Vivo S2 FE లాంచ్ డేట్ అనౌన్స్ చేసిన వివో .. పండుగ సేల్ కోసం ముందే రిలీజ్ అవుతోంది.!
Vivo S2 FE స్మార్ట్ ఫోన్ మార్కెట్లో విడుదల చేస్తున్నట్లు వివో ప్రకటించింది
ఈ రోజు ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ యొక్క లాంచ్ డేట్ ని అనౌన్స్ చేసింది
Dimensity 7300e తో అందించే అవకాశం ఉందని లీక్స్ చెబుతున్నాయి
Vivo S2 FE స్మార్ట్ ఫోన్ ను ఇండియన్ మార్కెట్లో విడుదల చేస్తున్నట్లు ప్రకటించిన వివో, ఈ రోజు ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ యొక్క లాంచ్ డేట్ ని అనౌన్స్ చేసింది. 2026 దసరా పండుగ సందర్భంగా రాబోతున్న బిగ్ డీల్స్ ని దృష్టిలో ఉంచుకొని వివో ఈ స్మార్ట్ ఫోన్ ని పండగ సేల్ కంటే ముందే రిలీజ్ చేయడానికి నిశ్చయించుకుంది. అంటే, ఈ స్మార్ట్ ఫోన్ ని కూడా పండుగ సేల్ నుంచి సేల్ కి అందుబాటులోకి తీసుకరావడానికి యోచిస్తున్నట్లు మనం అర్థం చేసుకోవచ్చు.
SurveyVivo S2 FE లాంచ్ డేట్ ఏమిటి?
అక్టోబర్ 6వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ఈ స్మార్ట్ ఫోన్ ఇండియన్ మార్కెట్లో విడుదల చేయబోతున్నట్లు వివో డేట్ అండ్ టైం కన్ఫర్మ్ చేసింది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ని అమెజాన్ మరియు ఫ్లిప్ కార్ట్ ద్వారా టీజింగ్ చేసింది మరియు లాంచ్ తర్వాత ఈ రెండు ప్లాట్ ఫామ్స్ తో పాటు రిటైల్ స్టోరేజ్ నుంచి కూడా సేల్ కి అందుబాటులోకి తీసుకువచ్చే అవకాశం ఉంటుంది. అందుకే, ఈ స్మార్ట్ ఫోన్ యొక్క సేల్ అక్టోబర్ 9వ తేదీన ప్రారంభం కాబోతున్న పండుగ సేల్ నుంచి స్టార్ట్ కావచ్చని అంచనా వేస్తున్నారు. అయితే, ఈ ఫోన్ లాంచ్ తర్వాత ఈ విషయం క్లియర్ అవుతుంది.
Vivo S2 FE : ఫీచర్స్
ఈ వివో అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ఫీచర్స్ ని కంపెనీ ఇంకా రిలీజ్ చేయలేదు. అయితే, ఈ అప్ కమింగ్ లీక్డ్ ఫీచర్స్ ఈ ఫోన్ గురించి ఒక అంచనా అందిస్తున్నాయి. అవేమిటంటే, వివో ఈ ఫోన్ ను మీడియాటెక్ లేటెస్ట్ 5జి ప్రాసెసర్ Dimensity 7300e తో అందించే అవకాశం ఉందని లీక్స్ చెబుతున్నాయి. అంతేకాదు, ఈ ఫోన్ లో 6GB ఫిజికల్ ర్యామ్ జతగా 6GB అధనపు ర్యామ్ ఫీచర్ తో పాటు 128GB స్టోరేజ్ అందించే అవకాశం ఉండవచ్చు.

వివో ఎస్ 2 FE స్మార్ట్ ఫోన్ లో వెనుక రిఫ్లెక్టివ్ వేవ్ ప్యాట్రన్ కలిగిన సరికొత్త బ్యాక్ ప్యానల్ తో ఉన్నట్లు కొన్ని లీక్స్ చెబుతున్నాయి. ఈ ఫోన్ లో 1.5K రిజల్యూషన్ మరియు 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ కలిగిన 6.84 ఇంచ్ పరిమాణం కలిగిన బిగ్ స్క్రీన్ కూడా వుండే అవకాశం ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ ఫోన్ 50MP Sony IMX 852 మెయిన్ తో రావచ్చని మరో లీక్ చెబుతోంది.
Also Read: Redmi 17C రేపు లాంచ్ అవుతోంది .. కానీ కంప్లీట్ ఫీచర్స్ అండ్ ప్రైస్ ఈరోజే తెలుసుకోండి.!
ఈ సిరీస్ గత ఫోన్ తో పోలిస్తే ఈ ఫోన్ డిజైన్ మరియు ఫీచర్స్ పరంగా డౌన్ టోన్ వెర్షన్ గా ఉంటుంది. మరి ఈ ఫోన్ ఎలాంటి ఫీచర్స్ తో లాంచ్ అవుతుందో చూడాలి.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile
