Oppo F33 Series 5G: కొత్త లుక్ తో అప్ కమింగ్ సిరీస్ లాంచ్ చేస్తున్న ఒప్పో.!
ప్రముఖ చైనీస్ మొబైల్ తయారీ కంపెనీ ఒప్పో తన అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ ప్రకటించింది
ఒప్పో ఎఫ్ 33 సిరీస్ ఇండియాలో లాంచ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసింది
ఇప్పటి వరకు ఒప్పో ఫోన్స్ లో చూడని కొత్త లుక్ తో లాంచ్ చేస్తున్నట్లు టీజింగ్ చేస్తోంది
Oppo F33 Series 5G: ఇండియన్ మార్కెట్లో ఆచితూచి స్మార్ట్ ఫోన్ లను విడుదల చేస్తున్న ప్రముఖ చైనీస్ మొబైల్ తయారీ కంపెనీ ఒప్పో, తన అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ ప్రకటించింది. ఒప్పో ఎఫ్ 33 సిరీస్ ఇండియాలో లాంచ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసింది. ఈ అప్ సిరీస్ నుంచి అందించే స్మార్ట్ ఫోన్ లను ఇప్పటి వరకు ఒప్పో ఫోన్స్ లో చూడని కొత్త లుక్ తో లాంచ్ చేస్తున్నట్లు టీజింగ్ చేస్తోంది.
SurveyOppo F33 Series 5G: లాంచ్ డేట్
ఒప్పో ఎఫ్ 33 సిరీస్ ను ఏప్రిల్ 15వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ చేస్తున్నట్లు ఒప్పో డేట్ రిలీజ్ చేసింది. ఈ ఫోన్ ను ఫ్లిప్ కార్ట్ ద్వారా టీజింగ్ చేస్తోంది మరియు ఈ ఫోన్ కోసం అందించిన ప్రత్యేకమైన టీజర్ పేజీ నుంచి ఈ ఫోన్ టీజర్ వివరాలు అందించింది.
Oppo F33 Series 5G: ఫీచర్స్
ఒప్పో ఎఫ్ 33 సిరీస్ 5జి స్మార్ట్ ఫోన్ కెమెరా గురించి కంపెనీ గొప్పగా చెబుతోంది. బిగ్ మూమెంట్స్ పట్టుకోవడానికి మరింత వైడ్ కెమెరా అని ఈ ఫోన్ చేసింది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లో రియర్ కెమెరా ఉంది. ఈ ఫోన్ ఇమేజ్ ద్వారా ఈ అప్ కమింగ్ ఫోన్ కాంపాక్ట్ డిజైన్ తో ఉన్నట్లు కనిపిస్తోంది.

ఈ ఫోన్ డిజైన్ విషయానికి వస్తే, ఈ సిరీస్ ఫోన్లు స్లీక్ అండ్ స్టన్నింగ్ డిజైన్ తో ఆకట్టుకునేలా ఉన్నట్లు టీజర్ ఇమేజ్ చెబుతోంది. ఈ ఫోన్ లో వెనుక జంగల్ అండ్ వాటర్ ఫాల్ లాంటి బ్యాక్ కవర్ డిజైన్ ఉన్నట్లు టీజర్ ఇమేజ్ లో క్లియర్ గా కనిపిస్తోంది. ఇదే కాదు ఫోన్ లో ఉన్న కెమెరా బంప్ చుట్టూ కలర్ ఫుల్ LED లైట్ ఉన్నట్లు కూడా కనిపిస్తోంది.
Also Read: Xiaomi S Mini LED: క్వాంటం MagiQ డిస్ప్లే టెక్నాలజీతో కొత్త టీవీలు లాంచ్ చేస్తోంది.!
లీక్డ్ ఫీచర్స్ :
ఒప్పో ఈ అప్ కమింగ్ సిరీస్ నుంచి ఎఫ్ 33 మరియు ఎఫ్ 33 ప్రో రెండు ఫోన్లు లాంచ్ చేస్తుందని రూమర్లు ఉన్నాయి. ఈ ఫోన్లు కూడా మీడియాటెక్ Dimensity 6360 Max చిప్ సెట్ లాంచ్ లాంచ్ ‘కావచ్చని కూడా రూమర్లు చెబుతున్నాయి. వీటిలో 7000 mAh బిగ్ బ్యాటరీ మరియు 80W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కూడా ఉండే అవకాశం ఉంది.
ఇది కాకుండా, ఈ ఫోన్ లో వెనుక 50MP డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ మరియు ముందు 50MP అల్ట్రా వైడ్ సెల్ఫీ కెమెరా కూడా ఉంటుందని కొన్ని లీక్స్ వెల్లడించాయి. మొత్తంగా, ఈ ఫోన్ ను బెస్ట్ ఇన్ క్లాస్ సెల్ఫీ కెమెరా ఫోన్ లాంచ్ చేసే అవకాశం ఉండొచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile