Oppo Reno 16 Series: కళ్ళు చెదిరే కొత్త హోలో వెర్స్ 3D టెక్ డిజైన్ తో లాంచ్ అవుతుంది.!

HIGHLIGHTS

ఒప్పో అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ సిరీస్ లాంచ్ కోసం కసరత్తు మొదలు పెట్టింది

హోలో వెర్స్ 3D టెక్ డిజైన్ తో లాంచ్ చేస్తున్నట్లు ఒప్పో ఈ ఫోన్ డిజైన్ గురించి గొప్పగా చెబుతోంది

ఈ ఫోన్ ఇండస్ట్రీ లీడింగ్ IP69K వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ ఫీచర్ తో లాంచ్ అవుతుంది

Oppo Reno 16 Series: కళ్ళు చెదిరే కొత్త హోలో వెర్స్ 3D టెక్ డిజైన్ తో లాంచ్ అవుతుంది.!

Oppo Reno 16 Series: ఒప్పో అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ సిరీస్ లాంచ్ కోసం కసరత్తు మొదలు పెట్టింది. ఈ అప్ కమింగ్ సిరీస్ ఫోన్ లను కళ్ళు చెదిరే కొత్త హోలో వెర్స్ 3D టెక్ డిజైన్ తో లాంచ్ చేస్తున్నట్లు ఒప్పో ఈ ఫోన్ డిజైన్ గురించి గొప్పగా చెబుతోంది. రెనో సిరీస్ అంటేనే ప్రీమియం స్మార్ట్ ఫోన్ సిరీస్ మరియు మార్కెట్ ఫస్ట్ ప్రీమియం ఫీచర్స్ తో వస్తాయని ప్రతీతి. ఈ అప్ కమింగ్ సిరీస్ కూడా ఇదే ట్రెండ్ ఫాలో అవుతోంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Oppo Reno 16 Series: లాంచ్ డేట్ ఏమిటి?

ఒప్పో రెనో 16 సిరీస్ స్మార్ట్ ఫోన్ ఇండియా లాంచ్ డేట్ ను ఒప్పో ఇంకా ప్రకటించలేదు. ఈ స్మార్ట్ ఫోన్ సిరీస్ ని త్వరలో లాంచ్ చేయబోతున్నట్లు ‘కమింగ్ సూన్’ ట్యాగ్ తో టీజింగ్ మాత్రం స్టార్ట్ చేసింది. ఈ సిరీస్ నుండి రెండు స్మార్ట్ ఫోన్లు లాంచ్ అయ్యే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ కోసం అమెజాన్ మరియు ఫ్లిప్ కార్ట్ నుంచి కూడా టీజర్ లను విడుదల చేసింది.

Oppo Reno 16 Series: ఫీచర్స్

ఒప్పో రెనో 16 సిరీస్ స్మార్ట్ ఫోన్ లాంచ్ కోసం అందించిన టీజర్ లో ఈ ఫోన్ వివరాలు వెల్లడించింది. ఇందులో ఈ ఫోన్ డిజైన్, కెమెరా మరియు IP రేటింగ్ వివరాలు వెల్లడించింది. ఈ ఫోన్ వెనుక భాగంలో సరికొత్త హోలో వెర్స్ 3D టెక్నాలజీ ఉపయోగించినట్లు ఒప్పో తెలిపింది. అంతేకాదు, ఈ ఫీచర్ తో ఇండియాలో విడుదలయ్యే మొదటి ఫోన్ కూడా ఇదే అవుతుందని ఒప్పో తెలిపింది.

Oppo Reno 16 Series

ఈ కొత్త డిజైన్ ను 3D పాప్ ప్లానెట్ డిజైన్ గా పిలుస్తోంది. ఈ కొత్త డిజన్ తో ఫోన్ బ్యాక్ ఫ్యాన్ నుంచి బయటకు వచ్చిన స్పష్టంగా కనిపించే సర్కిల్ కలిగి ఉంటుంది. ఇది డిజైన్ పరంగా ఇతర ఫోన్ లతో వేరు చేసేలా చేస్తుంది. ఈ ఫోన్ కాంపాక్ట్ డిజైన్ తో ఉంటుంది. అంతేకాదు, సైడ్ లో ప్రత్యేకమైన AI బటన్ మరియు మంచి స్లీక్ డిజైన్ తొ ఉంటుంది.

Also Read: Soundbar Deals: అమెజాన్ మరియు ఫ్లిప్ కార్ట్ సేల్ ఆఫర్ చేసే బిగ్ డీల్స్ ఇవే గురు.!

కెమెరా పరంగా, ఈ ఫోన్ లో వెనుక ట్రిపుల్ రియర్ కెమెరా ఉంటుంది. ఇది AI కెమెరా సిస్టం మరియు లేటెస్ట్ ఏఐ కెమెరా ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది. అంతేకాదు, ఈ ఫోన్ IP రేటింగ్ ను కూడా ఒప్పో వెల్లడించింది. ఈ ఫోన్ ఇండస్ట్రీ లీడింగ్ IP69K వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ ఫీచర్ తో లాంచ్ అవుతుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile