5.2.4 True Dolby Atmos సౌండ్ బార్ లాంచ్ చేసిన Noise .. బడ్జెట్ ప్రైస్ లో అదిరే ఫీచర్స్.!

HIGHLIGHTS

Noise ఇండియన్ మార్కెట్లో కొత్తగా ఆకట్టుకునే సౌండ్ బార్ లాంచ్ చేసింది

లేటెస్ట్ సౌండ్ బార్ ని 5.2.4 True Dolby Atmos సౌండ్ టెక్నాలజీ మరియు గొప్ప డిజైన్ తో అందించింది

ఇంటి రంగును బట్టి డెకరేషన్ మాదిరిగా నచ్చిన రంగు ఎంచుకునే అవకాశం యూజర్లకు అందించింది

5.2.4 True Dolby Atmos సౌండ్ బార్ లాంచ్ చేసిన Noise .. బడ్జెట్ ప్రైస్ లో అదిరే ఫీచర్స్.!

ప్రముఖ భారతీయ లీడింగ్ కన్జ్యూమర్ టెక్ కంపెనీ Noise ఇండియన్ మార్కెట్లో కొత్తగా ఆకట్టుకునే సౌండ్ బార్ లాంచ్ చేసింది. ఈ లేటెస్ట్ సౌండ్ బార్ ని 5.2.4 True Dolby Atmos సౌండ్ టెక్నాలజీ మరియు గొప్ప డిజైన్ తో అందించింది. అంతేకాదు ఈ కొత్త సౌండ్ బార్ ని ఆకట్టుకునే ధరలో కూడా ఆఫర్ చేసింది. దసరా పండుగ సందర్భంగా రాబోతున్న బిగ్ డీల్స్ లో భాగంగా ఈ సౌండ్ బార్ ని విడుదల చేసినట్లు తెలిపింది. నోయిస్ సరికొత్తగా విడుదల చేసిన ఈ లేటెస్ట్ డాల్బీ అట్మోస్ సౌండ్ బార్ ప్రైస్ అండ్ ఫీచర్స్ ఎలా ఉన్నాయో ఒక లుక్కేద్దాం పదండి.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Noise 5.2.4 True Dolby Atmos సౌండ్ బార్ : ప్రైస్

నోయిస్ ఈ కొత్త సౌండ్ బార్ ని Noise Home Stage పేరుతో లాంచ్ చేసింది. ఈ సౌండ్ బార్ ని బ్లాక్ అండ్ సిల్వర్ రెండు కలర్ ఆప్షన్ లో అందించడం విశేషం. ఇక ప్రైస్ విషయానికి వస్తే, నోయిస్ ఈ లేటెస్ట్ సౌండ్ బార్ ని రూ. 24,999 రూపాయల ప్రైస్ ట్యాగ్ తో లాంచ్ చేసింది. ఈ సౌండ్ బార్ ని కంపెనీ సైట్ నుంచి సేల్ కి కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. అలాగే, ఫ్లిప్ కార్ట్ నుంచి కూడా ఈ సౌండ్ బార్ లభిస్తుంది.

ఈ సౌండ్ బార్ ని HDFC కార్డ్స్ తో తీసుకునే వారికి రూ. 1,000 అదనపు బ్యాంక్ డిస్కౌంట్ మరియు రూ. 1,300 అదనపు డిస్కౌంట్ ఆఫర్ ని కూడా నోయిస్ ఈ సౌండ్ బార్ పై అందించింది. ఈ ఆఫర్స్ తో ఈ సౌండ్ బార్ రూ. 22,699 ఆఫర్ ధరలో లభిస్తుంది.

Also Read: Vivo S2 FE లాంచ్ డేట్ అనౌన్స్ చేసిన వివో .. పండుగ సేల్ కోసం ముందే రిలీజ్ అవుతోంది.!

Noise 5.2.4 True Dolby Atmos సౌండ్ బార్ : ఫీచర్స్

నోయిస్ ఈ సౌండ్ బార్ ని చాలా ప్రీమియం డిజైన్ తో లాంచ్ చేసింది. అంతేకాదు, ఈ సౌండ్ బార్ ను బ్లాక్ అండ్ సిల్వర్ రెండు రంగుల్లో ఆఫర్ చేసింది. ఇంటి రంగును బట్టి డెకరేషన్ మాదిరిగా నచ్చిన రంగు ఎంచుకునే అవకాశం యూజర్లకు అందించింది. ఇది ఈ సౌండ్ బార్ లో మంచి అప్గ్రేడ్ అవుతుంది. ఎందుకంటే, చాలా కంపెనీలు కేవలం సింగిల్ కలర్ లో మాత్రమే సౌండ్ బార్ లను ఆఫర్ చేస్తున్నాయి.

Noise 5.2.4 True Dolby Atmos Soundbar

ఇక సెటప్ విషయానికి వస్తే, ఇది 5.2.4 సెటప్ తో వస్తుంది. ఇందులో మూడు ఫ్రంట్ స్పీకర్లు, పైన రెండు అప్ ఫైరింగ్ స్పీకర్లు కలిగిన బార్ ఉంటుంది. అలాగే, డౌన్ ఫైరింగ్ ఉఫర్ కలిగిన డ్యూయల్ సబ్ ఉఫర్ కూడా ఉంటుంది. చివరిగా, ఈ సెటప్ లో ఫ్రంట్ అండ్ అప్ ఫైరింగ్ సరౌండ్ స్పీకర్ సెటప్ కలిగిన డ్యూయల్ శాటిలైట్ స్పీకర్ లు కూడా కలిగి ఉంటుంది. ఈ టోటల్ సెటప్ తో ఈ సౌండ్ బార్ 700W సౌండ్ అందిస్తుంది.

ఈ సౌండ్ బార్ 5.2.4 ట్రూ డాల్బీ అట్మోస్ సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో వస్తుందని కంపెనీ తెలిపింది. ఈ సౌండ్ బార్ కలిగిన స్పీకర్ సెటప్ మరియు సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో నిజమైన సినిమా థియేటర్ వంటి సౌండ్ ని ఇంటికి తీసుకువస్తుందని నోయిస్ ఈ సాంబార్ గురించి ప్రత్యేకంగా తెలిపింది. ఈ సౌండ్ బార్ HDMI eArc, USB, ఆప్టికల్ ఇన్, AUX మరియు బ్లూటూత్ వెర్షన్ 5.3 వంటి మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ తో వస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile