సమ్మర్ హీట్ ని బీట్ చేసే బెస్ట్ Air Cooler డీల్స్ అందించిన ఫ్లిప్ కార్ట్.!

HIGHLIGHTS

ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ నుంచి ఈరోజు Air Cooler పై గొప్ప డీల్స్ ఆఫర్ చేస్తోంది

ఈ సమ్మర్ సీజన్ ను బీట్ చేయాలంటే మంచి ఏసీ లేదా ఒక మంచి ఎయిర్ కూలర్ ను కలిగి ఉండాల్సిందే

ఈరోజు ఫ్లిప్ కార్ట్ ఆఫర్ చేస్తున్న బెస్ట్ బడ్జెట్ ఎయిర్ కూలర్ డీల్స్ ఇక్కడ అందించాము

ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ నుంచి ఈరోజు Air Cooler పై గొప్ప డీల్స్ ఆఫర్ చేస్తోంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో టెంపరేచర్ పెరిగింది మరియు ప్రజలు ఎయిర్ కూలర్ లేదా ఏసీ లను ఆశ్రయించడం మొదలుపెట్టారు. ఈ సమ్మర్ సీజన్ ను బీట్ చేయాలంటే మంచి ఏసీ లేదా ఒక మంచి ఎయిర్ కూలర్ ను కలిగి ఉండాల్సిందే. అయితే, బడ్జెట్ ను కూడా దృష్టిలో ఉంచుకోవాలి. అందుకే, ఈరోజు ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి ఆఫర్ చేస్తున్న బెస్ట్ బడ్జెట్ ఎయిర్ కూలర్ డీల్స్ ఇక్కడ అందించాము.

Air Cooler డీల్స్

ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ నుంచి ఈరోజు అందించిన బెస్ట్ బడ్జెట్ వారి కూలర్ డీల్స్ లో రెండు బెస్ట్ డీల్స్ ఈరోజు అందిస్తున్నాము. అవేమిటంటే, ఒకటి Sansui 93 లీటర్ డిజర్ట్ కూలర్ మరియు రెండోది Symphony 75 లీటర్ డిజర్ట్ కూలర్. ఈ రెండు ఎయిర్ కూలర్ ఆఫర్స్ మరియు ఫీచర్స్ ఇప్పుడు చూద్దాం.

Sansui 93L Air Cooler

ఈ సాన్సుయి ఎయిర్ కూలర్ ని ఈరోజు ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ నుంచి 50% బిగ్ డిస్కౌంట్ తో కేవలం రూ. 7,999 ఆఫర్ ధరలో సేల్ చేస్తోంది. ఇది కాకుండా ఈ కూలర్ పై SBI క్రెడిట్ కార్డ్ రూ. 800 రూపాయల అదనపు డిస్కౌంట్ ఆఫర్ కూడా అందించింది. ఈ ఆఫర్స్ తో ఈ కూలర్ కేవలం రూ. 7,199 రూపాయల ఆఫర్ ధరలో లభిస్తుంది.

ఈ కూలర్ మూడు వైపులా కూలింగ్ ప్యాడ్స్ కలిగి మంచి కూలింగ్ అందిస్తుంది. ఇందులో స్మార్ట్ వాటర్ మోనిటరింగ్, 3 స్పీడ్ కంట్రోల్ మరియు 93 లీటర్ల వాటర్ స్టోరేజ్ ట్యాంక్ వంటి మంచి ఫీచర్స్ కూడా ఉన్నాయి. అంతేకాదు, ఈ ఎయిర్ కూలర్ మంచి కూలింగ్ అందించే హాని కోంబ్ ప్యాడ్స్ తో వస్తుంది.

Also Read: Nothing Phone 4a Pro Sale: భారీ ఆఫర్స్ తో నథింగ్ కొత్త ఫోన్ సేల్ కి సిద్ధం అయ్యింది.!

Symphony 75L ఎయిర్ కూలర్

ఈ సింఫనీ ఎయిర్ కూలర్ ఈరోజు ఫ్లిప్ కార్ట్ అందించిన 33% డిస్కౌంట్ తో కేవలం రూ. 8,991 డిస్కౌంట్ ధరలో సేల్ అవుతోంది. ఈ కూలర్ పైన కూడా రూ. 900 రూపాయల SBI క్రెడిట్ కార్డ్ అదనపు బ్యాంక్ డిస్కౌంట్ అందిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ ఎయిర్ కూలర్ కేవలం రూ. 8,091 రూపాయల సేల్ ప్రైస్ లో లభిస్తుంది.

ఈ ఎయిర్ కూలర్ మంచి స్ట్రాంగ్ డిజైన్ కలిగి ఉంటుంది. ఇది 75 లీటర్స్ స్టోరేజ్ కలిగిన పెద్ద ట్యాంక్ ఉంటుంది. ఈ ఎయిర్ కూలర్ 3 వైపులా హాని కోంబ్ ప్యాడ్స్ మరియు వేగంగా తిరిగే ఫ్యాన్ తో చల్లని గాలి అందిస్తుందని సింఫనీ తెలిపింది. ఈ కూలర్ పెద్ద బెడ్ రూమ్ లేదా మీడియం సైజు హాల్ కి చక్కగా సరిపోతుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :