OPPO F15 మిడ్ రేంజ్ ధరలో మంచి డిజైన్ మరియు ఫీచర్లతో వచ్చింది
ఈ ఒప్పో F 15 స్మార్ట్ ఫోన్ 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ తో వస్తుంది
OPPO సంస్థ, ఇండియాలో తన F 15 స్మార్ట్ ఫోన్ను విడుదల చేసింది. ఇది లైటనింగ్ బ్లాక్ మరియు యునికార్న్ వైట్ కలర్ రెండు వంటి విభిన్న కలర్స్ లో లభిస్తుంది. ఈ పరికరం యొక్క ముఖ్య ఫీచర్ ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, క్వాడ్ కెమెరా మొదలైనవి ఉన్నాయి.
Surveyఈ ఫోన్ యొక్క స్పెసిఫికేషన్ గురించి మాట్లాడితే, OPPO F15 ఒక 6.3-అంగుళాల AMOLED డిస్ప్లేని కలిగి ఉంది మరియు 2400×1080 పిక్సెల్స్ యొక్క FHD + రిజల్యూషన్ను అందిస్తుంది. అధనంగా, ఈ డిస్ప్లేకి గొరిల్లా గ్లాస్ 5 యొక్క రక్షణ కూడా ఇవ్వబడింది.
కెమేరా పరంగా, ఈ ఫోనులో 48MP (F1.7) ప్రధాన కెమెరా, 8MP (F2.25) అల్ట్రా-వైడ్ యాంగిల్, 2M (F2.4) మాక్రో లెన్స్ మరియు 2M ( F2.4) పోర్ట్రెయిట్ లెన్స్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ సెల్ఫీ కోసం 16MP ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది, ఇది F/ 2.0 ఎపర్చరుతో ఉంది.
ఈ ఒప్పో F 15 స్మార్ట్ ఫోన్ 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ తో వస్తుంది మరియు ఒక డేడికేటెడ్ మెమెరీ కార్డుతో 512 జీబీ వరకూ పెంచవచ్చు. ఒప్పో యొక్క ఈ కొత్త ఎఫ్ 15 ఫోనులో 3 కార్డ్ స్లాట్లు ఇవ్వబడింది. కనెక్టివిటీ కోసం WLAN 802.11a / b / g / n / ac, WLAN 2.4G, WLAN 5.1G, WLAN 5.8G, WLAN డిస్ప్లే, బ్లూటూత్ 4.2 లకు మద్దతు ఇవ్వబడుతోంది.
ఒప్పో ఎఫ్ 15 ఆండ్రాయిడ్ 9 పై ఆధారితంగా ColorOS 6.1.2 పైన పనిచేస్తుంది మరియు Mali G72 జిపియుతో జత చేసిన ఆక్టా-కోర్ మీడియాటెక్ హెలియో పి 70 (ఎమ్‌టి 6771 వి) SoC ని కలిగి ఉంది. Oppo F15 4,000mAh బ్యాటరీని ఒక VOOC 3.0 ఫాస్ట్ ఛార్జింగ్ యొక్క సాంకేతిక మద్దత్తుతో ఇస్తుంది. ఈ ఫోన్ 160.2×73.3×7.9mm కొలతలతో మరియు 172 గ్రాముల బరువుతో ఉంటుంది.
ఒప్పో ఎఫ్ 15 : ధర
ఒప్పో ఎఫ్ 15 యొక్క 8 జిబి ర్యామ్ వేరియంట్ ను రూ .19,990 కు కొనుగోలు చేయవచ్చు మరియు ఈ ఫోన్ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ మరియు ఒప్పో ఇండియా ఆన్‌లైన్ స్టోర్లలో ఈ రోజు నుండి ప్రీ-ఆర్డర్ చేయబోతోంది, అయితే ఈ పరికరం యొక్క మొదటి సేల్ జనవరి 24 నుండి ప్రారంభమవుతుంది. ఇది కాకుండా, వినియోగదారులు ఒప్పో ఎఫ్ 15 తో వన్ టైమ్ స్క్రీన్ రీప్లేస్‌మెంట్ మరియు HDFC కార్డులపై 10 శాతం క్యాష్‌బ్యాక్ పొందవచ్చు.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile
