Poco C85 5G: చవక ధరలో భారీ ఫీచర్స్ విడుదలైన పోకో కొత్త ఫోన్.!

HIGHLIGHTS

పోకో ఈరోజు ఇండియాలో తన కొత్త ఫోన్ Poco C85 5G ను లాంచ్ చేసింది

ఈ స్మార్ట్ ఫోన్ ను చాలా చవక ధరలో భారీ ఫీచర్స్ తో లాంచ్ చేసింది

బిగ్ బ్యాటరీ తో పాటు చాలా అందమైన డ్యూయల్ టోన్ డిజైన్ తో లాంచ్ అయ్యింది

Poco C85 5G: చవక ధరలో భారీ ఫీచర్స్ విడుదలైన పోకో కొత్త ఫోన్.!

Poco C85 5G : పోకో ఈరోజు ఇండియాలో తన కొత్త ఫోన్ ను లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ ను చాలా చవక ధరలో భారీ ఫీచర్స్ తో లాంచ్ చేసింది. ఈ ఫోన్ మీడియాటెక్ 5జి చిప్ సెట్ మరియు బిగ్ బ్యాటరీ తో పాటు చాలా అందమైన డ్యూయల్ టోన్ డిజైన్ తో లాంచ్ అయ్యింది. ఈ స్మార్ట్ ఫోన్ ధర మరియు ఫీచర్స్ ఎలా ఉన్నాయో ఒక లుక్కేద్దామా.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Poco C85 5G : ప్రైస్

పోకో సి85 5జి స్మార్ట్ ఫోన్ ను కేవలం రూ. 11,999 ప్రారంభ ధరతో ఇండియాలో విడుదల చేసింది. ఇది ఈ ఫోన్ బేసిక్ 4 జీబీ వేరియంట్ ప్రైస్ మరియు ఈ ఫోన్ మిడ్ వేరియంట్ రూ. 12,999 ధరతో లాంచ్ అయ్యింది. ఇక ఈ ఫోన్ హై ఎండ్ 8 జీబీ వేరియంట్ రూ. 14,499 రూపాయల ధరతో లాంచ్ అయ్యింది. ఈ మూడు వేరియంట్స్ కూడా 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటాయి.

Poco C85 5G

ఈ ఫోన్ డిసెంబర్ 16వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి సేల్ కి అందుబాటులోకి వస్తుంది. పోకో ఈ ఫోన్ పై రూ. 1,000 HDFC, ICICI మరియు SBI క్రెడిట్ కార్డ్ డిస్కౌంట్ ఆఫర్ మరియు రూ. 1,000 రూపాయల అదనపు ఎక్స్ చేంజ్ బోనస్ ఆఫర్లు అందించింది. ఈ రెండు ఆఫర్స్ లో ఏదైనా ఒకటి మాత్రమే లభిస్తుంది. ఈ ఆఫర్స్ తో ఈ ఫోన్ కేవలం రూ. 10,999 రూపాయల ప్రారంభ ధరతో లభిస్తుంది.

Also Read: OnePlus Pad Go 2: బిగ్ డాల్బీ విజన్ డిస్ప్లే మరియు 5G సపోర్ట్ తో లాంచ్ అవుతోంది.!

Poco C85 5G : ఫీచర్స్

పోకో సి85 స్మార్ట్ ఫోన్ డ్యూయల్ టోన్ కలర్ లో చాలా సన్నని 7.9mm డిజైన్ తో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ 6.9 ఇంచ్ బిగ్ స్క్రీన్ తో తో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ స్క్రీన్ HD+ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్ మరియు 810 నిట్స్ HBM సపోర్ట్ తో వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ Dimensity 6300 చిప్ సెట్ తో నడుస్తుంది. ఇందులో 8 జీబీ ఫిజికల్ ర్యామ్ మరియు 8 జీబీ వర్చువల్ ర్యామ్ తో పాటు 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది.

ఈ స్మార్ట్ ఫోన్ లో వెనుక 50MP AI డ్యూయల్ రియర్ కెమెరా ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ 1080 రిజల్యూషన్ వీడియో సపోర్ట్ మరియు AI కెమెరా ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ పోకో ఫోన్ 8MP సెల్ఫీ కెమెరా కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ రెండు మేజర్ అప్డేట్స్ మరియు 4 సంవత్సరాల సాఫ్ట్ వేర్ అప్డేట్ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ పోకో స్మార్ట్ ఫోన్ 6000 mAh బిగ్ బ్యాటరీ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 33W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో చాలా వేగంగా ఛార్జ్ అవుతుంది. అంతేకాదు, ఈ ఫోన్ 10W ఫాస్ట్ రివర్స్ ఛార్జ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది.

ఇక ఈ ఫోన్ కలిగిన మరిన్ని ఫీచర్స్ విషయానికి వస్తే, ఈ స్మార్ట్ ఫోన్ IP64 రేటింగ్ తో డస్ట్ అండ్ స్ప్లాష్ రెసిస్టెంట్ గా ఉంటుంది. ఈ ఫోన్ మిస్టిక్ పర్పల్, స్ప్రింగ్ గ్రీన్ మరియు పవర్ బ్లాక్ మూడు రంగుల్లో లభిస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo