ఒప్పో రెనో 6 సిరీస్ నుండి రెండు 5G ఫోన్స్ విడుదల

HIGHLIGHTS

Oppo తన 6సిరీస్ నుండి సరికొత్త స్మార్ట్ ఫోన్స్

చాలా వేగవంతమైన ఛార్జింగ్ సపోర్ట్ తో

ఒప్పో రెనో 6 5G మరియు రెనో 6 ప్రో 5G ఫోన్స్ లాంచ్

ఒప్పో రెనో 6 సిరీస్ నుండి రెండు 5G ఫోన్స్ విడుదల

Oppo తన 6సిరీస్ నుండి సరికొత్త స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసింది. ఈ ఒప్పో ఫోన్లు ఈ సిరీస్ నుండి వచ్చిన లేటెస్ట్ స్మార్ట్ ఫోన్లు మరియు చాలా వేగవంతమైన ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తాయి. వాస్తవానికి, ఈ సిరీస్ నుండి ఒప్పో రెనో 6 5G, రెనో 6 ప్రో 5G మరియు రెనో 6 ప్రో ప్లస్ 5G మూడు వేరియంట్ లను చైనాలో విడుదల చేస్తుండగా, ఇండియాలో మాత్రం కేవలం రెనో 6 ప్రో 5G మరియు రెనో 6 ప్రో 5G రెండు వేరియంట్ లను మాత్రమే విడుదల చెయ్యడం విశేషం. ఈ లేటెస్ట్ ఒప్పో ఫోన్ల ధర, స్పెక్స్ మరియు అన్ని వివరాలను తెలుసుకుందాం.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Oppo Reno 6 5G & Reno 6 Pro 5G: ప్రైస్

ఒప్పో రెనో 6 5G ఫోన్ 8 జిబి ర్యామ్ మరియు 128 జిబి స్టోరేజ్ ట్ వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ .29,990 మరియు జూలై 29 న ఫస్ట్ సేల్ జరుగుతుంది. ఒప్పో రెనో 6 ప్రో స్మార్ట్ ఫోన్ 12 జీబీ ర్యామ్ మరియు 256 జీబీ స్టోరేజ్ తో వస్తుంది  మరియు దీని ధర రూ .39,990. ఈ ఫోన్ ఫస్ట్ సేల్ జూలై 20 నుంచి ప్రారంభమవుతుంది. రెండు మోడల్స్ కూడా అరోరా మరియు స్టెల్లార్ బ్లాక్ కలర్స్ లో వస్తాయి. ఫ్లిప్‌కార్ట్ ఆన్లైన్ ప్లాట్ఫారమ్ కాకుండా, ఒప్పో రెనో 6 సిరీస్‌ను రిలయన్స్ డిజిటల్, విజయ్ సేల్స్, క్రోమా, ఒప్పో ఆన్‌లైన్ స్టోర్స్ మరియు రిటైలర్ల నుండి కూడా కొనుగోలు చేయవచ్చు.

Oppo Reno 6 5G: స్పెక్స్

Oppo Reno 6 5G కలర్ OS 11.3 స్కిన్ పైన Android 11 తో వస్తుంది. ఈ ఫోన్ 6.43-అంగుళాల FHD + ఫ్లాట్ AMOLED డిస్ప్లేని కలిగివుంటుంది. ఇది 1080 x 2400 పిక్సెల్స్ రిజల్యూషన్‌ అందిస్తుంది. అంతేకాదు, ఈ డిస్ప్లే 90Hz రిఫ్రెష్ రేట్ మరియు 180Hz టచ్ శాంపిల్ రేటుకు కూడా మద్దతు ఇస్తుంది. ఒప్పో రెనో 6 లేటెస్ట్ మీడియాటెక్ డైమెన్సిటీ 900 SoC శక్తిని కలిగి ఉంది మరియు ఇది 8GB RAM మరియు 128GB స్టోరేజ్ తో జత చేయబడింది.

కెమెరా విభాగానికి వస్తే,  ఈ ఫోన్‌లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. దీనిలో 64 ఎంపి ప్రైమరీ కెమెరా, 8 ఎంపి సెకండరీ కెమెరా మరియు 2 ఎంపి మాక్రో కెమెరా ఉన్నాయి. ఒప్పో రెనో 6 5G స్మార్ట్ ఫోన్ 32 ఎంపి సెల్ఫీ కెమెరాను కూడా కలిగివుంటుంది. కనెక్టివిటీ పరంగా, ఒప్పో రెనో 6 కి 5 జి, వై-ఫై 6, బ్లూటూత్ వి 5.2, జిపిఎస్ మరియు USB  టైప్-సి పోర్ట్ ఇవ్వబడ్డాయి. ఈ స్మార్ట్ ఫోన్ 4300mAh బ్యాటరీని 65W సూపర్‌వూక్ 2.0 ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్ తో కలిగి వుంది.

Oppo Reno 6 Pro 5G: స్పెక్స్

Oppo Reno 6 Pro 5G కూడా కలర్ ఓఎస్ 11.3 ఆధారంగా ఆండ్రాయిడ్ 11 తో వచ్చింది. అయితే, ఈ ఫోన్ 1080×2,400 పిక్సెల్ రిజల్యూషన్‌ అందించగల 6.55-అంగుళాల FHD + కర్వ్డ్ AMOLED డిస్ప్లేని కలిగివుంది మరియు దీని రిఫ్రెష్ రేటు 90 Hz మరియు టచ్ శాంప్లింగ్ రేటు 180 Hz. ఈ స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 1200 ప్రోసిజర్ తో అమర్చబడి 12GB RAM మరియు 256GB స్టోరేజ్ తో వస్తుంది.

కెమెరా విషయానికొస్తే, ఒప్పో రెనో 6 ప్రో 5G క్వాడ్ కెమెరాతో ఉంటుంది. ఈ సెటప్ లో 64 ఎంపి మైన్ కెమెరా, 8 ఎంపి సెకండరీ కెమెరా మరియు 2 ఎంపి మాక్రో కెమెరా, మరియు నాల్గవ 2 ఎంపి మోనో కెమెరా కలర్ టెంపరేచర్ సెన్సార్ ఉన్నాయి. ఈ ఫోన్ ముందు 32 ఎంపి సెల్ఫీ కెమెరా అందుబాటులో ఉంది. కనెక్టివిటీ కోసం, ఒప్పో రెనో 6 5 జి వంటి ఫీచర్లు ఈ ఫోన్‌లో కూడా ఇవ్వబడ్డాయి మరియు రెనో 6 ప్రో 4500 ఎమ్ఏహెచ్ బ్యాటరీని 65W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ తో కలిగి వుంది.

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile