Poco X7 Pro Iron Man Edition ను కూడా లాంచ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసిన పోకో.!
అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ సిరీస్ లాంచ్ గురించి టీజింగ్
Poco X7 Pro Iron Man Edition లాంచ్ చేయనున్నట్లు ప్రకటించింది
పోకో ఎక్స్ 7 సిరీస్ నుంచి మూడు ఫోన్ల లాంచ్ కన్ఫర్మ్
అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ సిరీస్ లాంచ్ గురించి ఇప్పటికే టీజింగ్ చేస్తున్న పోకో ఇప్పుడు Poco X7 Pro Iron Man Edition ను కూడా ఈ సిరీస్ నుంచి లాంచ్ చేయనున్నట్లు ప్రకటించింది. పోకో ఎక్స్ 7 సిరీస్ నుంచి ముందుగా రెండు ఫోన్లు లాంచ్ గురించి మాత్రమే ప్రస్తావించిన కంపెనీ ఇప్పుడు మూడవ ఫోన్ వివరాలు కూడా బయటపెట్టింది. అంటే, పోకో ఎక్స్ 7 సిరీస్ నుంచి మూడు ఫోన్లు లాంచ్ చేస్తుందని కన్ఫర్మ్ చేసింది.
SurveyPoco X7 Pro Iron Man Edition
కొత్త సంవత్సరం కొత్త ఫోన్స్ లాంచ్ తో పోకో మార్కెట్ లో అడుగు పెడుతోంది. ఈ 2025 జనవరి 9 వ తేదీ సాయంత్రం 8 గంటలకు ఈ ఫోన్ లను ఇండియాతో సహా ప్రపంచ వ్యాప్తంగా లాంచ్ చేస్తోంది. పోకో ఎక్స్ 7 సిరీస్ నుంచి X7 5G, X7 Pro 5G మరియు X7 Pro Iron Man Edition మూడు ఫోన్ లను లాంచ్ చేస్తున్నట్లు కన్ఫర్మ్ చేసింది.

పోకో ఎక్స్ 7 ప్రో ఐరన్ మ్యాన్ స్మార్ట్ ఫోన్ లాంచ్ ను కన్ఫర్మ్ చేస్తూ కంపెనీ అందించిన టీజర్ ఇమేజ్ ద్వారా ఈ ఫోన్ యొక్క కీలకమైన ఫీచర్ కూడా బయటపడింది. కంపెనీ యొక్క అధికారిక X అకౌంట్ నుంచి అందించిన టీజర్ ద్వారా ఈ ఫోన్ ను క్వాడ్ కర్వ్డ్ స్క్రీన్ తో తీసుకు వస్తున్నట్లు అర్ధం అవుతుంది. అంతేలేదు, ఈ ఫోన్ చాలా సన్నని అంచులు కలిగి ఉంటుందని కూడా అర్ధం అవుతోంది.
Poco X7 Pro 5G : ఫీచర్స్
పోకో ఎక్స్ 7 ప్రో సిరీస్ స్మార్ట్ ఫోన్ యొక్క కీలకమైన ఫీచర్స్ ఒక్కొక్కటిగా కంపెనీ బయటపెడుతోంది. పోకో ఎక్స్ 7 ప్రో స్మార్ట్ ఫోన్ ను మీడియాటెక్ Dimensity 8400 Ultra చిప్ సెట్ తో తీసుకు వస్తున్నట్లు పోకో అనౌన్స్ చేసింది. ఈ ఫోన్ ను 90W హైపర్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన 6000 mAh బిగ్ బ్యాటరీతో అందిస్తున్నట్లు కూడా తెలిపింది
అంతేకాదు, ఈ ఫోన్ యొక్క డిజైన్ మరియు కెమెరా వివరాలు కూడా టీజర్ ఇమేజ్ ద్వారా వెల్లడయ్యాయి. ఈ ఫోన్ ఎల్లో & బ్లాక్ డ్యూయల్ టోన్ కలర్ లో ప్రీమియం లెథర్ డిజైన్ తో కనిపిస్తోంది. ఈ ఫోన్ లో వెనుక 50MP OIS ప్రధాన కెమెరా కలిగిన డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ వుంది.
Also Read: Xiaomi లేటెస్ట్ 4K Smart Tv పై బిగ్ డిస్కౌంట్ అందించిన అమెజాన్.!
ఈ అప్ కమింగ్ సిరీస్ మరిన్ని వివరాలు మరియు అప్డేట్స్ ను ఎప్పటికప్పుడు మీకు అందిస్తుంది మీ డిజిట్ తెలుగు.
Raja Pullagura
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile