Oppo A16k: ఇండియాలో మరొక బడ్జెట్ స్మార్ట్ ఫోన్ విడుదల చేసిన ఒప్పో

HIGHLIGHTS

ఈరోజు ఇండియాలో ఒప్పో తన Oppo A16k స్మార్ట్ ఫోన్ ను ఆవిష్కరించింది

ఈ స్మార్ట్ ఫోన్ ఒప్పో నుండి వచ్చిన మరొక బడ్జెట్ ఫోన్ గా నిలుస్తుంది

Oppo A16 స్మార్ట్ ఫోన్ యొక్క డౌన్ టోన్ వెర్షన్ గా ఇది మార్కెట్లోకి వచ్చింది

Oppo A16k: ఇండియాలో మరొక బడ్జెట్ స్మార్ట్ ఫోన్ విడుదల చేసిన ఒప్పో

ఈరోజు ఇండియాలో ఒప్పో తన Oppo A16k స్మార్ట్ ఫోన్ ను ఆవిష్కరించింది. ఈ స్మార్ట్ ఫోన్ ఒప్పో నుండి వచ్చిన మరొక బడ్జెట్ ఫోన్ గా నిలుస్తుంది. వాస్తవానికి, Oppo A16k స్మార్ట్ ఫోన్ ను ముందుగా ఫిలిప్పిన్ లో విడుదల చేసింది మరియు ఇప్పుడు ఇండియాలో ప్రకటించింది. అలాగే, ఈ ఫోన్ ఇటీవల వచ్చిన Oppo A16 స్మార్ట్ ఫోన్ యొక్క డౌన్ టోన్ వెర్షన్ గా ఇది మార్కెట్లోకి వచ్చింది. Oppo A16k సింగల్ రియర్ కెమెరా, 4020mAh బ్యాటరీ వంటి బడ్జెట్ ఫీచర్లతో వచ్చింది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Oppo A16k: Price

ఈ ఒప్పో ఎ 16కె  స్మార్ట్ ఫోన్ 3GB ర్యామ్ మరియు 32GB గల సింగిల్ వేరియంట్ తో మాత్రమే వస్తుంది. ఈ ఫోన్ ధర రూ.10,490 రూపాయలు మరియు ఈరోజు నుండి మార్కెట్లో లభిస్తుంది. ఈ ఒప్పో ఫోన్ బ్లూ, వైట్ మరియు బ్లాక్ కలర్ అప్షన్ లలో లభిస్తుంది.    

Oppo A16k: స్పెక్స్

ఒప్పో ఎ16కె ఫోన్ 6.52 ఇంచ్ HD+ రిజల్యూషన్ Eye Care డిస్ప్లేని కలిగివుంది మరియు 1600 x 720 రిజల్యూషన్ అందిస్తుంది. ఈ ఫోన్ మీడియాటెక్ లేటెస్ట్ ప్రోసెసర్ Helio G35 ఆక్టా కోర్ ప్రోసెసర్ జతగా 3GB ర్యామ్ శక్తితో పనిచేస్తుంది మరియు 32GB ఇంటర్నల్ స్టోర్ కూడా అందుతుంది. ఒప్పో ఈ లేటెస్ట్ ఫోన్ కూడా Android 11 ఆధారితంగా ColorOS 11.1 స్కిన్ పైన పనిచేస్తుంది.

ఈ ఫోన్ వెనుక కేవలం సింగల్ కెమెరా సెటప్ మాత్రమే వుంది. ఇందులో 13MP మైన్ కెమెరా మరియు ముందుభాగంలో సెల్ఫీల కోసం 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని కలిగి వుంది. అయితే, ఈ ఫోన్ 7.85 కొలతతో చాలా సన్నగా ఉంటుంది. ఈ ఫోన్ టైప్-C పోర్ట్ తో సాధారణ ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన 4020 mAh  బ్యాటరీతో వస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo