ఒప్పో F19 ప్రో మరియు F19 ప్రో ప్లస్ భారీ ఫీచర్లతో విడుదల

ఒప్పో F19 ప్రో మరియు F19 ప్రో ప్లస్ భారీ ఫీచర్లతో విడుదల
HIGHLIGHTS

ఒప్పో F19 ప్రో మరియు F19 ప్రో ప్లస్ స్మార్ట్ ఫోన్స్ లాంచ్

రెండు కూడా గొప్ప కెమెరా ఫీచర్లతో వస్తాయి

ఒప్పో తన ఒప్పో F19 ప్రో మరియు F19 ప్రో ప్లస్ స్మార్ట్ ఫోన్లను ఇండియాలో లాంచ్ చేసింది. ఈ ఒప్పో F19 ప్రో మరియు F19 ప్రో ప్లస్ రెండు కూడా గొప్ప కెమెరా ఫీచర్లతో వస్తాయి.  ఈ స్మార్ట్ ఫోన్స్ చాలా సన్నగా వున్నా కూడా మంచి పెరఫార్మెన్స్ అందించే విధంగా వుంటాయని ఒప్పో తెలిపింది. ఈ ఫోన్లు 48MP క్వాడ్ కెమెరా, లాంగ్ బ్యాటరీ, సూపర్ అమోలెడ్ స్క్రీన్ వంటి చాలా ఆకర్షణీయమైన ఫీచర్లను కలిగి ఉంటాయి.

ఒప్పో F19 ప్రో మరియు F19 ప్రో ప్లస్: ధర

ఒప్పో F19 ప్రో (8జీబీ + 128 జీబీ వేరియంట్) : రూ.21,490

ఒప్పో F19 ప్రో ప్లస్ (8జీబీ + 128 జీబీ వేరియంట్) : రూ.25,990

ఒప్పో F19 ప్రో మరియు F19 ప్రో ప్లస్: స్పెషిఫికేషన్లు

 

ఈ రెండు ఒప్పో ఫోన్లు కూడా దాదాపుగా ఒకే విధమైన స్పెషిఫికేషన్లను కలిగి ఉంటాయి. అయితే, వీటి ప్రొసెసర్ల లో మాత్రం చాలా అంతరం వుంది. ఈ స్మార్ట్ ఫోన్స్ 6.43-అంగుళాల Full HD + (2400 x 1080 పిక్సెల్స్) రిజల్యూషన్ గల సూపర్ AMOLED డిస్ప్లే తో కలిగి ఉంటాయి. ఈ ఫోన్లలో సెల్ఫీ కెమెరా కోసం డిస్ప్లేలో కుడి వైపు పైన పంచ్-హోల్ డిజైన్ ని ఇచ్చింది. ఈ స్క్రీన్ 90% స్క్రీన్ టూ బాడీ నిష్పత్తితో వస్తుంది మరియు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది.

ఇక పెరఫార్మెన్స్ విషయానికి వస్తే, ఒప్పో F ప్రో మీడియా టెక్ హీలియో P95 ఆక్టా కోర్ ప్రాసెసర్ శక్తితో వస్తుంది. అయితే, ఒప్పో F ప్రో ప్లస్ మాత్రం డ్యూయల్ 5G సిమ్ సపోర్ట్ గల మీడియా టెక్ డైమెన్సిటీ 800U SoC తో వస్తుంది. ఈ రెండు ఫోన్లు కూడ  8GB RAM మరియు 128GB స్టోరేజ్ ఎంపికలతో లభిస్తాయి. ఈ రెండు ఫోన్లు కూడా ఆండ్రాయిడ్ 11-ఆధారిత కలర్ OS 11.1 స్కిన్ పైన పనిచేస్తాయి.

ఇక కెమెరాల పరంగా, F19 ప్రో మరియు F19 ప్రో ప్లస్ వెనుక భాగంలో క్వాడ్-కెమెరా సెటప్ తో వస్తాయి. ఈ సెటప్ లో 48MP ప్రాధమిక  కెమెరా, దీనికి జతగా 8MP అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరా, 2MP మాక్రో కెమెరాని మరియు 2MP డెప్త్ సెన్సార్ లను జతచేసింది. ముందు భాగంలో, ఈ ఫోన్ పైభాగంలో పంచ్-హోల్ కటౌట్ లోపల 16 MP సెల్ఫీ కెమెరా ఉంది.

ఈ రెండు ఫోన్లలో సెక్యూరిటీ కోసం ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు 4,130 ఎమ్ఏహెచ్ బ్యాటరీ అందించింది. కానీ, ఛార్జింగ్ సపోర్ట్ విషయంలో చాలా తేడా వుంది. F19 ప్రో స్మార్ట్ ఫోన్ 30W వూక్ ఫ్లాష్ ఛార్జ్ 4.0 సపోర్ట్ తో ఉండగా, F19 ప్రో ప్లస్ మాత్రం 50W ఫ్లాష్ ఛార్జ్ సపోర్ట్ తో చాలా వేగంగా ఛార్జ్ చేసే విధంగా వుంటుంది. 

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo