OnePlus Nord 6 price and features leaked ahead of launch
OnePlus Nord 6 స్మార్ట్ ఫోన్ రేపు ఇండియన్ మార్కెట్లో లాంచ్ అవుతుండగా, ఈ స్మార్ట్ ఫోన్ ప్రైస్ మరియు ఫీచర్లు ఇప్పుడు ఆన్‌లైన్ లో లీక్ అయ్యాయి. ఈ ఫోన్ ను అల్టిమేట్ ఆల్ రౌండర్ ఫోన్ గా ఇండియన్ మార్కెట్ లో లాంచ్ చేస్తున్నట్లు వన్ ప్లస్ చాలా కాలంగా టీజింగ్ చేస్తోంది. ఇప్పుడు ఆన్‌లైన్ లో లీకైన ఈ ఫోన్ లీక్డ్ స్పెక్స్ చూస్తుంటే ఆ మాట నిజమే అనిపిస్తుంది.
వన్ ప్లస్ ఈ స్మార్ట్ ఫోన్ ను మిడ్ రేంజ్ ప్రైస్ సెగ్మెంట్ లో లాంచ్ చేస్తుందని ముందు నుంచే అంచనా వేస్తున్నారు. ఇప్పుడు ఆ అంచనాలకు ఊతమిచ్చేలా ఈ ఫోన్ పై వచ్చిన కొత్త లీక్స్ కనిపిస్తున్నాయి. అదేమిటంటే, వన్ ప్లస్ ఈ ఫోన్ ను రూ. 35,000 నుంచి రూ. 40,000 రూపాయల ఆఫర్ ధరలో లాంచ్ చేసే అవకాశం ఉందని లీక్స్ చెబుతున్నాయి. అంతేకాదు, ఇదే ప్రైస్ సెగ్మెంట్ లో వచ్చే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు కూడా అంచనా వేసి చెబుతున్నాయి.
ఈ ఫోన్ రేపు ఇండియాలో లాంచ్ అవుతుంది కాబట్టి, ఈ ఫోన్ ప్రైస్ పై పూర్తి క్లారిటీ వస్తుంది. ఈ లీక్స్ లో నిజం ఎంత ఉందో కూడా రేపు తెలుస్తుంది.
వన్ ప్లస్ నార్డ్ 6 స్మార్ట్ ఫోన్ సెగ్మెంట్ ఫస్ట్ 9000 mAh బ్యాటరీ ఫోన్ గా లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ లో అందించిన ఈ బిగ్ బ్యాటరీని సైతం వేగంగా ఛార్జ్ చేసే 80W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ ఈ ఫోన్ లో ఉంటుంది. ఈ ఫోన్ 165Hz గొప్ప రిఫ్రెష్ రేట్ కలిగిన 6.78 ఇంచ్ AMOLED స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ 1.5K రిజల్యూషన్ మరియు గొప్ప బ్రైట్నెస్ కూడా కలిగి ఉంటుందని లీక్స్ చెబుతున్నాయి.
ఈ ఫోన్ ట్రిపుల్ చిప్ సెట్ తో లంచ్ అవుతున్నట్లు వన్ ప్లస్ మొదటి నుంచి టీజింగ్ చేస్తోంది. ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8s జెన్ 4 చిప్ సెట్ తో లాంచ్ అవుతుంది. అలాగే, నెట్ వర్క్ కోసం G2 Wi-Fi చిప్ మరియు డిస్ప్లే కోసం ప్రత్యేకమైన టచ్ రిఫ్లెక్స్ చిప్ కూడా ఈ ఫోన్ లో ఉంటాయి. ఈ ఫోన్ లో 12GB LPDDR5X ర్యామ్ మరియు 256GB (UFS 4.1) ఫాస్ట్ స్టోరేజ్ కూడా ఉంటాయి. టోటల్ గా ఈ ఫోన్ పవర్ ప్యాక్ గా వస్తుంది.
Also Read: REDMI Note 15 SE 5G: భారీ డిస్కౌంట్ ఆఫర్స్ తో ఫస్ట్ సేల్ కి సిద్ధమైన రెడ్ మీ ఫోన్.!
కెమెరా పరంగా కూడా ఈ ఫోన్ గొప్ప ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ డ్యూయల్ యాక్సిస్ OIS సపోర్ట్ కలిగిన 50MP మెయిన్ కెమెరా జతగా 8MP అల్ట్రా వైడ్స్ సెన్సార్ కలిగిన డ్యూయల్ రియర్ కెమెరా కలిగి ఉంటుంది. అంతేకాదు, ఈ ఫోన్ ముందు భాగంలో 32MP సెల్ఫీ కెమెరా కూడా ఉంటుంది. ఈ ఫోన్ కలిగిన లేటెస్ట్ AI కెమెరా ఫీచర్స్ తో గొప్ప ఫోటోలు మరియు 4K వీడియో రికార్డింగ్ ఫీచర్ తో గొప్ప ఫోటోలు అందిస్తుందని వన్ ప్లస్ చెబుతోంది. అంతేకాదు, ఈ ఫోన్ ఇండస్ట్రీ లీడింగ్ IP66, 68,69 మరియు IP69K మిలటరీ వాటర్ రెసిస్టెంట్ ఫీచర్ కూడా కలిగి ఉంటుంది.