Poco C65 First Sale: భారీ ఆఫర్లతో పోకో బడ్జెట్ ఫోన్ ఫస్ట్ సేల్.!
భారీ ఆఫర్లతో పోకో బడ్జెట్ ఫోన్ ఫస్ట్ సేల్ రేపు జరగనున్నది
Poco C65 First Sale రేపు మధ్యాహ్నం 12 గంటలకు మొదలువుతుంది
రూ. 7,499 రూపాయల ప్రారంభ ధరకే అందుకునే అవకాశం
Poco C65 First Sale: భారీ ఆఫర్లతో పోకో బడ్జెట్ ఫోన్ ఫస్ట్ సేల్ రేపు జరగనున్నది. రెండు రోజుల క్రితం పోకో విడుదల చేసిన కొత్త స్మార్ట్ ఫోన్ పోకో సి65 యొక్క ఫస్ట్ సేల్ రేపు మధ్యాహ్నం 12 గంటలకు మొదలువుతుంది. బడ్జెట్ ధరలో ఆకర్షణీయమైన ఫీచర్లతో వచ్చిన ఈ స్మార్ట్ ఫోన్ ను భారీ ఆఫర్లతో సేల్ కి తీసుకు వస్తోంది పోకో కంపెనీ. కంపెనీ అందించిన ఆఫర్ల ద్వారా ఈ ఫోన్ ను కేవలం రూ. 7,499 రూపాయల ప్రారంభ ధరకే అందుకునే అవకాశం మీకు అందుతుంది.
SurveyPoco C65 First Sale
పోకో సి65 స్మార్ట్ ఫోన్ ను రూ. 8,499 ప్రారంభ రూపాయల ధరతో లాంచ్ చేసింది. ఇది 4GB + 128GB వేరియంట్ ధర మరియు ఈ ఫోన్ ర్యామ్ మరియు స్టోరేజ్ ను బట్టి ధర పెరుగుతుంది. ఈ ఫోన్ 4GB + 128GB వేరియంట్ ధర రూ. 9,499 గా ఉండగా, 8GB + 256GB వేరియంట్ ధర రూ. 10,999.
పోకో సి65 స్మార్ట్ ఫోన్ ను ICICI మరియు HDFC బ్యాంక్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ తో కోనేవారికి రూ. 1,000 డిస్కౌంట్ ఆఫర్ ను కంపెనీ ప్రకటించింది. ఈ ఆఫర్ ద్వారా ఈ ఫోన్ ను కేవలం రూ. 7,499 ఆఫర్ ధరకే అందుకోవచ్చు. ఈ ఫోన్ Flipkart ను నుండి సేల్ కి అందుబాటులోకి వస్తుంది.
Also Read : Redmi note 13 5G స్మార్ట్ ఫోన్ ని Super VIVID డిస్ప్లేతో అనౌన్స్ చేసిన షియోమి.!
పోకో సి65 స్పెక్స్ & ఫీచర్స్

పోకో అందించిన ఈ కొత్త ఫోన్ బడ్జెట్ ధరలో తగిన ఫీచర్లనే కలిగి వుంది. ఈ ఫోన్ లో 90Hz రిఫ్రెష్ రేట్ లాగిన 6.74 ఇంచ్ బిగ్ డిస్ప్లే మరియు MediaTek Helio G85 ప్రోసెసర్ తో వస్తుంది. మంచి పెర్ఫార్మెన్స్ కోసం ఈ ఫోన్ లో Turbo RAM ఫీచర్ ను కూడా అందించింది. ఈ ఫోన్ లో 50 MP ట్రిపుల్ కెమేరా, 8 MP సెల్ఫీ కెమేరా, 5000 mAh బిగ్ బ్యాటరీ మరియు 18W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో కలిగి వుంది.
8 వేల రూపాయల బడ్జెట్ కేటగిరిలో ఆల్రౌండ్ ఫీచర్స్ కలిగిన అందమైన డిజైన్ కలిగిన స్మార్ట్ ఫోన్ గా దీని గురించి చెప్పవచ్చు. ఈ ఫోన్ స్పెక్స్ ను బట్టి ఈ ఫోన్ ను అంచనా వేస్తున్నాము. అయితే, ఈ ఫోన్ రివ్యూ తరువాత ఖచ్చితమైన వివరాలను అందించ గలుగుతాము.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile