OPPO F27 5G: రేడియంట్ హేలో లైట్ అనే కొత్త లైట్ డిజైన్ తో వచ్చింది.!

HIGHLIGHTS

ఒప్పో ఎఫ్ 27 5జి స్మార్ట్ ఫోన్ ను ఈరోజు విడుదల చేసింది

ఈ ఫోన్ ను సరికొత్త రేడియంట్ హేలో లైట్ అనే కొత్త లైట్ డిజైన్ తో అందించింది

ఈ ఫోన్ చూడటానికి చాలా నాజూకుగా మరియు ప్రీమియం లుక్ తో కనిపిస్తోంది

OPPO F27 5G: రేడియంట్ హేలో లైట్ అనే కొత్త లైట్ డిజైన్ తో వచ్చింది.!

OPPO F27 5G: గత కొన్ని రోజులుగా ఒప్పో టీజింగ్ చేస్తున్న ఒప్పో ఎఫ్ 27 5జి స్మార్ట్ ఫోన్ ను ఈరోజు విడుదల చేసింది. ఈ ఫోన్ ను సరికొత్త రేడియంట్ హేలో లైట్ అనే కొత్త లైట్ డిజైన్ తో అందించింది. ఈ ఫోన్ ను సరికొత్త డిజైన్, కెమెరా మరియు మరిన్ని ఇతర ఫీచర్స్ తో తీసుకు వచ్చినట్లు ఒప్పో తెలిపింది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

OPPO F27 5G: ఫీచర్స్

ఒప్పో ఈ కొత్త స్మార్ట్ ఫోన్ ను వెనుక పెద్ద లైట్ తో అందించింది. దీన్ని రేడియంట్ హేలో లైట్ అని ఒప్పో పిలుస్తోంది. ఈ ఫోన్ చూడటానికి చాలా నాజూకుగా మరియు ప్రీమియం లుక్ తో కనిపిస్తోంది. అంతేకాదు, ఈ ఫోన్ ను ఏమిరాల్డ్ గ్రీన్ మరియు అంబర్ ఆరెంజ్ అనే రెండు ప్రీమియం కలర్ ఆప్షన్ లలో కూడా అందించింది.

OPPO F27 5G Features

ఒప్పో ఈ ఫోన్ ను 120Hz 6.67 ఇంచ్ స్మార్ట్ అడాప్టివ్ AMOLED స్క్రీన్ తో అందించింది. ఈ స్క్రీన్ FHD+ రిజల్యూషన్ మరియు 2100 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ను కలిగి ఉంటుంది. ఒప్పో ఈ ఫోన్ ను మీడియాటెక్ Dimensity 6300 చిప్ సెట్ మరియు 8GB ర్యామ్ + 256GB స్టోరేజ్ లతో అందించింది.

ఒప్పో ఎఫ్ 27 5జి ఫోన్ లో వెనుక 50MP మెయిన్ + 2MP పోర్ట్రైట్ సెన్సార్లు కలిగిన డ్యూయల్ కెమెరా సెటప్ మరియు ముందు 32MP సెల్ఫీ కెమెరా వుంది. ఈ కెమెరా లతో మంచి ఫోటోలు అందించే విధంగా అనేక ఫిల్టర్స్ మరియు ఫీచర్లు కూడా జత చేసినట్లు ఒప్పో తెలిపింది. ఈ ఫోన్ 45W సూపర్ ఊక్ ఫ్లాష్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన 5000 mAh బిగ్ బ్యాటరీ కలిగి వుంది.

Also Read: Neckband: కేవలం రూ. 599 ధరకే పవర్ ఫుల్ మెడ్ ఇన్ ఇండియా నెక్ బ్యాండ్ లాంచ్.!

OPPO F27 5G: ప్రైస్

ఒప్పో ఎఫ్ 27 స్మార్ట్ ఫోన్ ను రెండు వేరియంట్లలో విడుదల చేసింది. ఇందులో 8GB + 128GB బేసిక్ వేరియంట్ ను రూ. 22,999 రూపాయల ధరతో, 8GB + 256GB వేరియంట్ ను రూ. 24,999 రూపాయల ధరతో విడుదల చేసింది. ఏ ఫోన్ రోజు నుండే సేల్ కి అందుబాటులోకి వచ్చింది.

ఆఫర్స్

ఈ ఫోన్ ను Federal, ICICI, BOBCARD, HDFC, OneCard, Federal, SBI మరియు Kotak బ్యాంక్ కార్డ్స్ తో కొనే యూజర్లకు రూ. 2,500 అదనపు తగ్గింపు లభిస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo