AI కాదు SI : ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ కి కొత్త పేరు నామకరణం చేసిన డొనాల్డ్ ట్రంప్.!

HIGHLIGHTS

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AI అనగానే అందరికీ సుపరిచితమైన పేరు

ఈ పేరును ఇప్పుడు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కొత్త పేరుతో నామకరణం చేశారు

Artificial Intelligence (ఏఐ) కృత్రిమ మేధస్సును ఇక నుంచి Super Intelligence (SI) గా మారింది

AI కాదు SI : ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ కి కొత్త పేరు నామకరణం చేసిన డొనాల్డ్ ట్రంప్.!

AI కాదు SI : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AI అనగానే అందరికీ సుపరిచితమైన పేరు మరియు ఈ ఇంటెలిజెన్స్ ను అందరూ రోజువారీ జీవితంలో కూడా ఉపయోగిస్తున్నారు. అయితే, అందరికీ సుపరిచితమైన ఈ పేరును ఇప్పుడు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కొత్త పేరుతో నామకరణం చేశారు. ఇప్పటివరకు Artificial Intelligence (ఏఐ) కృత్రిమ మేధస్సును ఇక నుంచి Super Intelligence (SI) గా సంబోధించాలని అధికారికంగా ప్రకటించారు.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

AI కాదు SI : అఫీషియల్ అనౌన్స్

అవును, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ఇక నుంచి సూపర్ ఇంటెలిజెన్స్ గా పిలవాలని ట్రంప్ పేర్కొన్నారు. సెప్టెంబర్ 29వ తేదీన ట్రంప్ ఈ విషయాన్ని ప్రకటించగా, సెప్టెంబర్ 30న వెలువడిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా పేరుకు అధికారిక రూపం వచ్చింది. అంటే, ఈరోజు నుంచి ఏఐ అని కాకుండా ఎస్ఐ అని ఈ మేధస్సును సంభోదించాలి.

అసలు AI పేరును ఎందుకు మార్చారు?

ఈ పేరును మార్చడానికి లేదా ఈ పేరులో మార్పు చేయడానికి ప్రధాన కారణం ఈ పేరులో ఉన్న ‘ఆర్టిఫిషియల్’ అనే పదమే కారణమని ట్రంప్ చెప్పుకొచ్చారు. ఆర్టిఫిషియల్ అంటే నకిలీ లేదా కృత్రిమమైన అనే అర్థం రావడం దీనికి సరైన గౌరవం కాదని తెలిపారు. నిజానికి ప్రస్తుతం అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ మనుషుల కంటే కూడా ఎక్కువ తెలివితేటలు కలిగి సూపర్ పవర్ గా మారాయని తెలిపారు.

AI TO super intelligence SI

అందుకే, ఈ ఇంటెలిజెన్స్ ని సూపర్ ఇంటెలిజెన్స్ గా ఆయన కొనియాడారు. అందుకే, ఈ అత్యున్నతమైన సాంకేతికతను సూపర్ ఇంటెలిజెన్స్ గా మార్చారు. అంతేకాదు, వైట్‌ హౌస్ విడుదల చేసిన ఫ్యాక్ట్‌ షీట్‌ లో కూడా సూపర్ ఇంటెలిజెన్స్ ఎస్ఐ గా దీన్ని పిలవాలని వెల్లడించారు.

అందరూ ఇదే పేరును ఉపయోగించాలా?

లేదు, ప్రపంచం మొత్తం ఈ కొత్త పేరును ఉపయోగించాలని ఎక్కడా చెప్పలేదు. ట్రంప్ తీసుకొచ్చిన మార్పు ప్రధానంగా అమెరికా ఫెడరల్ ప్రభుత్వ అధికారిక ఉపయోగానికి సంబంధించిన విషయం. ప్రపంచంలోని అన్ని కంపెనీలు, విశ్వవిద్యాలయాలు, పరిశోధనా సంస్థలు, ఇతర దేశాల ప్రభుత్వాలు కూడా AI ని SI అని పిలవాల్సిన అవసరం లేదు.

కొత్త పేరు ఎలా వచ్చింది?

ఈ కొత్త పేరును కేవలం ఒక్క రోజులో మార్పు చేయలేదు. ఈ పేరు మార్పు కోసం ట్రంప్ ముందుగా సోషల్ మీడియా ద్వారా ప్రజల అభిప్రాయాన్ని అడిగారు. ఇందులో మొత్తం మూడు కొత్త పేర్లు ఆయన సూచించారు. అవేమిటంటే, సూపర్ ఇంటెలిజెన్స్ (ఎస్ఐ), ఎక్స్ ట్రీమ్ ఇంటెలిజెన్స్ (EI) మరియు సుప్రీమ్ ఇంటెలిజెన్స్ (ఎస్ఐ) మూడు ఉన్నాయి. అయితే, వీటిలో సూపర్ ఇంటెలిజెన్స్ (ఎస్ఐ) మరియు సుప్రీమ్ ఇంటెలిజెన్స్ (ఎస్ఐ) పేర్లు ఎక్కువగా ఓట్లు సంపాదించాయి. అందుకే, ఈ రెండు పేర్ల మధ్య కూడా మరో పోలింగ్ నిర్వహించారు. చివరికి, సూపర్ ఇంటెలిజెన్స్ పేరు విజేతగా నిలిచింది. ఇలా ఈ పేరును ఏఐ స్థానంలో కూర్చోబెట్టారు.

అంటే, కొత్త పేరును సూచించే ప్రక్రియలో ట్రంప్ స్వయంగా కొన్ని పేర్లను ప్రతిపాదించి, సోషల్ మీడియా ఓటింగ్ ద్వారా ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకున్నారు మరియు వారి అభిప్రాయాన్ని గౌరవిస్తూ, సూపర్ ఇంటెలిజెన్స్ పేరును అధికారికంగా ముందుకు తీసుకువచ్చారు.

Also Read: Price Hike: రేపటి నుంచి టీవీలు, Ac, ఫ్రిడ్జ్ మరియు వాషింగ్ మెషిన్ ధరలు మొత మోగనున్నాయి.!

ఈ పేరుకు అర్థం ఏమిటి?

టెక్నాలజీ రంగంలో “సూపర్ ఇంటెలిజెన్స్” అనే పదానికి సాధారణంగా మనుషుల మేధస్సును అనేక రంగాల్లో అధిగమించే స్థాయి తెలివితేటలు కలిగిన వ్యవస్థ అనే అర్థం వస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile