ఒప్పో లేటెస్ట్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ Oppo A57 ధర, స్పెక్స్ మరియు ఫీచర్లు ఇవే ..!
ఒప్పో లేటెస్ట్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ Oppo A57
ఒప్పో ఎ57 స్మార్ట్ ఫోన్ 4GB/64GB వేరియంట్ తో లభిస్తుంది
3W SuperVOOC సపోర్ట్ కలిగిన 5,000mAh బిగ్ బ్యాటరీతో వస్తుంది
ఒప్పో లేటెస్ట్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ Oppo A57. ఈ సరికొత్త బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ఇండియాలో లేటెస్ట్ గా వచ్చింది. అయితే, ఈస్మార్ట్ ఫోన్ కేవలం బడ్జెట్ ధారలో చాలా ఆకర్షణీయమైన స్పెక్స్ మరియు ఫీచర్లను కలిగి వుంది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ మరియు ఒప్పో ఇండియా స్టోర్‌లో నుండి ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన ఈ స్మార్ట్ ఫోన్ కొనే ముందుగా ఫోన్ వివరాలను తెలుసుకోవాలంటే ఇక్కడ చూడవచ్చు. ఒప్పో ఎ57 స్మార్ట్ ఫోన్ IP54 రేటింగ్ కలిగి దుమ్ము మరియు వాటర్ రెసిస్టెంట్ ఫీచర్ తో వస్తుంది.
SurveyOppo A57: ధర
ఒప్పో ఎ57 స్మార్ట్ ఫోన్ యొక్క ప్రస్తుతం విక్రయిస్తున్న 4GB ర్యామ్ మరియు 64GB స్టోరేజ్ కలిగిన వేరియంట్ తో లభిస్తుంది మరియు దీని ధర రూ.13,999. Oppo A57 అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ మరియు ఒప్పో ఇండియా స్టోర్‌లో అందుబాటులో ఉంది. ఈఫోన్ గ్లోయింగ్ గ్రీన్ మరియు గ్లోయింగ్ బ్లాక్ అనే రెండు కలర్ అప్షన్లలో లభిస్తుంది.
Oppo A57: స్పెసిఫికేషన్లు
ఒప్పో ఎ57 స్మార్ట్ ఫోన్ HD+ రిజల్యూషన్ అందించగల 6.56 ఇంచ్ డిస్ప్లేని కలిగి వుంది మరియు ఇది వాటర్ డ్రాప్ నోచ్ డిజైన్ తో వస్తుంది. ఈ ఒప్పో బడ్జెట్ ఫోన్ మీడియాటెక్ బడ్జెట్ గేమింగ్ ప్రాసెసర్ Helio G35 తో పనిచేస్తుంది. ఈ ప్రాసెసర్ కి జతగా 3/4GB ర్యామ్ మరియు 6GB స్టోరేజ్ తో వస్తుంది. ఫోన్ IPX4 వాటర్ రెసిస్టెంట్ మరియు IP5X డస్ట్ రెసిస్టెంట్ తో కూడా వస్తుంది. అదనపు రక్షణ కోసం డిస్ప్లే ముందు భాగం పాండా గ్లాస్‌తో కప్పబడి ఉంటుంది.
ఇక కెమెరాల పరంగా, ఈ ఫోన్ వెనుక డ్యూయల్ కెమెరా సెటప్ ను LED ఫ్లాష్ తో కలిగి వుంది. ఇందులో, 13MP ప్రధాన కెమెరాకి జతగా 2MP మోనో కెమెరాని అందించింది. అలాగే, సెల్ఫీల కోసం 8MP సెల్ఫీ కెమెరా కూడా వుంది. ఈ ఫోన్ వేగవంతంగా ఛార్జ్ చెయ్యగల సత్తా కలిగిన 33W SuperVOOC సపోర్ట్ కలిగిన 5,000mAh బిగ్ బ్యాటరీతో వస్తుంది. ఈ ఫోన్ లో డ్యూయల్ స్టీరియో స్పీకర్లను కూడా అందించినట్లు ఒప్పో తెలిపింది.
Raja Pullagura
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile