Oppo Reno 15 5G sale started today with big deals
ఒప్పో సరికొత్తగా విడుదల చేసిన Oppo Reno 15 5G స్మార్ట్ ఫోన్ సేల్ ఈరోజు నుంచి ప్రారంభం అయ్యింది. ఈ ఫోన్ పై 10 వేల వరకు భారీ డిస్కౌంట్ ఆఫర్స్ కూడా ఒప్పో అందించింది. ఈ ఫోన్ ప్రస్తుతం కొనుగోలు చేసే యూజర్లు ఫోన్ పై ఈ 10 వేల రూపాయల డిస్కౌంట్ ఆఫర్స్ అందుకోవచ్చు. అంటే, ఈ ఫోన్ ను ఫస్ట్ సేల్ నుంచి కేవలం 35 వేల రూపాయల ప్రారంభ ధరలో అందుకోవచ్చు.
ఒప్పో ఈ ఫోన్ ను మూడు వేరియంట్స్ లో లాంచ్ చేసింది. ఈ మూడు వేరియంట్ ప్రైస్ వివరాలు ఇప్పుడు చూద్దాం.
ఒప్పో రెనో 15 (8 జీబీ + 256 జీబీ) ప్రైస్ : రూ. 45,999
ఒప్పో రెనో 15 (12 జీబీ + 256 జీబీ) ప్రైస్ : రూ. 48,999
ఒప్పో రెనో 15 (12 జీబీ + 512 జీబీ) ప్రైస్ : రూ. 53,999
ఈ ఫోన్ గ్లేసియర్ వైట్ మరియు ట్విలైట్ బ్లూ రెండు రంగుల్లో లభిస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ పై కంపెనీ అందించిన ఆఫర్స్ ఇప్పుడు చూద్దాం.
ఈ స్మార్ట్ ఫోన్ భారీ లాంచ్ ఆఫర్స్ ఒప్పో అందించింది. ఈ ఫోన్ పై అమెజాన్ ఇండియా బిగ్ డీల్స్ అందించింది. ఈ ఫోన్ పై రూ. 6,000 రూపాయల భారీ ఎక్స్ చేంజ్ బోనస్ ఆఫర్ అందించింది.
ఇది కాకుండా ఈ ఫోన్ పై 10% భారీ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ కూడా అందించింది. ఈ ఫోన్ ను SBI మరియు HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో తీసుకునే వారికి ఈ డిస్కౌంట్ అందిస్తుంది. అంటే, మొత్తంగా ఈ ఫోన్ బేసిక్ వేరియంట్ పై రూ. 10,599 రూపాయల డిస్కౌంట్ మీకు అందిస్తుంది. ఈ అఫర్ తో మీకు ఈ ఫోన్ స్టార్టింగ్ వేరియంట్ కేవలం రూ. 35,000 రూపాయల ఆఫర్ ధరలో లభిస్తుంది. Buy From Here
అయితే, ఈ ఫోన్ ఫ్లిప్ కార్ట్ నుంచి కూడా సేల్ కి అందుబాటులోకి వచ్చింది. కానీ, ఆఫర్స్ మాత్రం వేరుగా ఉన్నాయి.
Also Read: iQOO Z10R 5G పై అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ బిగ్ డీల్ రివీల్ చేసింది.!
Oppo Reno 15 5G ప్రీమియం థీమ్‌తో వచ్చిన లేటెస్ట్ ఒప్పో 5G స్మార్ట్ ఫోన్. ఇది గొప్ప డిజైన్, బెస్ట్ కెమెరా మరియు మంచి సామర్ధ్యం కలిగిన బ్యాటరీ ప్యాకేజ్‌గా వస్తుంది. ఈ ఒప్పో కొత్త ఫోన్ Android 16 జతగా Color OS 16 తో పనిచేస్తుంది. ఈ ఫోన్ లో 6.59 ఇంచ్ AMOLED స్క్రీన్ కలిగి ఉంటుంది.ఈ ఫోన్ 120 Hz రిఫ్రెష్ రేట్ మరియు FHD+ రిజల్యూషన్ తో మంచి యూజర్ ఎక్స్ పీరియన్సు ఇస్తుంది. ఈ ఫోన్ స్క్రీన్ Corning Gorilla Glass 7i ప్రొటెక్షన్ తో స్ట్రాంగ్ గా ఉంటుంది మరియు HDR10+ సపోర్ట్ తో గొప్ప క్లారిటీ విజువల్స్ కూడా అందిస్తుంది.
ఈ ఒప్పో లేటెస్ట్ స్మార్ట్ ఫో క్వాల్కమ్ Snapdragon 7 Gen 4 (4 nm) ప్రాసెసర్ తో వచ్చింది. ఇది శక్తివంతమైన పెర్ఫార్మెన్స్ అందిస్తుంది మరియు గేమ్స్, మల్టీ యాప్‌లు, సోషల్ మీడియా, వీడియో స్ట్రీమింగ్ ఏదైనా చాలా స్మూత్‌గా హ్యాండిల్ చేసే శక్తి కలిగి వుంది. ఈ ఫోన్ లో 12 జీబీ LPDDR5X మరియు 256 GB / 512 GB (UFS 3.1) స్టోరేజ్ కూడా ఉంటుంది. 50MP మెయిన్ కెమెరా, 50MP (3.5x) టెలిఫోటో కెమెరా మరియు 8MP అ ల్ట్రా-వైడ్ కెమెరా తో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఈ ఫోన్ లో ఉంది. అంతేకాదు, ఈ ఫోన్ లో 50MP సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఈ ఫోన్ 60FPS వద్ద 4K వీడియో రికార్డ్ సపోర్ట్ మరియు గొప్ప కెమెరా ఫీచర్స్ కలిగి ఉంటుంది.
ఈ ఫోన్ 6500 mAh పెద్ద బ్యాటరీ కలిగి ఉంటుంది మరియు 80W SUPER VOOC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ స్టీరియో స్పీకర్లు మరియు IP69 రేట్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ ఫీచర్ కలిగి ఉంటుంది.