Oppo K13 5G ఫోన్ 7000mAh భారీ బ్యాటరీ మరియు స్టన్నింగ్ డిజైన్ తో వస్తోంది.!
నిన్నటి వరకు Oppo K13 5G స్మార్ట్ ఫోన్ త్వరలో లాంచ్ చేయనున్నట్లు టీజింగ్ చేసిన ఒప్పో
ఈ అప్ కమింగ్ ఫోన్ లాంచ్ డేట్ తో పాటు చాలా కీలకమైన ఫీచర్స్ కూడా విడుదల చేసింది
శక్తివంతమైన 7000 mAh గ్రాఫైట్ బ్యాటరీతో మరియు స్టన్నింగ్ డిజైన్ తో లాంచ్ చేస్తున్నట్లు అనౌన్స్
నిన్నటి వరకు Oppo K13 5G స్మార్ట్ ఫోన్ త్వరలో లాంచ్ చేయనున్నట్లు టీజింగ్ చేసిన ఒప్పో, ఈరోజు ఈ అప్ కమింగ్ ఫోన్ లాంచ్ డేట్ తో పాటు చాలా కీలకమైన ఫీచర్స్ కూడా విడుదల చేసింది. ఈ ఫోన్ అత్యంత శక్తివంతమైన 7000 mAh గ్రాఫైట్ బ్యాటరీతో మరియు స్టన్నింగ్ డిజైన్ తో లాంచ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసింది. ఈ అప్ కమింగ్ ఒప్పో స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ మరియు కంప్లీట్ ఫిచర్లు ఎలా ఉన్నాయో ఒక లుక్కేద్దాం పదండి.
Oppo K13 5G : లాంచ్ డేట్
ఒప్పో ఈ ఫోన్ ఏప్రిల్ 21వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసింది. ఈ ఫోన్ కోసం Flipkart సేల్ పార్ట్నర్ గా వ్యవహరిస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ కోసం ఫ్లిప్ కార్ట్ ప్రత్యేకమైన మైక్రో సైట్ పేజి కూడా అందించింది.
Oppo K13 5G : ఫీచర్స్
ఒప్పో కె 13 5జి స్మార్ట్ ఫోన్ చాలా స్లీక్ డిజైన్ ను కలిగి ఉంటుంది. అయితే, ఇంత సన్నగా ఉన్నా ఈ ఫోన్ పెద్ద 7000 mAh గ్రాఫైట్ బ్యాటరీ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ బిగ్ బ్యాటరీని వేగంగా ఛార్జ్ చేసే 80W సూపర్ VOOC ఛార్జ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో 6.66 ఇంచ్ AMOLED స్క్రీన్ ఉంటుంది. ఈ స్క్రీన్ ఇన్ స్క్రీన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, 120Hz రిఫ్రెష్ రేట్, 1200 నిట్స్ పీక్ బ్రైట్నెస్ మరియు FHD+ రిజల్యూషన్ కలిగి ఉంటుంది.
కెమెరా పరంగా, ఈ ఫోన్ లో వెనుక 50MP మెయిన్ సెన్సార్ కలిగిన డ్యూయల్ కెమెరా ఉంటుంది. ఈ ఫోన్ AI కెమెరా ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ను క్వాల్కమ్ యొక్క లేటెస్ట్ బడ్జెట్ పవర్ ఫుల్ 5G చిప్ సెట్ Snapdragon 6 Gen 4 చిప్ సెట్ తో పని చేస్తుంది. ఈ ఫోన్ 8GB ర్యామ్ మరియు 256GB ఇంటర్నల్ స్టోరేజ్ కూడా కలిగి ఉంటుంది. ఒప్పో కె 13 5జి స్మార్ట్ ఫోన్ ColorOS 15 సాఫ్ట్ వేర్ పై ఆండ్రాయిడ్ 15 OS తో వస్తుంది.
Also Read: లేటెస్ట్ 625W 5.1ch Dolby సౌండ్ బార్ పై అమెజాన్ ధమాకా ఆఫర్ అందుకోండి.!
ఈ ఒప్పో అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ మరిన్ని ఫీచర్స్ వివరాల్లోకి వెళితే, ఈ ఫోన్ ను అధిక గేమింగ్ సమయంలో కూడా చల్లగా ఫోన్ ను చల్లగా ఉండేందుకు వీలుగా పెద్ద వేపర్ ఛాంబర్ (VC) ఫీచర్ తో కూడా అందించింది. ఈ ఫోన్ లో డ్యూయల్ స్టీరియో స్పీకర్లు మరియు ఇన్ఫ్రారెడ్ రిమోట్ కంట్రోల్ ఫీచర్ ను కూడా అందించింది.