ఒప్పో K3 రూ.16,999 ధరలో మంచి ఫీచర్లతో వచ్చింది : రేపే మొదటి సేల్

HIGHLIGHTS

ఈ ఫోన్, ఒక క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 710 ఆక్టా కోర్ ప్రాసెసర్ జతగా గరిష్టంగా 6GB / 8GB ర్యామ్ శక్తితో పనిచేస్తుంది.

ఈ OPPO K3 ఈ స్మార్ట్ ఫోన్ ప్రస్తుతం ట్రెండీగా నడుస్తున్న అన్ని హంగులను కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్, పాప్ అప్ సెల్ఫీ కెమేరా, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు మంచి ప్రాసెసర్ ఒకటేమిటి పూర్తిగా అన్ని ప్రత్యేకతలతో నిండుగా కనిపిస్తోంది. ఈ ఫోన్, ఒక క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 710 ఆక్టా కోర్ ప్రాసెసర్ కి జతగా గరిష్టంగా 8GB ర్యామ్ శక్తితో పనిచేస్తుంది. అలాగే, ఈ స్మార్ట్ ఫోన్ యొక్క మొదటి సేల్ రేపు మధ్యాహ్నం 12 గంటలకి అమేజాన్ ఇండియా నుండి మొదలవుతుంది.

OPPO K3 ధరలు

1. OPPO K3 (6GB + 64GB ) ధర : Rs.16,990   

2. OPPO K3 (8GB + 128GB ) ధర : Rs.19,990

AXIS బ్యాంక్ యొక్క క్రెడిట్ లేదా డెబిట్ కార్డుతో ఈ ఫాంను అమెజాన్ ఇండియా ద్వారా కొనుగోలు చేసేవారికి 1,000 రుపాయల తక్షణ డిస్కౌంట్ కూడా లభిస్తుంది. 

OPPO K3 ప్రత్యేకతలు

ఈ ఫోన్ కళ్లకు ఎటువంటి హాని చెయ్యని Eye ప్రొటక్షన్ గల ఒక 6.5 అంగుళాల సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. ఈ డిస్ప్లే ఒక కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 రక్షణతో వస్తుంది. ఈ ఫోన్, ఒక క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 710 ఆక్టా కోర్ ప్రాసెసర్ జతగా గరిష్టంగా 6GB / 8GB ర్యామ్ శక్తితో పనిచేస్తుంది. అలాగే, ఇది 64GB / 128GB వంటి స్టోరేజి ఎంపికతో ఎంచకోవచ్చు. ఇందులో ఒక 3765 mAh బ్యాటరీని అందించారు. అయితే, ఇందులో అందించిన VOOC ఫ్లాష్ ఛార్జ్ 3.0 టెక్నాలజీ ద్వారా ఇది 25% తక్కువ సమయంలోనే పూర్తిగా ఛార్జ్ చేయగలదు.

ఇక కెమేరాల విభాగానికి వస్తే, వెనుక ఒక 16MP ప్రధానమైన గొప్ప కెమెరాతో పాటుగా 2MP డెప్త్ గల డ్యూయల్ కెమేరాని అందించారు. అంతేకాదు, ఈ ఫోన్ యొక్క డిస్ప్లేలో ఒక ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అందించినట్లు కూడా స్పష్టం చేసింది. ఇక ఈ ఫోనుతో భారీ గేమ్స్ ఆడుకోవటానికి వీలుగా Game Boost 2.0 ని కూడా అందించింది. అలాగే, చక్కని సౌండ్ కోసం Dolby Atmos ని ఈ ఫోనులో ఇచ్చింది. సెల్ఫీల కోసం ఇందులో ఒక  16MP పాప్ అప్ సెల్ఫీ కెమెరాని కూడా అందించింది.      

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :