POCO C85x 5G: అత్యంత చవకైన బిగ్ బ్యాటరీ 5జి ఫోన్ ఫస్ట్ సేల్ రేపు స్టార్ట్ అవుతుంది.!

HIGHLIGHTS

అత్యంత చవకైన బిగ్ బ్యాటరీ 5జి ఫోన్ ఫస్ట్ సేల్ రేపు స్టార్ట్ అవుతుంది

POCO C85x 5G పవర్‌ఫుల్ చిప్ సెట్ కలిగి ఉంటుంది

ఈ ఫోన్ ఫస్ట్ సేల్ కంటే ముందే ఈ ఫోన్ కలిగిన కంప్లీట్ ఫీచర్స్ మరియు స్పెక్స్ తెలుసుకోండి

POCO C85x 5G: ఇండియన్ మార్కెట్లో పోకో అందించిన అత్యంత చవకైన బిగ్ బ్యాటరీ 5జి ఫోన్ ఫస్ట్ సేల్ రేపు స్టార్ట్ అవుతుంది. ఈ స్మార్ట్ ఫోన్ 6300mAh భారీ బ్యాటరీ మరియు 6 లక్షల కంటే ఎక్కువ AnTuTu స్కోర్ అందించే పవర్‌ఫుల్ చిప్ సెట్ కలిగి ఉంటుంది. అయితే ఈ ఫోను అతి తక్కువ ధరలో అందించి అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ ఫోన్ ఫస్ట్ సెల్ కంటే ముందే ఈ ఫోన్ కలిగిన కంప్లీట్ ఫీచర్స్ మరియు స్పెక్స్ తెలుసుకోండి.

POCO C85x 5G: ప్రైస్

పోకో ఈ ఫోన్ ను రెండు వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. ఈ రెండు వేరియంట్ ధరలు క్రింద చూడవచ్చు.

పోకో సి 85x (4GB + 64GB) వేరియంట్ ప్రైస్ : రూ. 10,999

పోకో సి 85x (4GB + 128GB) వేరియంట్ ప్రైస్ : రూ. 11,999

మార్చి 14వ తేదీ మధ్యాహ్నం 12, అనగా రేపు మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ బడ్జెట్ 5జి స్మార్ట్ ఫోన్ సేల్ ప్రారంభం అవుతుంది. ఈ ఫోన్ ఫ్లిప్ కార్ట్ నుంచి సేల్ అవుతుంది మరియు ఇది బ్లాక్, గోల్డ్ మరియు గ్రీన్ మూడు రంగుల్లో లభిస్తుంది.

POCO C85x 5G: ఫీచర్స్

ఈ స్మార్ట్ ఫోన్ ఎంటర్టైన్మెంట్ కోసం తగిన బిగ్ 6.9 ఇంచ్ డిస్ప్లే తో వస్తుంది. ఈ బిగ్ స్క్రీన్ HD+ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్ తో పాటు 800 HBM పీక్ బ్రైట్నెస్ సపోర్ట్ తో కూడా వస్తుంది. ఈ ఫీచర్ తో ఈ ఫోన్ బిగ్ అండ్ బెస్ట్ విజువల్స్ అందిస్తుంది. డిజైన్ పరంగా, ఈ పోకో లేటెస్ట్ ఫోన్ కేవలం 7.95mm మందం కలిగి గొప్ప స్లీక్ ఫోన్ గా ఉంటుంది.

ఇక ఈ ఫోన్ ప్రోసెసర్ విషయానికి వస్తే, ఈ ;పోకో ఫోన్ Unisoc T8300 5G ప్రోసెసర్ తో పని చేస్తుంది. ఇది 2.2GHz క్లాక్ స్పీడ్ తో ఉంటుంది మరియు 6 లక్షల కంటే ఎక్కువ AnTuTu స్కోర్ ఆఫర్ చేస్తుంది. ఈ ఫోన్ 4GB ఫిజికల్ ర్యామ్ జతగా 4GB అదనపు ర్యామ్ తో టోటల్ 8GB ర్యామ్ ఫీచర్ కలిగి ఉంటుంది మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. ఈ ఫోన్ అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆండ్రాయిడ్ 16 OS తో నడుస్తుంది.

Also Read: భారీ డిస్కౌంట్ కేవలం 5 వేల బడ్జెట్ లోనే ZEBRONICS 5.1 Soundbar అందుకోండి.!

కెమెరా పరంగా, C85x లో వెనుక 32MP ప్రధాన కెమెరాతో డ్యూయల్ రియర్ కెమెరా ఉంటుంది మరియు ముందు 8MP సెల్ఫీ కెమెరా ఉంది. AI కెమెరా ఫీచర్స్ మరియు ఈ ఫోన్ 10x డిజిటల్ జూమ్ ఫీచర్ తో వస్తుంది. ఈ ఫోన్ లో భారీ 6300 mAh బ్యాటరీ తో పాటు ఈ బిగ్ బ్యాటరీని వేగంగా ఛార్జ్ చేసే 15W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కూడా జత చేసింది. అదనంగా ఈ ఫోన్ లో 7.5W ఫాస్ట్ రివర్స్ ఛార్జ్ సపోర్ట్ ను కూడా యాడ్ చేసింది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :