తుంది. వేగంగా అన్‌లాక్ చేయడానికి స్క్రీన్‌లో ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. ఎఫ్ 2 ప్రో 4,700 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో 30W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో మరియు బాక్స్ లోనే దీనికి సరిపడిన ఛార్జర్ తో వస్తుంది. కేవలం 63 నిమిషాల్లో ఫోన్ 0-100% నుండి ఛార్జ్ అవుతుందని పేర్కొంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo