Price Hike: రేపటి నుంచి టీవీలు, Ac, ఫ్రిడ్జ్ మరియు వాషింగ్ మెషిన్ ధరలు మొత మోగనున్నాయి.!
ఈ సంవత్సరం మొబైల్ ఫోన్ లతో సహా చాలా ప్రొడక్ట్స్ ధరలో దారుణంగా పెరిగిపోయాయి
ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాలు కొనుగోలు చేయాలనుకుంటున్న వినియోగదారులకు షాకింగ్ న్యూస్
రేపటి నుంచి AC, టెలివిజన్లు, రిఫ్రిజిరేటర్, వాషింగ్ మెషీన్లు వంటి కొన్ని ఉత్పత్తుల ధరలను తయారీ సంస్థలు పెంచే అవకాశం
Price Hike: పండుగల సీజన్ ప్రారంభం కానున్న వేళ ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాలు కొనుగోలు చేయాలనుకుంటున్న వినియోగదారులకు షాకింగ్ న్యూస్. ఇప్పటికే ఈ సంవత్సరం మొబైల్ ఫోన్ లతో సహా చాలా ప్రొడక్ట్స్ ధరలో దారుణంగా పెరిగిపోయాయి. ఇప్పటికే ధరల పెరుగుదల ప్రజలకు ఆందోళన కలిగిస్తుంటే, రేపటి నుంచి అంటే 2026 అక్టోబర్ 1 నుంచి ఎయిర్ కండిషనర్లు (AC), టెలివిజన్లు, రిఫ్రిజిరేటర్, వాషింగ్ మెషీన్లు వంటి కొన్ని ఉత్పత్తుల ధరలను తయారీ సంస్థలు పెంచే అవకాశం ఉందనే వార్త ప్రజలను మరింత కలవరపరుస్తోంది.
SurveyPrice Hike: అక్టోబర్ 1 భయం
1 అక్టోబర్ 2026 తేదీ ఇప్పుడు అందరికీ భయం కలిగించే డేట్ గా మారింది. ఎందుకంటే, అక్టోబర్ 1 నుంచి వీలు, Ac, ఫ్రిడ్జ్ మరియు వాషింగ్ మెషిన్ ధరలను పెంచుతున్నట్లు తయారీ కంపెనీలు తెలిపాయి. ఇది ప్రభుత్వం విధించే కొత్త పన్ను లేదా అన్ని ఎలక్ట్రానిక్ వస్తువులపై ఒకే రేటుతో అమలయ్యే ధర పెంపు కాదు. ఉత్పత్తుల తయారీ ఖర్చు, ముడిసరుకుల ధరలు మరియు రవాణా ఖర్చులు వంటి తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని తయారీ కంపెనీలు MRP లేదా సరఫరా ధరలు సవరించే క్రమంలో తీసుకున్న నిర్ణయం.
Price Hike: ఈ వస్తువుల ధరలు పెరుగుతాయి
చాలా కంపెనీలు చెబుతోన్న వివరాల ప్రకారం, ఎయిర్ కండిషనర్ AC, రిఫ్రిజిరేటర్, LED TV లు, వాషింగ్ మెషిన్ మరియు మరికొన్ని వస్తువుల రేట్లు పెరిగే అవకాశం వుంది. మార్కెట్ లో పెరిగిన కాపర్, అల్యూమినియం, స్టీల్, ప్లాస్టిక్ వంటి మరిన్ని ముడి సరుకులు ధరలు పెరగడంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తయారీ కంపెనీలు పేర్కొన్నాయి.
ఇక ఈ ప్రొడక్ట్స్ పై ఎంత మేరకు రేటు పెరిగే అవకాశం ఉందని చూస్తే, ఎయిర్ కండిషనర్ AC పై 5 నుంచి 8 శాతం, రిఫ్రిజిరేటర్ లపై 3 నుండి 4 శాతం, LED TV లపై 3 నుంచి 4 శాతం మరియు వాషింగ్ మెషిన్స్ పై 3 నుంచి 4 శాతం రేట్లు పెరిగే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.

LED TV లపై ఎక్కువ హైక్ ఎందుకు?
ఎల్ఈడి స్మార్ట్ టీవీ మొబైల్ ఫోన్ మాదిరిగా చిప్ సెట్, సౌండ్ బార్ మాదిరిగా స్పీకర్ మరియు బిగ్ స్క్రీన్ ను కలిగి ఉంటుంది. ఇందులో బిగ్ ప్లాస్టిక్ అండ్ మెటల్ ఫ్రేమ్ తో పాటు పెద్ద సర్క్యూట్ బోర్డు కూడా ఉంటుంది. ఇందులో కాపర్ మొదలు కొని, అల్యూమినియం, ప్లాస్టిక్ మరియు గోల్డ్ కూడా ఉపయోగించబడుతుంది. మార్కెట్ లో ఇప్పటికే ఇక్కడ సూచించిన అన్ని ముడి సరుకుల రేట్లు భారీగా పెరిగాయి. అందుకే, LED TV రేట్లు అన్నింటి కంటే కూడా ఎక్కువగా ప్రైస్ హైక్ అందుకోనున్నాయి.
పెరిగే రేట్ల గురించి వివరంగా చెప్పాలంటే, ఈరోజు రూ. 50,000 రూపాయల ధరలో లభించే ఎల్ఈడి టీవీ అక్టోబర్ 1 నుంచి 5 శాతం పెరిగినా కూడా రూ. 52,500 రేటుకు చేరుకుంటుంది.
AC లపై ప్రభావం ఎక్కువగా ఎందుకు?
ఎయిర్ కండిషనర్ తయారీ లో కూడా కాపర్, స్టీల్, అల్యూమినియం, ప్లాస్టిక్ వంటి ముడిసరుకులకు ప్రాధాన్యం ఉంటుంది. వీటి ధరల్లో పెరుగుదలతో పాటు రవాణా, ఫ్రైట్ ఖర్చు మరియు కరెన్సీ మార్పులు కూడా కంపెనీల ఖర్చులను ప్రభావితం చేస్తున్నాయి. అందుకే, ఏసీ రేట్లు కూడా అధికంగా పెరగనున్నాయి.
Also Read: 5.2.4 True Dolby Atmos సౌండ్ బార్ లాంచ్ చేసిన Noise .. బడ్జెట్ ప్రైస్ లో అదిరే ఫీచర్స్.!
అక్టోబర్ 1 తర్వాత వెంటనే షోరూమ్ ధరలు పెరిగిపోతాయా?
ఈ విషయం పై కచ్చితమైన లెక్కలు వుండవు. అయితే, ఇక్కడ వినియోగదారులు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే పాత స్టాక్ తో పాత రేటు. అంటే, డీలర్లు ధరల పెంపు ముందే కొంత స్టాక్ ను కొనుగోలు చేసి గోడౌన్ లో స్టాక్ చేసి ఉంటే, ఆ ఉత్పత్తులను పాత ధరలకు లేదా పాత ధరలపై అందుబాటులో ఉన్న డిస్కౌంట్లతో విక్రయించే అవకాశం ఉంటుంది. ఇది పండుగ సీజన్ కాబట్టి పాట డిస్కౌంట్ లేదా రీజనబుల్ ధరలకు ప్రొడక్ట్స్ లభించే అవకాశం ఉండవచ్చు.
కాబట్టి, కొనుగోలుదారులు అక్టోబర్ 1 తేదీని మాత్రమే చూసి నిర్ణయం తీసుకోకుండా, ప్రస్తుత ధర, డిస్కౌంట్, పాత స్టాక్, కొత్త MRP, వారంటీ మరియు మొత్తం కొనుగోలు ఖర్చులను పోల్చి నిర్ణయం తీసుకోవడం మంచిది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile
