ఒప్పో నుండి మరొ బడ్జెట్ ఫోన్ Oppo A16k వచ్చింది

HIGHLIGHTS

ఒప్పో నుండి మరొక బడ్జెట్ ఫోన్ గా Oppo A16k లాంచ్ అయ్యింది

Oppo A16 యొక్క బడ్జెట్ వెర్షన్ గా ఇది మార్కెట్లోకి వచ్చింది

ఒప్పో ఏ16కె ఫోన్ 6.52 ఇంచ్ HD+ రిజల్యూషన్ Eye Care డిస్ప్లేని కలిగివుంది

ఒప్పో నుండి మరొ బడ్జెట్ ఫోన్ Oppo A16k వచ్చింది

ఒప్పో నుండి మరొక బడ్జెట్ ఫోన్ గా Oppo A16k లాంచ్ అయ్యింది. ఇటీవల Eye Care Display, హెవీ 5,000 mAh బ్యాటరీ వంటి మరిన్ని ప్రత్యేకతలతో వచ్చిన Oppo A16 యొక్క బడ్జెట్ వెర్షన్ గా ఇది మార్కెట్లోకి వచ్చింది. అందుకే, ఈ Oppo A16k సింగల్ రియర్ కెమెరా, 4020mAh బ్యాటరీ వంటి ఫీచర్లతో వచ్చింది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Oppo A16k: Price

ఈ ఒప్పో స్మార్ట్ ఫోన్ ప్రస్తుతానికి ఫిలిప్పిన్ లో మాత్రామే విడుదల చెయ్యబడింది. అక్కడ 3GB ర్యామ్ మరియు 32GB PHP 6,999 (సుమారు రూ. 10,300) సింగిల్ వేరియంట్ తో ప్రకటించింది. అయితే, ఇండియాలో ఈ ఫోన్ లాంచ్ గురించి ఎటువంటి ప్రకటనా చెయ్యలేదు.   

Oppo A16k: స్పెక్స్

ఒప్పో ఏ16కె ఫోన్ 6.52 ఇంచ్ HD+ రిజల్యూషన్ Eye Care డిస్ప్లేని కలిగివుంది మరియు 1600 x 720 రిజల్యూషన్ అందిస్తుంది. ఈ ఫోన్ మీడియాటెక్ లేటెస్ట్ ప్రోసెసర్ Helio G35 ఆక్టా కోర్ ప్రోసెసర్ జతగా 3GB ర్యామ్ శక్తితో పనిచేస్తుంది మరియు 32GB ఇంటర్నల్ స్టోర్ కూడా అందుతుంది. ఒప్పో ఈ లేటెస్ట్ ఫోన్ కూడా Android 11 ఆధారితంగా ColorOS 11.1 స్కిన్ పైన పనిచేస్తుంది.

ఈ ఫోన్ వెనుక కేవలం సింగల్ కెమెరా సెటప్ మాత్రమే వుంది. ఇందులో 13MP మైన్ కెమెరా మరియు ముందుభాగంలో సెల్ఫీల కోసం 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని కలిగి వుంది. అయితే, ఈ ఫోన్ 7.85 కొలతతో చాలా సన్నగా ఉంటుంది. ఈ ఫోన్ టైప్-C పోర్ట్ తో సాధారణ ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన 4020 mAh  బ్యాటరీతో వస్తుంది.

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile