OPPO Reno11 5G పైన రూ. 3,000 రూపాయల డిస్కౌంట్ ఆఫర్ అందుకోండి.!

HIGHLIGHTS

OPPO Reno11 5G పైన రూ. 3,000 రూపాయల డిస్కౌంట్ ఆఫర్

మార్కెట్ లో ఒప్పో సరికొత్తగా తీసుకు వచ్చిన కొత్త స్మార్ట్ ఫోన్

OPPO Reno11 5G ను మరింత చవక ధరకే అందుకోవచ్చు

OPPO Reno11 5G పైన రూ. 3,000 రూపాయల డిస్కౌంట్ ఆఫర్ అందుకోండి.!

OPPO Reno11 5G పైన రూ. 3,000 రూపాయల డిస్కౌంట్ ఆఫర్ అందుకునే అవకాశం అందించింది. ఇండియన్ మార్కెట్ లో ఒప్పో సరికొత్తగా తీసుకు వచ్చిన ఈ స్మార్ట్ ఫోన్ ప్రసుతం ఈ 3వేల రూపాయల బ్యాంక్ డిస్కోలు ఆఫర్ తో సేల్ అవుతోంది. ఈ ఫోన్ 3D Curved డిస్ప్లే మరియు 32MP టెలిఫోటో కెమేరా వంటి ఆకర్షణీయమైన ఫీచర్లతో ఇటీవల లాంచ్ అయిన ఈ ఫోన్ ను మరింత చవక ధరకే అందుకోవచ్చు.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

OPPO Reno11 5G Price

ఒప్పో రెనో11 5జి స్మార్ట్ ఫోన్ 8GB + 128GB వేరియంట్ రూ. 29,999 మరియు 8GB + 256GB వేరియంట్ రూ. 31,999 ధరతో లాంచ్ సేల్ అవుతున్నాయి. అయితే, ఈ ఒప్పో స్మార్ట్ ఫోన్ పైన రూ. 3000 రూపాయల బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్లను అందించింది. ఈ ఆఫర్ ను అవుట్ లెట్స్ మరియు ఒప్పోఆన్లైన్ స్టోర్ టాప్ పాటుగా Flipkart పైన కూడా అందుకోవచ్చు.

ఏమిటా బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్?

ఒప్పో ఈ ఫోన్ లాంచ్ ఆఫర్ లో భాగంగా ఈ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ను అందించింది. అదేమిటంటే, ఈ ఒప్పో కొత్త ఫోన్ ను Federal Bank, ICICI Bank, Bank of Baroda మరియు State Bank of India క్రెడిట్, డెబిట్ మరియు EMI ఆప్షన్ తో కొనుగోలు చేసే యూజర్లకు రూ. 3,000 డిస్కౌంట్ ను అందిస్తోంది. అంతేకాదు, OneCard మరియు IDFC First Bank యొక్క క్రెడిట్ మరియు క్రెడిట్ కార్డ్ EMI ఆప్షన్ తో ఈ ఫోన్ ను కొనే వారికి కూడా ఈ రూ. 3,000 డిస్కౌంట్ లభిస్తుంది.

Also Read : Amazon Mega Electronics Day Sale నుండి 32 ఇంచ్ స్మార్ట్ టీవీ పైన ఆఫర్లు అందుకోండి.!

ఒప్పో రెనో11 5జి స్పెక్స్ & ఫీచర్స్

ఇక ఒప్పో రెనో11 5జి ఫోన్ స్పెక్స్ మరియు ఫీచర్ల విషయానికి వస్తే, ఈ ఒప్పో కొత్త ఫోన్ 6.7 ఇంచ్ 120Hz 3D Curved AMOLED డిస్ప్లేని FHD+ రిజల్యూషన్ తో కలిగి వుంది. ఈ ఒప్పో ఫోన్ MediaTek Dimensity 7050 ఆక్టా కోర్ ప్రోసెసర్ జతగా 8GB RAM తో పని చేస్తుంది. ఈ ఫోన్ 128GB మరియు 256GB స్టోరేజ్ లలో ఉపలబ్ధమవుతుంది.

OPPO Reno11 5G display

ఈ ఒప్పో ఫోన్ లో మంచి కెమేరా సెటప్ నే ఒప్పో అందించింది. ఈ ఫోన్ లో వెనుక 50MP OIS + 32MP టెలిఫోటో + 8MP వైడ్ సెన్సార్లు కలిగిన ట్రిపుల్ రియర్ కెమేరా వుంది. అలాగే, OIS సపోర్ట్ కలిగిన 32M సెల్ఫీ కెమేరా కూడా ఈ ఫోన్ లో వుంది. ఈ ఫోన్ కెమేరాతో 4K వీడియోలను 30fps వద్ద రికార్డ్ చేయవచ్చు మరియు Pro, Portrait, Night, Hi-Res, Pano వంటి మరిన్ని కెమేరా ఫీలత్రాలను ఈ ఫోన్ కలిగి వుంది.

ఈ ఒప్పో లో 5000mAh బిగ్ బ్యాటరీ 67W SUPERVOOC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగి వుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo