ఒప్పో రెనో 2 ఇండియాలో విడుదలయ్యింది : ధర, ప్రత్యేకతలు మరియు పూర్తి విశేషాలు

బై Raja Pullagura | పబ్లిష్ చేయబడింది 28 Aug 2019
HIGHLIGHTS
 • ఈ ఫోన్‌లో 2x ఆప్టికల్ జూమ్, 5x హైబ్రిడ్ జూమ్, 20x డిజిటల్ జూమ్ వంటి కెమేరా ప్రత్యేకతలు ఉన్నాయి.

ఒప్పో రెనో 2 ఇండియాలో విడుదలయ్యింది : ధర, ప్రత్యేకతలు మరియు పూర్తి విశేషాలు
ఒప్పో రెనో 2 ఇండియాలో విడుదలయ్యింది : ధర, ప్రత్యేకతలు మరియు పూర్తి విశేషాలు

ఎన్నో టీజర్లు మరియు పుకార్ల తరువాత, ఒప్పో ఎట్టకేలకు తన ఒప్పో రెనో 2 సిరీస్‌ను ఈ రోజు భారతదేశంలో విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లు మొదట భారతదేశంలో లాంచ్ అయ్యాయి, వచ్చే నెలలో ఇది చైనాలో కూడా లాంచ్ కానుంది. చిప్‌సెట్‌తో సహా ఈ ఫోన్ల యొక్క కొన్ని కీలక ఫీచర్లను కంపెనీ ఇప్పటికే ధృవీకరించింది. ఒప్పో ఈ రోజు మూడు ఫోన్‌లను లాంచ్ చేసింది, అవి ఒప్పో రెనో 2, ఒప్పో రెనో 2 జెడ్ మరియు ఒప్పో రెనో 2 ఎఫ్. వీటిలో ఒప్పో రెనో 2 ప్రీమియం లుక్స్ మరియు బెస్ట్ ఫీచర్లతో వస్తుంది. 

ఒప్పో రెనో 2 ఫీచర్లు

ఒప్పో రెనో 2 గొరిల్లా గ్లాస్ 6 యొక్క రక్షణ గల ఒక 6.55-అంగుళాల AMOLED పనోరమిక్ చిన్ననోచ్ డిస్ప్లేని కలిగి ఉంది. ఇది 2400x1800 పిక్సెల్ రిజల్యూషన్‌తో 20: 9 యాస్పెక్ రేషియోతో మరియు అత్యధికంగా 93.1 శాతం స్క్రీన్‌ను కలిగి ఉంది. ఇది 8 జీబీ ర్యామ్, 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌తో జత చేసిన స్నాప్‌డ్రాగన్ 730 జీ చిప్‌సెట్ ద్వారా రెనో 2 రానున్నట్లు ఒప్పో ఇప్పటికే ధృవీకరించింది. ఈ స్మార్ట్ఫోన్ VOOC ఫ్లాష్ ఛార్జ్ 3.0 మద్దతు కలిగిన ఒక 4,000mAh బ్యాటరీతో ఉంటుంది.

 యాంటీ-చీట్ ఎక్స్‌టెన్షన్స్, ఆప్టిమైజ్ చేసిన వై-ఫై, గేమ్ బూస్ట్ 3.0, గేమ్ అసిస్టెంట్, HDR 10 గేమింగ్ సపోర్ట్ మరియు మునుపటితో పోల్చితే 25 శాతం వేగంగా గ్రాఫిక్ రెండరింగ్ వంటి గేమింగ్-ఫోకస్ ఫీచర్లు ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఉన్నాయి. ఫ్రేమ్ బూస్ట్ 2.0 అధిక శక్తితో వినియోగించడం మరియు ఫోన్‌ను వేడి కాకుండా  నివారించడం కోసం పనిచేస్తుంది. టచ్ బూస్ట్ 2.0 టచ్ ఈవెంట్‌లను అంచనా వేస్తుంది మరియు తదనుగుణంగా ప్రతిస్పందన(రెస్పాన్స్) సమయాన్ని వేగవంతం చేస్తుంది.

ఒప్పో రెనో 2 లో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 రక్షణతో 3 డి కర్వ్డ్ గ్లాస్ బ్యాక్ ప్యానెల్ ఉంది. ఇది ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ను కలిగి ఉంది, దీనిని ఒప్పో "హిడెన్ ఫింగర్ ప్రింట్ 3.0" అని పిలుస్తోంది. అలాగే, ఒప్పో రెనో 2 షార్క్-ఫిన్ రైజింగ్ మాడ్యూల్‌ తో ముందు కెమెరాని కలిగి ఉంది. ఇది 0.8 సెకన్లలోనే స్పందిస్తుందని కంపెనీ తెలిపింది.

ఆప్టిక్స్ పరంగా, ఒప్పో రెనో 2 ఒక క్వాడ్ రియర్ కెమెరా సెటప్ అయినటువంటి: 48MP ప్రాధమిక కెమెరా, 13MP టెలిఫోటో లెన్స్, 8MP వైడ్ యాంగిల్ లెన్స్ మరియు 2MP మోనో లెన్స్ ను కలిగివుంటుంది. ఈ ఫోన్‌లో 2x ఆప్టికల్ జూమ్, 5x హైబ్రిడ్ జూమ్, 20x డిజిటల్ జూమ్ వంటి కెమేరా ప్రత్యేకతలు ఉన్నాయి. ఇది వీడియో 3 లో కూడా పనిచేస్తుంది. అల్ట్రా డార్క్ మోడ్, అల్ట్రా మాక్రో మోడ్ మరియు బోకె మోడ్ వంటి విభిన్న మోడ్‌లను మెరుగుపరచడానికి ఇది ప్రత్యేకమైన న్యూరల్ ప్రాసెసింగ్ యూనిట్ (NPU ) ను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో వీడియో స్టెబిలైజేషన్ కోసం OIS మరియు EIS, 60fps ఫ్రేమ్ రేట్ వరకు అల్ట్రా-స్థిరమైన వీడియో మోడ్ మరియు 116-డిగ్రీల వైడ్ యాంగిల్ వీడియోలను రికార్డ్ చేయడానికి కూడా మద్దతు ఇస్తుంది.

Price: 

ఈ స్మార్ట్‌ఫోన్ ఓషన్ బ్లూ మరియు  బ్లాక్ రంగులలో లభిస్తుంది. భారతదేశంలో ఒప్పో రెనో 2 రూ. 36.990 ధరతో విడుదలయ్యింది.

ఒప్పో Reno 2 256GB Key Specs, Price and Launch Date

Price:
Release Date: 28 Aug 2019
Variant: 128GB , 256GB
Market Status: Launched

Key Specs

 • Screen Size Screen Size
  6.55" (1080 x 2400)
 • Camera Camera
  48 + 13 + 8 + 2 | 16 MP
 • Memory Memory
  256GB/8 GB
 • Battery Battery
  4000 mAh
logo
Raja Pullagura

email

Tags:
oppo reno 2
Advertisements

ట్రెండింగ్ ఆర్టికల్స్

Advertisements

LATEST ARTICLES మొత్తం చూపించు

Advertisements

హాట్ డీల్స్ మొత్తం చూపించు

Redmi 9 Prime (Matte Black, 4GB RAM, 128GB Storage) - Full HD+ Display & AI Quad Camera
Redmi 9 Prime (Matte Black, 4GB RAM, 128GB Storage) - Full HD+ Display & AI Quad Camera
₹ 10999 | $hotDeals->merchant_name
Redmi 9A (Sea Blue 3GB RAM 32GB Storage)| 2GHz Octa-core Helio G25 Processor | 5000 mAh Battery
Redmi 9A (Sea Blue 3GB RAM 32GB Storage)| 2GHz Octa-core Helio G25 Processor | 5000 mAh Battery
₹ 7499 | $hotDeals->merchant_name
Samsung Galaxy M31 (Ocean Blue, 8GB RAM, 128GB Storage)
Samsung Galaxy M31 (Ocean Blue, 8GB RAM, 128GB Storage)
₹ 16999 | $hotDeals->merchant_name
Redmi Note 9 Pro Max (Interstellar Black, 6GB RAM, 64GB Storage) - 64MP Quad Camera & Alexa Hands-Free Capable
Redmi Note 9 Pro Max (Interstellar Black, 6GB RAM, 64GB Storage) - 64MP Quad Camera & Alexa Hands-Free Capable
₹ 15499 | $hotDeals->merchant_name
DMCA.com Protection Status