త్వరలో Oneplus 2 స్మార్ట్ ఫోన్ ఓపెన్ సేల్స్

త్వరలో Oneplus 2 స్మార్ట్ ఫోన్ ఓపెన్ సేల్స్
HIGHLIGHTS

ఫ్లాష్ సేల్ కోసం రిజిస్ట్రేషన్స్ అవసరం లేకుండా

oneplus 2 స్మార్ట్ ఫోన్ కొనటానికి నిర్ణయించుకుని దాని invite కోసం అనేక ప్రయత్నాలు చేసే వారికీ ఒక కొత్త అవకాశం. oneplus 2 ను ఓపెన్ సేల్ లో అమ్మనుంది.

తాజగా oneplus ఫోరమ్ లో కంపెని CEO, కార్ల్ "oneplus 2 ను ఒక గంట పాటు ఓపెన్ సేల్స్ లో పెట్టనున్నాము " అని అన్నారు. అయితే ఎప్పుడూ అనేది ఇంకా తెలపలేదు.

కార్ల్ మాటల ప్రకారం ఓపెన్ సేల్ సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలలో జరుగుతుంది. ఇకనుండి oneplus 2 అమెజాన్ తో పాటు స్నాప్ డీల్ లో కూడా దొరుకుతుంది. oneplus వన్ మొదటి మోడల్ మాత్రం ఇప్పుడు ఓపెన్ సేల్స్ లో సేల్ అవుతుంది.

ఈ మధ్యనే విడుదలై ఆర్డర్స్ బుక్ చేసుకున్నా షిప్పింగ్స్ లో late అవటం వలన కంపెని ఈ కొత్త ఐడియా ద్వారా యూజర్స్ కు ఒక అవకాశం ఇవనుంది. ప్రస్తుతం oneplus 2 64gb మోడల్ 24,999 రూ లకు సేల్ అవుతుంది. త్వరలో 16gb మోడల్ కూడా వస్తుంది.

గతంలో ola క్యాబ్స్ అండ్ airtel ద్వారా కంపెని oneplus 2 ను కొనేముందు ఎలా ఉండనుంది అని చూసుకునే అవకాశం ఇచ్చింది. అంటే రిలయన్స్ డిజిటల్ వంటి షాప్స్ లో డిస్ప్లే కు పెట్టె ఫోనుల వలె.

Ajit Singh
Digit.in
Logo
Digit.in
Logo