Oppo F35 Pro ఫోన్ డ్యూయల్ 4K కెమెరా సెటప్ తో లాంచ్ అవుతోంది.!

HIGHLIGHTS

Oppo F35 Pro స్మార్ట్ ఫోన్ లాంచ్ అనౌన్స్ చేసిన ఒప్పో

ఈ స్మార్ట్ ఫోన్ కీలక ఫీచర్ కూడా రివీల్ చేయడం ప్రారంభించింది

ఫోన్ ను డ్యూయల్ 4K కెమెరా సెటప్ తో లాంచ్ చేస్తున్నట్లు కంపెనీ కన్ఫర్మ్ చేసింది

Oppo F35 Pro ఫోన్ డ్యూయల్ 4K కెమెరా సెటప్ తో లాంచ్ అవుతోంది.!

Oppo F35 Pro స్మార్ట్ ఫోన్ లాంచ్ అనౌన్స్ చేసిన ఒప్పో ఈ స్మార్ట్ ఫోన్ యొక్క కీలక ఫీచర్ కూడా రివీల్ చేయడం ప్రారంభించింది. ఒప్పో ఎఫ్ 35 సిరీస్ నుండి రెండు స్మార్ట్ ఫోన్ లను లాంచ్ చేస్తోంది. వీటిలో ఒప్పో ఎఫ్ 35 ప్రో స్మార్ట్ ఫోన్ ని అద్భుతమైన కెమెరా సెటప్ మరియు ఫీచర్స్ తో లాంచ్ చేయబోతున్నట్లు కొత్తగా టీజర్ విడుదల చేసింది. ఈ ఫోన్ ను డ్యూయల్ 4K కెమెరా సెటప్ తో లాంచ్ చేస్తున్నట్లు కంపెనీ కన్ఫర్మ్ చేసింది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Oppo F35 Pro : లాంచ్ డేట్

ఒప్పో ఎఫ్ 35 ప్రో స్మార్ట్ ఫోన్ అక్టోబర్ 5వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు భారత మార్కెట్లో లాంచ్ అవుతుంది. ఇదే సిరీస్ నుంచి ఈ ఫోన్ తో ఒప్పో ఎఫ్ 35 స్మార్ట్ ఫోన్ కూడా ఒప్పో లాంచ్ చేస్తుంది. ఈ రెండు స్మార్ట్ ఫోన్లను అమెజాన్ ఇండియా ద్వారా టీజింగ్ చేసింది మరియు లాంచ్ తర్వాత అమెజాన్ ద్వారా సెల్ కి కూడా అందుబాటులోకి వస్తాయి.

Oppo F35 Pro : కెమెరా సెటప్

ఒప్పో ఎఫ్ 35 ప్రో స్మార్ట్ ఫోన్ లో వెనుక డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో OIS 50MP ప్రధాన కెమెరా కెమెరా మరియు జతగా 8MP అల్ట్రా వైడ్ కెమెరా ఉంటాయి. ఈ కెమెరాతో జతగా అల్ట్రా బ్రైట్ డ్యూయల్ రియర్ ఫ్లాష్ లైట్ కూడా ఉంటుంది. ఈ ఫోన్ ముందు భాగంలో కూడా 50MP సెల్ఫీ కెమెరా ఉంది. ఈ ఫోన్ రియర్ మెరియు ఫ్రంట్ రెండు కెమెరాలు కూడా 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ కలిగి ఉంటాయి.

Oppo F35 Pro camera

అందుకే, ఈ ఫోన్ యూ డ్యూయల్ 4కే కెమెరా సెటప్ తో వచ్చే ఫోన్ గా ఒప్పో తెలిపింది. కేవలం 4కే వీడియో రికార్డింగ్ మాత్రమే కాదు ఈ ఫోన్ ను AI పాప్ అవుట్, AI రీమిక్స్ కోలాజ్, డయల్ వీడియో, న్యూ పోర్ట్రైట్ మోడ్ వంటి మరిన్ని ఫిచ్ర్స్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో అందించిన బిగ్ సెల్ఫీ కెమెరా చాలా సహజమైన ఫోటోలు అందించే శక్తి కలిగి ఉన్నట్లు కూడా ఒప్పో తెలిపింది. ఈ ఫోన్ కెమెరా మోడ్యూల్ ని కొత్త స్మైల్ కర్వ్ డిజైన్ తో అందించింది. ఇది ఈ ఫోన్ ను చాలా ప్రీమియం ఫోన్ గా చూపిస్తుంది.

Also Read: AI కాదు SI : ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ కి కొత్త పేరు నామకరణం చేసిన డొనాల్డ్ ట్రంప్.!

ప్రస్తుతానికి, ఒప్పి ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ కెమెరా ఫీచర్స్ మాత్రమే రివీల్ చేసింది. ఈ ఫోన్ డిజైన్, ప్రాసెసర్ మరియు బ్యాటరీ వంటి కీలక ఫీచర్స్ కూడా ఒక్కొక్కటిగా విడుదల చేస్తుంది. ఈ ఫోన్ లాంచ్ కంటే ముందే ఈ ఫోన్ మైన్ ఫీచర్స్ అన్ని రివీల్ చేసే అవకాశం ఉంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile